ముఖ్యాంశాలు

 • Mallu Bhatti Vikramarka appointed as CLP Leader in Telangana Assembly

  ప్రతిపక్ష నాయకుడిగా మల్లు భట్టివిక్రమార్క

 • India vs Australia, 3rd ODI : Dhoni Stars as India Seal ODI Series in Style

  ఆస్ట్రేలియాలో భారత్ మరో చరిత్ర: వన్డే ట్రై సిరీస్ కైవసం

 • Mamata Banerjee to host mega Opposition rally on January 19: Here’s all you need to know

  మమతా బెనర్జీ భారీ ర్యాలీకి వెళ్లనున్న చంద్రబాబు

 • EC instructs AP govt to transfer officers posted at one place for last 3 years

  బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు

 • Yuzvendra Chahal 1st spinner to take 6 wickets in an ODI in Australia

  ఇండియా టార్గెట్ 231: వికెట్ల పతనంలో చాహల్ మరో రికార్డు

తాజా వార్తలు

మరింత +
Mamata Banerjee to host mega Opposition rally on January 19: Here’s all you need to know మమతా బెనర్జీ భారీ ర్యాలీకి వెళ్లనున్న చంద్రబాబు

సీఎం చంద్రబాబు సాయంత్రం కోల్‌కతాకు వెళ్లనున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. రేపు కోల్‌కతాలో యునైటెడ్ ఇండియా పేరుతో విపక్షాల భారీ ర్యాలీ నిర్వహిస్తారు. దేశంలోని బీజేపీయేతర పక్షాలన్నిటినీ ఆహ్వానించి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నరు. ఈ ర్యాలీకి 20 మంది జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు హాజరుకానున్నారు. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ వేడి పెరగడం, అదే సమయంలో జాతీయ రాజకీయాలను సమన్వయం చేయడంలో బిజీగా ఉండడంతో చంద్రబాబు తన దావోస్‌ పర్యటనను రద్దుచేసుకున్నారు.

CBI team investigating Satyam Babu in Ayesha Meera case ఆయేషా హత్య కేసులో సత్యంబాబు సీబీఐ విచారణ

సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. ఇవాళ కృష్ణా జిల్లా నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చేరుకున్న ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం సత్యంబాబును విచారిస్తోంది. ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న సత్యంబాబు దాదాపు 8సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించి ఆ తరువాత నిర్దోషిగా విడుదలయ్యారు. ప్రస్తుతం సత్యంబాబు ఇంట్లోని ఓ గదిలో విచారణ జరుగుతోంది. సీబీఐ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అయేషా మీరా హత్యకు తనకు ఏమీ సంబంధం లేదనీ తను ఒప్పుకునేలా పోలీసులే బెదిరించారని సత్యంబాబు వాపోయారు. అలా ఒప్పుకోకపోతే తన చెల్లిని, తల్లిని చంపుతామన్నారనీ తనను కూడా ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారన్నారు. అందుకే హత్య కేసును ఒప్పుకున్నట్లు సత్యంబాబు సీబీఐ అధికారులకు తెలిపారు. మూడు గంటల పాటు సాగిన ఈ విచారణకు సంబంధించి విషయాలు రాజ్ న్యూస్ కెమెరాకు చిక్కాయి.

NTR family pay tributes to NTR at Ghat on 23rd death anniversary ఎన్టీఆర్‌ ఘాట్‌లో కుటుంబ సభ్యుల నివాళి

స్వర్గీయ నందమూరి తారకరామారావు 23వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌లో నందమూరి కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్ తెల్లవారుజామునే వెళ్లి ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అనంతరం నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని, దర్శకుడు క్రిష్‌ తదితరులు ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు పుష్పాంజలి ఘటించారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్యరి, మంత్రి నారాలోకేష్ సతీమణి బ్రహ్మిణి ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు చేయూత నిచ్చి అధికారం కట్టబెట్టిన ఘనత తన తండ్రికి చెందుతుందని బాలకృష్ణ అన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుండిపోతారని చెప్పారు. తెలుగువారందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. తన తాత ఎన్టీఆర్‌ అడుగు జాడల్లో నడుస్తామని, ఆయన స్ఫూర్తితో ముందడుగు వే​స్తున్నామని నందమూరి సుహాసిని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎల్లప్పుడూ కృషి చేశారన్నారు.

రీల్ న్యూస్

మరింత +
Vishal wedding: Hero vishal to tie the knots with anisha reddy త్వరలో అనీశాతో విశాల్ నిశ్చితార్థం

హైదరాబాద్ వ్యాపారవేత్త కూతురు అనీశాతో తమిళ సినీ నటుడు విశాల్‌ నిశ్చితార్థం జరుగనుంది. త్వరలో హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరుగుతుందని సమాాచారం. ఈ పెళ్లిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అనీశాతో విశాల్ వివాహం గురించి గతంలో విశాల్‌ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ తొలి చిత్రం పెళ్లి చూపులు సినిమాలో ప్రేయసిగా నటించిన అనీశాని విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. విజయ్‌ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంలోనూ స్నేహితుడి ప్రేయసిగా అనీశా నటించింది. విశాల్‌తో కలిసి దిగిన ఫొటోను అనీశా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. విశాల్‌ మంచి మనసు తనకెంతో నచ్చిందని తెలిపింది అనీశా. విశాల్‌తో జీవితం పంచుకుని ఆయన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తానని చెప్పింది. ఈ నెలలోనే హైదరాబాద్‌లో నిశ్చితార్థం జరగబోతోందని విశాల్‌ తండ్రి వెల్లడించారు. పెళ్లి కూడా నగరంలోనే నట.

Vijay Sethupathi first look in Syeraa Narasimhareddy biopic movie సైరా నరసింహారెడ్డిలో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్

భారత స్వాతంత్య్ర సమరయోధుడు కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డిగా భారీ అచంనాలతో వస్తున్నారు. ఈ సినిమాకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విజయ్‌ రాజా పాండి అనే పాత్రలో నటిస్తున్నారు. విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం మోషన్‌ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో వీరుడిలా కనిపిస్తున్న విజయ్‌ సేతుపతి లుక్‌ మరింత ఆకట్టుకుంటోంది.

Director Shankar's Indian-2 movie first look out భారతీయుడు-2 ఫస్ట్ లుక్ విడుదల

కమల్ హసన్ నటించిన భారతీయుడు-2 చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ విడుదలైంది. ప్రముఖ డైరెక్టర్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కమల్, శంకర్ కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. భారతీయుడు-2 సినిమాను గతేడాది తీయాలనుకున్నా.. నటుడు కమల్‌హాసన్ రాజకీయాలతో అటు శంకర్ రోబో-2 సినిమాతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అయింది. కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో వస్తోన్న ఇండియన్-2 సినిమా జనవరి 18న సెట్స్‌పైకి వెళ్లనుంది. తండ్రి సేనాపతి పాత్రలో కమల్ మర్మకళను ప్రదర్శిస్తున్నట్లు పోస్ట‌ర్‌లో కనబడుతోంది. కాజల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

జాతీయ వార్తలు

మరింత +
EC instructs AP govt to transfer officers posted at one place for last 3 years బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు

సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఒడిసా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అధికారుల బదిలీ, పోస్టింగులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం ఒకే దగ్గర పనిచేస్తున్న వారు, సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ కార్యదర్శి లేఖ రాశారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు, గత నాలుగేళ్ల కాలంలో మూడేళ్లు ఒకే దగ్గర పని చేస్తున్న వారు, 2019 మే 31 వరకు మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్నవారు బదిలీలకు అర్హులని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బదిలీ చేసిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో లేదా 2017 మే 31కు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన చోట పోస్టింగ్‌ ఇవ్వవద్దని సూచించారు.  

ఎన్నికల విధులు నిర్వర్తించే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌, సహాయక రిటర్నింగ్‌ అధికారులతో పాటు కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, తహసీల్దార్‌, మండల అభివృద్ధి అధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. ఎన్నికలకు భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే పోలీసు బలగాల్లో రేంజ్‌ ఐజీ, డీఐజీలు, ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకూ ఇవి వర్తిస్తాయన్నారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని, ఫిబ్రవరి 28లోపు బదిలీలు పూర్తి చేసి మార్చి తొలి వారంలోగా వివరాలివ్వాలన్నారు.

Special director Rakesh Asthana moved out of CBI రాకేశ్ అస్థానాపై బదిలీ వేటు

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై బదిలీ వేటు పడింది. సీబీఐ నుంచి తప్పించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయన్ని బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, సీబీఐ చీఫ్ పదవి నుంచి అలోక్ వర్మను తప్పించి ఫైర్ సర్వీసెస్ డీజీగా ఇటీవల బదిలీ చేశారు. మనస్తాపం చెందిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అలోక్ వర్మ రాజీనామా చేసిన నాలుగు రోజులకే, సీబీఐలో నెంబర్ 2గా కొనసాగిన అస్థానాను ఆ పదవి నుంచి తప్పించడం గమనార్హం.

Jammu Kashmir Students federation meet governor to Ban PUBG Game due to youth and students over addiction పబ్‌జీ గేమ్‌ బ్యాన్ చేయండి.. లేదంటే విద్యార్థులు ఫెయిల్!

పబ్‌జీ గేమ్‌కు యువత, విద్యార్థులు పూర్తిగా బానిసలుగా మారారు అనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూనే గడిపేస్తున్నారట జమ్ముకశ్మీర్ విద్యార్థులు. దీంతో చదువులు అటకెక్కుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్య విడుదలైన పది, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాల్లో చాలా దారుణంగా ఉన్నాయని వాపోయారు. వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని జమ్ముకశ్మీర్ విద్యార్థుల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ నాయక్‌ను కలిసి పబ్‌జీ గేమ్‌‌ని నిషేధించాల్సిందిగా కొందరు విద్యార్థులు కోరారు. విద్యార్థులు ఈ గేమ్‌కు బానిసలవుతున్నారని వారు అభిప్రాయపడ్డారు.

క్రీడా వార్తలు

మరింత +
India vs Australia, 3rd ODI : Dhoni Stars as India Seal ODI Series in Style ఆస్ట్రేలియాలో భారత్ మరో చరిత్ర: వన్డే ట్రై సిరీస్ కైవసం

భారత్‌, ఆస్ట్రేలియాలో మరో చరిత్ర సృష్టించింది. మెల్ బోర్న్ లో జరిగిన చివరి వన్డే‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 71 ఏళ్ల అనంతరం భారత్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ తో పాటు, వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో ధోనీ, జాదవ్ ల జోడీ.. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగులతో రాణించారు. చివరి రెండు ఓవర్ల వరకు పది పరుగుల తేడా కనిపించినా జాదవ్ బౌండరీ హిట్లతో కవర్ చేశాడు. మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది భారత్. 87 పరుగులతో ధోనీ నాటౌట్‌గా నిలువగా..జాదవ్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి 46, ధావన్ 23 పరుగులు చేశారు.

Yuzvendra Chahal 1st spinner to take 6 wickets in an ODI in Australia ఇండియా టార్గెట్ 231: వికెట్ల పతనంలో చాహల్ మరో రికార్డు

సిడ్నిలో జరుగుతున్న నిర్ణ‌యాత్మ‌క మూడో వన్డేలో భారత్ ఆటగాళ్లు చెలరేగి పోయారు. 48.4 ఓవర్లలో 230 రన్స్ కొట్టి ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. యజువేంద్ర చాహల్ ఒక్కడు 42 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీయడం విశేషం. ఇది అతనికి అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో రికార్డు.  అంతకు ముందు సౌతాఫ్రికాతో గతేడాది సెంచూరియన్ లో ఆడిన వన్డేలో 22 పరుగులకు 5 వికెట్లు తీసి చరిత్ర కెక్కాడు చాహల్. ప్రస్తుత ఆటలో రెండు వికెట్లు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌‌ కు దక్కాయి. అంత‌కుముందు వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. కొద్దిసేప‌టి అనంత‌రం వ‌ర్షం ఆగటంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ ఆట గెలుపైనే సిరీస్ ఎవరిదనేది తేలిపోతుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో రెండు జ‌ట్లు 1-1తో స‌మంగా ఉన్న విషయం తెలిసిందే.

Rishabh Pant posts photo with girlfriend Isha Negi. Fans can't keep calm వీరిద్దరి మనసులు ఒకటయ్యాయి..!

భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రేమలో పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశాడు. నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వు నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే నేను చేయాల్సింది’ అని కామెంట్‌‌ను కూడా జోడించాడు. కాగా ఆ అమ్మాయి పేరు ఇషా నేగి అని అతని సన్నిహితులు వెల్లడించారు.

అంతర్జాతీయం వార్తలు

మరింత +
China grows the first plants on the Moon చంద్రుడిపై తొలిసారి పత్తి విత్తనం మొలక

చైనా దేశం మరో అద్భుతం సృష్టించింది. చందమామపై తొలిసారి మొక్కను మొలకెత్తించింది. ఇందులో చాలా విత్తనాలు విఫలమైనప్పటికీ పత్తి వితనం మాత్రం మొలకెత్తింది. దీంతో చంద్రుడిపై పంటలు పండించి మనుష్యులకు అనుకూలమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయాలన్న శాస్త్రవేత్తల ప్రయత్నం ఫలించింది. ఇటీవల చైనా చంద్రుడి ఆవలి భాగంపైకి చేంజ్ 4 ప్రోబ్‌ను పంపిన విషయం తెలిసిందే. అందులో కొన్ని రకాల విత్తనాలను ఓ కంటైనర్ లో పెట్టి అమర్చారు. ఇది చంద్రుడి ఆవలి భాగంపై దిగిన తర్వాత ఈ విత్తనాలను అక్కడ వదిలేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రోబ్ పంపడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చంద్రుడిపై పత్తి విత్తనం మొలకెత్తడం అద్భుతమని చైనాలోని చాంగ్‌కింగ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అన్నారు. ఇక అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తమకు కావాల్సిన ఆహారాన్ని అక్కడే పండించుకొనేందుకు వీలు కలిగిందన్నారు.

Nairobi attack: At least 11 dead in hotel complex, as evacuations continue కెన్యాలోని నైరోబీలో హోటల్‌‌పై ఆత్మాహుతి దాడి

కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. మ‌ృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి సమాచారం అందుకున్న వెంటనే హోటల్‌ కాంప్లెక్స్‌ను భద్రతాబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. విదేశీయులు అధికంగా ఉండే హోటల్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని సోమాలియా ఉగ్రవాద సంస్థ ‘అల్‌-షబాబ్‌’ ప్రకటించుకుంది.

Federal shutdown is impacting everyday American life, jobs, vacations మూడు వారాలుగా అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్

గత కొద్ది రోజులుగా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం తీవ్ర అడ్డంకులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సెనెట్‌లో బిల్లులు ప్రవేశపెట్టే సమయాల్లో డెమోక్రాట్ల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతుంది. ఇటీవల కాలంలో ట్రంప్ దుందుడుకు తనం, వలసలపై తీసుకుంటోన్న కఠిన నిర్ణయాలు వెరసి సభలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో 5.7 బిలియన్ డాలర్ల ఖర్చుతే మెక్సికో సరిహద్దులో గోడను నిర్మించాలనే ట్రంప్ ప్రతిపాదనను డెమోక్రాట్లు వ్యతిరేకించారు. ఈ ఆందోళనల మధ్య సభలో ప్రవేశపెట్టిన వినియోగ బిల్లు వీగిపోయింది. ఫలితంగా ప్రభుత్వం షట్‌డౌన్ అయ్యింది.  

అమెరికాలో వినియోగ బిల్లులు ఆమోదం పొందాలంటే ఉభయసభల అంగీకారం తప్పనిసరి. మొదటగా ఈ బిల్లులను 100 మంది సభ్యులు గల సెనెట్‌లో ప్రవేశపెడతారు. బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావాలి. అధ్యక్షుడు దానిపై సంతకం చేయాలి. కానీ బిల్లు ప్రవేశపెట్టిన సమయాన అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుకుంది. ట్రంప్ సరిహద్దు గోడ నిర్ణయాన్ని ప్రతిపాదించగా వలసల రక్షణ చట్టాన్ని రూపొందించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో వినియోగ బిల్లు ఆమోదం పొందలేకపోయింది. ఫలితంగా ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించేందుకు నిధులు కరువయ్యాయి. షట్‌డౌన్ కారణంగా గత డిసెంబర్ 21 అర్ధరాత్రి నుంచి నిధులు నిలిచిపోయాయి. 9 ఫెడరల్ డిపార్ట్‌మెంట్‌ల సేవలు నిలిచిపోయాయి. జాతీయ పార్క్ లు మూతపడ్డాయి. వలస కోర్టులు సస్పెండ్ అయ్యాయి. వైజ్ఞానిక పరిశోధనలు నిలిచిపోయాయి.  

2013 లో బరాక్ ఒబామా నేతృత్వంలోని డెమోక్రాట్ల ప్రభుత్వాన్ని కూడా రిపబ్లికన్లు 16 రోజులు షట్ డౌన్ చేశారు. ఆరోగ్య సంబంధమైన బిల్లును విజయవంతం చేయడంలో డెమోక్రాట్లు విఫలమయ్యారు. నేడు రిపబ్లికన్ ప్రభుత్వాన్ని డెమోక్రాట్లు నిలిపివేశారు. వలసలపై కఠిన నిర్ణయాలను ఎత్తివేయాలని ఆందోళన చేస్తున్నారు. వలసల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.  

షట్‌డౌన్ మూడవ వారం కూడా కొనసాగుతోంది. ఒకవేళ ఈ షట్‌డౌన్ గనక వారంతం దాకా కొనసాగినట్లయితే దీర్ఘకాల షట్‌డౌన్‌గా రికార్డులకు ఎక్కనుంది. ఇదిలావుంటే సోమవారం టాక్స్ రీఫండ్స్ చెల్లించాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ వారికి వైట్‌హౌజ్ ఆదేశాలు జారిచేసింది. దీని ప్రభావంతో ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు సంక్షేమ పథకాలు కూడా నిలిచేపోయే ప్రమాదం ఉంది. జాతీయ ఆహార సహాయ పథకం అమలుకు జనవరి చివరి వరకే నిధులు ఉన్నాయి. ఫిబ్రవరిలో నిధులు విడుదల కాకపోతే ఆ పథకం నిలిచిపోతుంది. మరోవైపు 8 లక్షల ఫెడరల్ ఉద్యోగులు వేతనాలు అందక నిరాశకు లోనవుతున్నారు. షట్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ పర్యావరణ రక్షణ సంస్థ నేషనల్ సిక్ డే నిర్వహించటానికి సన్నద్ధమవుతుంది. ఎయిర్ పోర్టుల వద్ద నిరసన తెలుపడానికి రవాణా భద్రత ఉద్యోగుల మద్దతును కోరుతోంది.  

యూఎస్ కాంగ్రెస్, వైట్‌హౌజ్‌ల మధ్య భిన్న అభిప్రాయాలు నెలకొనడమో ఈ ప్రతిష్టంభకు మూలకారణంగా తెలుస్తుంది. అమెరికా, మెక్సికో దేశాల మధ్య గోడ నిర్మించాలని ట్రంప్ డిమాండ్‌తోనే ఈ ప్రతిష్టంభనకు బీజం పడింది. అమెరికన్లు ప్రభుత్వం, ట్రంప్ పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ చాలా మంది మెక్సికో గోడ నిర్మాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఇదిలావుండగా, పిట్ట గోడ అంశంలో డెమోక్రాట్లు వ్యతిరేకత వలన ప్రభుత్వాన్ని షట్‌డౌన్ చేస్తున్నందుకు గర్వంగా ఉందని గత డిసెంబర్‌లో ట్రంప్ వెల్లడించింది తెలిసిందే.  

ఈ ప్రతిష్టంభన వలన పరిపాలన సంబంధమైన కార్యకలాపాలు నిలిచిపోతాయి. సంక్షేమ పథకాల అమలుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగులు నిరాశకు గురవుతారు. ఆరోగ్య, బీమా రంగాలు స్తంభించిపోతాయి. వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారవుతుంది. ఇలా జరగకూడదు అంటే తక్షణమే సెనెట్ లో జాతీయ భద్రత గురించి చర్చ జరగాలి. స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలి. అదీ సాధ్యం కాకపోతే పరిస్థితి చినభిన్నం అయ్యే పరిస్థితి ఉంది. ట్రంప్ మంగళవారం నేషనల్ ఎమర్జెన్సీ విధించే అవకాశాల కోసం ప్రసంగించారు. అదే గనక జరిగితే ట్రంప్ జాతీయ సంక్షోభం ప్రకటిస్తారు. అప్పుడు మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి కాంగ్రెస్ ఆమోదం అవసరం ఉండదు. నేరుగా గోడ నిర్మాణం చేపట్టవచ్చు.

డెస్క్ నుండి

ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ ఖాన్ ప్రమాణ స్వీకారం

ఎంఐఎం నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. 1994లో తొలిసారి శాసన సభకు ఎన్నికైన ఖాన్ ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సీనియర్ల జాబితాలో చేరిపోయారు.  

ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ ప్రొటెం స్పీకర్ గా ఎంపికకైన ఈయన వయస్సు 70ఏళ్లు. రెండు దశాబ్దాలుగా ఎంఐఎం పార్టీలో క్రియా శీలకంగా పని చేస్తున్న ముంతాజ్ అహ్మద్ ఖాన్ 1994లో యాకుత్ పుర నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకు ముందునుంచే రాజకీయాల్లో ఉన్నా 1994లో తొలిసారి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం లభించింది. దీంతో అహ్మద్ ఖాన్ బరిలో నిలిచి విజయం సాధించారు. అప్పటి నుంచి జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలుచుకుంటూ వచ్చారు. ఇలా 1994నుంచి 2014ఎన్నికల వరకు ఖాన్ యాకుత్ పుర నుంచే బరిలో నిలిచి గెలిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో ఆయన 62 వేల 3910 ఓట్లు సాధించి సమీప బీజేపీ అభ్యర్థి రూప్ రాజ్ పై విజయకేతనం ఎగురవేశారు.  

మొదట్నుంచి యాకుత్ పుర నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించిన అహ్మద్ ఖాన్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చార్మినార్ నుంచి బరిలో దిగారు. పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గాన్ని మార్చుకున్న ఖాన్ 69వేల 595ఓట్లు సంపాదించి సమీప టీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డిపై విజయం సాధించారు. ఈ గెలుపుతో ఖాన్ మొత్తం ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతగా సీనియర్ల జాబితాలో చేరిపోయారు.  

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రొటెం స్పీకర్ గా ఎంపికకాబడ్డారు. సాధారణంగా ప్రొటెం స్పీకర్ ఎంపికకు ఒక స్పష్టమైన విధానం ఉంటుంది. అసెంబ్లీలో సభానాయకుణ్ని మినహాయించి మిగితా సభ్యుల్లో ఎవరు ఎక్కువసార్లు, వరుసగా అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించి ఉంటారో వారికే ప్రొటెం స్పీకర్‌గా అవకాశం లభిస్తుంది. ప్రస్తుత అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను మినహాయిస్తే వరుసగా ఆరుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా, సీనియర్‌గా అహ్మద్ ఖాన్ ఉన్నారు. అందుకే ఆయనకు ప్రొటెం స్పీకర్ గా అవకాశం లభించింది.  

ప్రొటెం స్పీకర్ గా ఎంపిక కావడం పట్ల ఖాన్ ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా చదవండి7 Days Ago
చారిత్రాత్మక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం

చారిత్రాత్మక 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల సూచించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోవడంతో లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలోనూ యథావిధిగా ఆమోదం పొందింది. ఈబీసీ బిల్లుకు పెద్దలసభలో మూడింట రెండొంతులపైగా సభ్యులు మద్దతిచ్చారు. సభకు మొత్తం 172 మంది సభ్యులు హాజరవగా 165 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. కేవలం ఏడుగురు మాత్రమే వ్యతిరేకంగా ఓటువేశారు.  

ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లు త్వరలోనే చట్టరూపం దాల్చనుంది. చారిత్రాత్మక 124వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాల సూచించిన సవరణ ప్రతిపాదనలు వీగిపోవడంతో.. లోక్‌సభ ఆమోదం పొందిన బిల్లు రాజ్యసభలోనూ యథావిధిగా ఆమోదం పొందింది. ఈబీసీ బిల్లు చట్టబద్ధత కోసం ఆర్టికల్ 15, 16లకు కేంద్రం అదనపు క్లాజ్‌లను జోడించింది. ఆర్టికల్ 15కి క్లాజ్ (6), ఆర్టికల్ 16కి క్లాజ్ (6)ని జోడించింది. ఈబీసీ బిల్లుకు పెద్దలసభలో మూడింట రెండొంతులపైగా సభ్యులు మద్దతిచ్చారు. సభకు మొత్తం 172 మంది సభ్యులు హాజరవగా 165 మంది బిల్లుకు మద్దతు తెలిపారు. కేవలం ఏడుగురు మాత్రమే వ్యతిరేకంగా ఓటువేశారు. దాంతో ఈబీసీ బిల్లు పాసైందని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ప్రకటించారు.  

ఈబీసీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ప్రతిపాదించాయి. ఆ ప్రతిపాదనపై సభలో డిప్యూటీ ఛైర్మన్ ఓటింగ్ చేపట్టారు. కేవలం 18 మంది మాత్రమే ఓటు వేయడంతో..ఆ ప్రతిపాదన వీగిపోయింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ వర్తింపజేయాలన్న సవరణ ప్రతిపాదనను రాజ్యసభ తిరస్కరించింది. వీటితో పాటు మరికొన్ని సవరణ ప్రతిపాదనలు సైతం వీగిపోయాయి.  

సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ తీసుకున్న కీలకమైన రాజకీయ అంశానికి పార్టీలకు అతీతంగా మద్దతు లభించింది. బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల ఆధిక్యాన్ని మించిన మద్దతును ప్రభుత్వం కూడగట్టగలిగింది. బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడంతో చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో త్వరలోనే చట్టం రూపంలో అమల్లోకి రానుంది.  

న్యాయ సమీక్షలో ఈ బిల్లు నిలబడదని లోక్ సభలో మాదిరిగానే.. రాజ్యసభలోనూ పలువురు ఎంపీలు అభిప్రాయపడ్డారు. అయితే.. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్‌ కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.  

సుప్రీంకోర్టు ఈ బిల్లును అంగీకరిస్తుందని తాము నమ్మకంతో ఉన్నట్లు అధికార బీజేపీ ఎంపీలు తెలిపారు. సంశయాలకు ఎంతమాత్రం ఆస్కారం లేదని చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని.. మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్‌ ప్రయోజనం సిద్ధిస్తుందని స్పష్టం చేశారు.  

బిల్లు ఆమోదం పొందిన తర్వాత పెద్దల సభ నిరవధికంగా వాయిదా పడింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రాత్మక బిల్లును రూపొందించింది.

ఇంకా చదవండి13 Days Ago
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందుతుందా?

అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణకు వీలుగా లోక్ సభలో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టింది. సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్ చాంద్ గెహ్లాట్ లోక్‌స‌భ‌లో బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. మధ్యాహ్నం 5 గంటలకు బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో అగ్ర‌కులాల‌కు మోదీ స‌ర్కార్ ప‌ది శాతం కోటా ఇవ్వాల‌ని నిర్ణయించింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం.  

అయితే, రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. దాంతో, అగ్రవర్ణ పేదల కోటాకు ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరిస్తాయని బీజేపీ అంచనా వేస్తోంది అయితే బిల్లుకు వ్యతిరేకం కాదంటూనే విపక్షాలు ఎలాంటి అధ్యాయనం లేకుండా అంగీకరించేదిలేదంటూ తెగేసి చెతున్నాయి. ఈనేపథ్యంలో నేడు లోక్ సభలో బిల్లు ఆమోదం పొందితేనే.. బిల్లు రేపు రాజ్యసభకు వెళుతుంది. నిజానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగియాల్సిఉన్నాయి. అయితే అగ్రవర్ణాలకు రిజర్వేషన్ల అంశంపై రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో రాజ్యసభ కార్యకలాపాలను ప్రభుత్వం మరో రోజు పొడిగించింది. కాగా.. విపక్షాల ఆంక్షల నేపథ్యంలో ఇవాళ లోక్ సభలో బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ లోక్ సభ ఆమోదం పొందినా.. అధికార బీజేపీకి పూర్తి మెజారిటీలేని రాజ్యసభలో పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.  

ఇప్పటివరకు ఆర్థికంగా వెనుకబడినప్పటికీ జనరల్ క్యాటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేవు. దీంతో రిజర్వేషన్ల అమలు కోసం అగ్రవర్ణాల్లోని పేదలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయససభల్లో రాజ్యాంగ సవరణకు బిల్లు ఆమోదం పొందితే.. అన్నీ మతాల్లో అగ్రవర్ణాలకు పదిశాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. వార్షికాదాయం 8లక్షల లోపు ఉన్నవారు ఈ కోటా పరిధిలోకి వస్తారు. అయితే కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, విద్యాసంస్థల్లో మాత్రమే రిజర్వేషన్ల అమలు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో రిజర్వేషన్లు అమలు కావాలంటే.. ఆయా ప్రభుత్వాలు దీనిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి15 Days Ago
ఈసారి చంద్ర‌బాబు ఎన్నిక‌ల వ్యూహం ఏంటి..?

టిడిపి అధినేత చంద్ర‌బాబు ఎన్నిక‌ల వ్యూహం ఏంటి..? ఆయ‌న గ‌తంలో చెప్పినట్టు ఎన్నిక‌ల‌కు మూడు నెల‌లు ముందుగానే కొంత మంది అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందా..? TDP సంప్ర‌దాయ ధోర‌ణికి వ్య‌తిరేకంగా బాబు ఇలాంటి నిర్ణయం తీసుకునే ధైర్యం చేస్తారా..? ప్ర‌స్తుతం ఇదే అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మరోవైపు పొత్తులపై చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ.. ఈసారి ఏపీ ఎన్నికల్లో బాబు వ్యూహమేంటి?  

పంచాయితీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర్నుంచి పార్ట‌మెంట్  ఎన్నిక‌లు వ‌ర‌కు  సీరియ‌స్ గా తీసువ‌డం చంద్ర‌బాబుకు అల‌వాటు. సీరియ‌స్‌గా తీసుకోవ‌డ‌మే కాకుండా అందుగు త‌గిన‌ట్టు రాజ‌కీయ వ్యూహాలు ర‌చించ‌డంలో చంద్రబాబు దిట్ట‌. ఈ ఏడాది చంద్ర‌బాబు  ముందు రెండు  స‌వాళ్లు ఉన్నాయి. ఒక‌టి  కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని  మార్చ‌డం... రెండు రాష్ట్రంలో తిరిగి  అధికారంలోకి రావ‌డం. ప్ర‌స్తుతం బాబు ముందున్న  అతి పెద్ద ల‌క్ష్యాలు ఇవే. దీంతో  రాబోయే రోజుల్లో జ‌రిగే  ఎన్నిక‌ల‌ను బాబు బాగా సీరియ‌స్‌గా  తీసుకున్నారు.  

ఏపీలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్ర‌స్తుతం ఎంఎల్ ఏల  పై ఉన్న వ్య‌తిరేక‌త‌పై బాబు బాగా దృష్టి పెట్టారు. తెలంగాణాలో  శాస‌న స‌భ్యుల‌పై కొంత వ్య‌తిరేక‌త ఉన్నా  కెసిఆర్ పై  ఉన్న  విశ్వాసంతో  తిరిగి అధికారంలోకి  రాగ‌లిగారు.అయితే ఏపీలో ప‌రిస్థితులు ఈ ర‌కంగా ఉంటాయో  లేదో అనే అనుమానాలు చంద్ర‌బాబులో ఉన్నాయి.దీంతో   చంద్ర‌బాబు అభ్య‌ర్ధుల మార్పుపై ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు.అయితే ఈ ఎన్నిక‌ల్లో కొంత త‌న స‌హ‌జ వైఖ‌రికి  బిన్నంగా చంద్ర‌బాబు ఎన్నిక‌లు కొన్ని  నెల‌లు ముందుగానే కొన్ని టికెట్లు ప్ర‌క‌టిస్తామ‌న్నారు. కానీ, ఆచ‌ర‌ణ‌లో ఇది ఎంత‌వర‌కు సాధ్యం అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  

ఎంఎల్ఏల పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌నే అంశంపై చంద్ర‌బాబు ద‌గ్గ‌ర అనేక ర‌కాల స‌ర్వేలు ఉన్నాయి. ఏ జిల్లాలో ఎంత మందిపై వ్యతిరేక‌త ఉన్న‌ది లెక్క‌ల వారీగా రిపోర్టులు తెప్పించుకున్నారు బాబు.ప‌నితీరు మెరుగు ప‌రుచుకుంటే ఎంత మంది ఫ‌లితం  సాధిస్తారు అనే  లెక్క‌లు కూడా ఉన్నాయి.అయితే చివ‌ర‌కు ఒక 40 మందిని మారిస్తేనే ప‌రిస్థితి బావుంటుందనే నిర్ణ‌యానికి  చంద్ర‌బాబు వ‌చ్చారని తెలుస్తోంది. ఇదే సమయంలో 40 మందిని మారిస్తే 40 మంది రెబెల్స్ ను త‌యారు చేసుకున్న‌ట్టే అనే విష‌యం బాబుకు తెలుసు. కానీ, సుదీర్ఘ ప్ర‌యోజ‌నాల కోసం  ఇది త‌ప్ప‌నస‌రి.దీంతో కొంతమంది అభ్య‌ర్ధుల‌ను ముందుగానే ప్ర‌క‌టిస్తే.. కొంత వ‌ర‌కు జ‌నంలోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని చంద్ర‌బాబు అభిప్రాయప‌డుతున్నట్లు తెలుస్తోంది.  

అభ్య‌ర్ధుల‌కు ఉన్న వ్య‌తిరేక‌త , సామాజిక  నేప‌ధ్యం, ఆర్ధిక ప‌రిస్థితి ఇవ‌న్నీ ద‌ృష్టిలో పెట్టుకుని ఈ సారి చంద్ర‌బాబు  టికెట్లు ఇచ్చే అవ‌కాశం ఉంది. అయితే ఇందుకోసం కొంత క‌స‌ర‌త్తు చేసిన బాబు.. ఈ నెల‌లో 40 నుంచి  50 మంది వ‌ర‌కు లిస్ట్ ప్ర‌క‌టించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది.ఈ కార్య‌క్ర‌మంలో నేత‌లు, ఎంఎల్ఏలు చురుగ్గా పాల్గొనాలంటే.. అభ్య‌ర్ధుల ఎంపిక ఉంటుందనే సంకేతాలు పంపితే వారు మరింత చురుగ్గా జ‌న్మ‌భూమిలో ప‌ని చేస్తారనే అభిప్రాయంతో బాబు ఉన్నారు.  

జ‌న‌సేన‌తో పొత్తు విష‌యంలో కూడా చంద్ర‌బాబు ఆచి తూచి మాట్లాడారు. ఒక వేళ ఎన్నిక‌ల‌కు ముందే పొత్తు ఉంటే కన‌క వారికి కూడా కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు టిడిపిలో కొత్త స‌మ‌స్య‌లు మొద‌ల‌వుతాయి. అయితే పొత్తు విషయంలో ఇంకా పూర్తి క్లారిటీ లేదు. కానీ, ప‌వ‌న్‌తో పొత్తును మాత్రం చంద్ర‌బాబు కొట్టి పారేయ‌క‌పోవ‌డం ఆస‌క్తి క‌రంగా మారింది. రాబోయే రోజుల్లో ప‌రిణామాలు ఎలా మారచ్చో అనే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.  

మొత్తానికి  అభ్య‌ర్దుల ఎంపిక వ్య‌వ‌హారం ఈసారి టీడిపికి కొంత ఇబ్బందేనని చెప్పాలి. ముందుగా  టికెట్లు ప్ర‌క‌టించే  విష‌యంలో  చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

ఇంకా చదవండి20 Days Ago
కాంగ్రెస్‌లో కేసిఆర్‌ను ఢీకొనే ప్రతిపక్ష నేత ఎవరు?

సిఎం కేసిఆర్ ను ఢీకొనే ప్రతిపక్ష నేత ఎవరు కాంగ్రెస్ తరఫున గెలిచిన 19 మంది ఎమ్మెల్యేల్లో సిఎల్ పి నేతగా నెగ్గేది ఎవరు ప్రతిపక్ష నేత ఎంపికపై కాంగ్రెస్ హై కమాండ్ ఎలాంటి కసరత్తు చేస్తోంది సిఎల్ పి నేత నియామకంపై హస్తం నేతల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఇపుడీ అంశమే తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటు కాంగ్రెస్ పార్టీలోనూ హాట్ టాపిక్.  

తెలంగాణ అసెంబ్లీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలిచిన అధికార టిఆర్ఎస్ ను ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుందనేది ఇపుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టిడిపి, సిపిఐ, జనసమితిలను కలుపుకుని ప్రజాకూటమిగా బరిలోకి దిగినప్పటికీ టిఆర్ఎస్ ను ఓడించడంలో విఫలమైంది. 2014లోనూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్ ను కాదని ప్రజలు టిఆర్ఎస్ కు అధికారాన్ని అప్పగించారు . గత నాలుగేళ్లుగా ప్రతిపక్షంగా కాంగ్రెస్ అధికార టిఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంలో విఫలవడం వల్లే ఎన్నికల్లో ఓటమి పాలైందనేది రాజకీయ విశ్లేషకుల మాట. 2014తో పాటు తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం పార్టీకి సమర్ధ నాయకత్వం లేకపోవడమే అని హస్తం వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఇపుడైన సమర్ధ నాయకునికి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.  

కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత ఎంపిక బాధ్యత పార్టీ సంప్రదాయం ప్రకారం హై కమాండ్ దే. హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలంతా పార్టీ హై కమాండ్ పంపించిన పరిశీలకుని సమక్షంలో సమావేశమై సిఎల్ పి నేత ఎంపిక బాధ్యతలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కట్టబెడుతూ తీర్మాణం చేస్తారు. రాహుల్ సూచించిన నేతకే సిఎల్ పి పగ్గాలు అప్పగిస్తారు. అలా ఎంపికైన సిఎల్ పి నేతనే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారు. అయితే ఇపుడు రాహుల్ గాంధీ ఎవరిని సిఎల్ పి నేతగా ఎంపిక చేస్తారనే అంశంపై కాంగ్రెస్ లో అయితే ఆసక్తికర చర్చే సాగుతోంది. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క సిఎల్ పి పగ్గాలు తమకు అప్పగించాలని హై కమాండ్ పెద్దలతో లాబీయింగ్ చేసుకుంటున్నప్పటికీ, కాంగ్రెస్ లో మాత్రం చర్చ మరో రకంగా సాగుతోంది. గత నాలుగేళ్లుగా టిపిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్, వర్కింగ్ ప్రసిడెంట్ గా భట్టి విక్రమార్క పార్టీని సరిగా నడిపించకపోవడం వల్లే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయిందని, ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వారిద్దరూ ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసి ఉండాల్సిందని హస్తం సీనియర్లే అంటున్నారు. ఇక మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, సబితా ఇంద్రారెడ్డి కూడా సిఎల్ పి రేసులో ఉన్నప్పటికీ వారిద్దరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేయడం వల్ల వారికి తెలంగాణ వాదులనే ఇమేజ్ లేదని కాంగ్రెస్ నేతలే ఆరోపిస్తున్నారు .  

యుపిఏ సర్కార్ 2014లో ఉమ్మడి ఏపీని విభజించినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం అప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే అనేది హస్తం నేతల అభిప్రాయం. తెలంగాణను నిర్లక్ష్యం చేసిన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన సబిత, శ్రీధర్ బాబు, చీఫ్ విప్ గా ఉన్న గండ్ర వెంకట రమణ రెడ్డి ఇంకా అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డి వంటి నాయకులు తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వారిలో ఎవరికైనా సిఎల్ పి నేత పదవి ఇచ్చినట్టయితే పార్టీకి రాజకీయంగా నష్టమే తప్ప లాభం లేదనేది హస్తం సీనియర్ల మాట. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన ఉమ్మడి ఏపీ చివరి సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో అంటకాగిన కాంగ్రెస్ నాయకులకు సిఎల్ పి నేత పదవి ఇవ్వరాదని ఇప్పటికే పలువురు హస్తం సీనియర్లు పార్టీ అధిష్టానానికి సూచించినట్టు తెలుస్తోంది . కాంగ్రెస్ హై కమాండ్ కూడా సిఎల్ పి నేతల ఎంపికలో పార్టీ నేతల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటోందని సమాచారం.  

కాంగ్రెస్ లీడర్ల అభిప్రాయం ప్రకారం కేసిఆర్ సర్కార్ ను ఢీకొనే ప్రతిపక్ష నేత పదవిని మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి దక్కవచ్చని తెలుస్తోంది . 2009లో భవనగిరి నుంచి ఎంపీగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లోకసభలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఇతర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాజీలేని పోరాటం చేసారని నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అప్పటి కాంగ్రెస్ ఎంపీలు పలువురు అప్పుడు సిఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించడం వల్ల వారికి తెలంగాణ వాదులుగా గుర్తింపు లభించింది. 2014లో ఎంపీగా స్వల్ప తేడాతో ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ మరుసటి ఏడాదే నల్లగొండ జిల్లా స్ధానిక సంస్ధల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ను సవాల చేసి మరీ గెలిచారు. దాంతో గులాబీ పార్టీని దీటుగా ఎదుర్కొనే సత్తా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉందని కాంగ్రెస్ నేతలే కాదు రాజకీయ వర్గాలు గ్రహించాయి . అప్పటి నుంచి కేసిఆర్ సర్కార్ తో రాజీలేని పోరాటం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి 23 వేల మెజారిటీతో గెలుపొందడంతో ఇపుడు కాంగ్రెస్ వర్గాలన్నీ అసెంబ్లీలో హస్తం పార్టీని నడిపించే నాయకత్వాన్ని ఆయనకు అప్పగిస్తే బాగుంటుందని అధిష్టానానికి సూచిస్తున్నట్టు సమాచారం. నకిరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే మునుగోడు నుంచి తాను కూడా పోటీ చేయనని, చిరుమర్తికి టికెట్ ఇస్తే ఆయన గెలుపు బాధ్యతలు తనవే అంటూ సవాల్ చేసి మరీ లింగయ్యను నెగ్గించుకున్న ఘనత కోమటిరెడ్డిదని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇలా టిఆర్ఎస్ ను సవాల్ చేసే సత్తా గల , తెలంగాణ వాది అన్న ఇమేజ్ ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సిఎల్ పి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ పెరుగుతుందని హస్తం నేతలే అంటున్నారు.

ఇంకా చదవండి31 Days Ago
మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తాలు లేవా..?

తెలంగాణలో క్యాబినెట్ విస్తరణపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు దాటుతున్నా.. ఇంకా సందిగ్ధత నెలకొనడంతో ఆశావహుల్లో టెన్షన్‌ అధికమవుతోంది. మంత్రిపదవులు ఆశిస్తున్నవారంతా ముహూర్తపు లెక్కలు చూసుకుంటున్నారు. తెలంగాణ కొత్త శాసనసభ ఈ నెల 27 లేదా 28 తేదీల్లో కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించనప్పటికి కానప్పటికీ ఆ తేదీలకు అనుగుణంగా సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ కూడా ఆ తేదీలకు కాస్త అటుఇటుగా ఉంటుందని సమాచారం. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌, హోంమంత్రిగా మహమూద్‌ అలీ ఇద్దరితో మాత్రమే మంత్రివర్గం ఏర్పాటు కాగా.. అసెంబ్లీ సమావేశాలకు ఒకటి రెండు రోజులు అటూ ఇటూగా మంత్రివర్గ విస్తరణ కూడా జరగనున్నట్లు తెలుస్తోంది. 

విస్తరణపై సీఎం KCR కసరత్తు చేస్తున్నట్లు TRS వర్గాలు తెలుపుతున్నాయి. పనితీరు ప్రాతిపదికగా కొత్త మంత్రులను తీసుకుంటామని ప్రకటించిన KCR.. గత ప్రభుత్వంలో వారి వ్యవహార శైలిని పరిశీలిస్తున్నారు. మాజీమంత్రుల్లో కొంతమందికి అవకాశం రావడం ఖాయంగా కనిపిస్తోంది. పాత మంత్రివర్గంలో మొత్తం 18 మంది ఉండగా.. తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్‌ ఎన్నికల్లో ఓడిపోయారు. మిగిలిన మంత్రులు గత ప్రభుత్వంలో ఆయా శాఖలను నిర్వహించిన తీరు, పాలనలో వారి ముద్ర, వ్యవహారశైలి, పథకాల ప్రగతి, సమస్యలు, వైఫల్యాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం.   

పాత మంత్రుల్లో మరి కొంత మందికి కేబినెట్‌లో స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. హోంమంత్రిగా మహమూద్‌అలీని నియమించడంతో గతంలో ఆ పదవి నిర్వహించిన నాయిని నర్సింహారెడ్డికి హోం అవకాశం లేనట్లే. అయితే తనకు కేబినెట్‌లో బెర్త్‌పై CM గతంలోనే హామీ ఇచ్చారని నాయిని అనుచరులతో చెప్పుకుంటున్నారు. మహమూద్‌ అలీతో పాటు గతంలో కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. మంత్రివర్గం ఏర్పాటులో అలీని మాత్రమే తీసుకొని కడియంకు చోటు కల్పించకపోవడంపై జోరుగా చర్చసాగుతోంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో సీఎం KCR ఇతర కార్యక్రమాలేమీ ఖరారు కాలేదు. దీంతో శాసనసభ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ ఆ రోజుల్లోనే ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు చాన్నాళ్ల తర్వాత అసెంబ్లీ భవనాలకు అధికారులు సున్నం వేయించారు. ఆకర్షణీయంగా అలంకరణలు చేస్తున్నారు.  

తెలంగాణలో సంక్రాంతిలోపు మంచి రోజులున్నాయా? ఒకవేళ సంక్రాంతిలోపు ముహూర్తాలు లేకుంటే తర్వాత ఎప్పుడున్నాయి వంటి వివరాలను గులాబీ నేతలు ఆరా తీస్తున్నారు. రాజకీయ నేతలతోపాటు అధికార వర్గాల్లో ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ సాగుతోంది. సాధారణంగా సంక్రాంతికి ముందు నెల రోజులు మంచి రోజులు ఉండవనే చర్చ నడుస్తోంది. అయితే, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈసారి సంక్రాంతికి పది రోజుల ముందు వరకు మంచి రోజులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది మార్గశిర అధిక మాసం వచ్చిందని, అందువల్ల జనవరి 4 వరకు మంచి రోజులు ఉన్నాయని తెలుపుతున్నారు. ఆ తర్వాత పుష్యమాసం మొదలై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఆ రోజులలో ముహూర్తాలు ఉండవు. దీంతో జనవరి 4వ తేదీలోపే మంత్రివర్గ విస్తరణ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోపు జరగకపోతే ఫిబ్రవరి 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి వీలుపడకపోవచ్చు. ఇలా క్యాబినెట్ విస్తరణపై జోరుగా చర్చ సాగుతోంది.

ఇంకా చదవండి34 Days Ago
2019 ఫిబ్రవరి 25న దేశ సార్వత్రిక ఎన్నికలు!

లోక్ సభ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న సార్వత్రిక ఎన్నికల నగరా మోగనుంది. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. గతంలో ప్రభుత్వం అధికారంలో వచ్చాక జూన్‌ 4న లోక్‌సభ తొలి సమావేశం జరిగింది. దాంతో 2019 జూన్‌ 4 కల్లా మళ్లీ కొత్త లోక్‌సభ ఏర్పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికలతో పోలిస్తే పది రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 9 విడతల్లో పోలింగ్ నిర్వహించవచ్చని భావిస్తున్నారు. 

గత ఎన్నికల్లో లోక్ సభతో పాటే తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగాయి. అయితే తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ, ఒడిసా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీరులో కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర, హరియాణాలకు 2019 అక్టోబరులో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, రెండు శాసనసభలను ముందుగానే రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతో పాటే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి టఫ్ ఫైట్ తప్పేలా లేదు. తాజాగా జరిగిన 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో బీజేపీ మూడు చోట్ల అధికారాన్ని కోల్పోయింది. అదేసమయంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా కూటమి బలపడుతోంది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొత్త ఉత్సాహం మొదలైంది. అటు ఏపీ సీఎం చంద్రబాబు ఫ్రంట్ బలోపేతానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మోడీ ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ఎన్నికలకు వెళ్లనుండగా ప్రధాని అభ్యర్ధిని ప్రకటించకుండానే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఎలక్షన్స్ బరిలో నిలవనుంది. 

మరోవైపు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పై ఫోకస్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లను వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ లాంటి నేతలు కేసీఆర్‌ ఫ్రంట్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికలు ముక్కోణపు పోటీని తలపించనున్నాయి.బీజేపీకి మెజారిటీ రాని పక్షంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సైతం ఆర్ఎస్ఎస్ ఇప్పటినుంచే ప్లాన్ చేస్తోంది. మొత్తానికి 2019 లోక్ సభ ఎన్నికలు హోరాహోరీగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇంకా చదవండి36 Days Ago
కూటమి విఫలం, కేసీఆర్ విజయకేతనం

ఓటెత్తిన తెలంగాణ గులాబీకి జై కొట్టింది. చరిత్ర తిరగరాస్తూ ముందస్తుకు వెళ్లిన కేసీఆర్‌కు పట్టంగట్టింది. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తిరుగులేని విజయాన్నిసాధించింది. కేసీఆర్ వ్యూహం ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ నిలువలేకపోయింది. కారు స్పీడును అందుకోలేక ఫ్రంట్ కుదేలైంది. సింగిల్ మెజార్టీ సాధించి మరోసారి అధికారం చేజిక్కించుకుంది. కేసీఆర్ పక్కా ప్లాన్స్ ముందు ప్రజాఫ్రంట్ నిలుబడలేకపోయింది. కారు జోరు ధాటికి కూటమితో సహా విపక్షాలన్ని కాకవికలం అయ్యాయి. ఎంఐఎం మాత్రం తమ పాత స్థానాల్లో పట్టునిలుపుకుంది.  

మొత్తం 119 స్థానాలకుగానూ 88 చోట్ల అధికార టీఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేసింది. కాంగ్రెస్ 19 స్థానాలకే పరిమితమైంది. టీడీపీ రెండు స్థానాల్లో, ఎంఐఎం ఏడు స్థానాల్లో, బీజేపీ కేవలం ఒక స్థానంలో గెలుపొందాయి. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచారు.  

రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 11 నియోజక వర్గాల్లో విజయం సాధించి టీఆర్ఎస్ మొదటి స్థానంలో నిలిచింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం ఏడు నియోజక వర్గాల్లో ఎంఐఎం విజయం సాధించగా.. ఏడు నియోజ వర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ‌ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ 11 స్థానాలను గెలుచుకుని జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక స్థానంలోనే టీఆర్ఎస్ గెలిచింది. ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మహబూబ్ నగర్ జిల్లాలో 13 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. నల్గొండలో టీఆర్ఎస్ ఏడు నియోజక వర్గాల్లో భారీ విజయం సాధించి మొదటి స్థానంలో నిలిచింది. మెదక్‌ జిల్లాలో గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నపది స్ధానాల్లో ఘన విజయం సాధించింది. ఈసారి ఈ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఒక స్థానాన్ని కోల్పోయి 9 స్థానాల్లో విజయం సాధించింది. నిజామాబాద్‌ జిల్లాలో 2014 ఎన్నికల టీఆర్‌ఎస్‌ అనుకూల ఫలితాలు మళ్లీ రిపీట్‌ అయ్యాయి. జిల్లాలో మొత్తం 8 స్థానాల్లో నిజామాబాద్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారు. వరంగల్ జిల్లాలో పది స్థానాల్లో గులాబీ పార్టీ విజయ ఢంకా మోగించింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది స్థానాల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించింది.  

ఈ ఎన్నికల్లో గులాబీ దళం విజయ ఢంకా మోగించింది. మిగతా పార్టీలను క్లీన్ స్వీప్ చేసి తిరుగు లేని విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ఇంకా చదవండి42 Days Ago
మరింత +