క్రీడా వార్తలు

India vs Australia, 3rd ODI : Dhoni Stars as India Seal ODI Series in Style

ఆస్ట్రేలియాలో భారత్ మరో చరిత్ర: వన్డే ట్రై సిరీస్ కైవసం

భారత్‌, ఆస్ట్రేలియాలో మరో చరిత్ర సృష్టించింది. మెల్ బోర్న్ లో జరిగిన చివరి వన్డే‌లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. 71 ఏళ్ల అనంతరం భారత్ ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ తో పాటు, వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా జట్టు నిర్దేశించిన 231 పరుగుల లక్ష్య ఛేదనలో ధోనీ, జాదవ్ ల జోడీ.. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 116 బంతుల్లో 121 పరుగులతో రాణించారు. చివరి రెండు ఓవర్ల వరకు పది పరుగుల తేడా కనిపించినా జాదవ్ బౌండరీ హిట్లతో కవర్ చేశాడు. మరో 4 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది భారత్. 87 పరుగులతో ధోనీ నాటౌట్‌గా నిలువగా..జాదవ్ 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లి 46, ధావన్ 23 పరుగులు చేశారు.

మరింత +
Yuzvendra Chahal 1st spinner to take 6 wickets in an ODI in Australia

ఇండియా టార్గెట్ 231: వికెట్ల పతనంలో చాహల్ మరో రికార్డు

సిడ్నిలో జరుగుతున్న నిర్ణ‌యాత్మ‌క మూడో వన్డేలో భారత్ ఆటగాళ్లు చెలరేగి పోయారు. 48.4 ఓవర్లలో 230 రన్స్ కొట్టి ఆస్ట్రేలియా ఆల్ అవుట్ అయింది. యజువేంద్ర చాహల్ ఒక్కడు 42 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు తీయడం విశేషం. ఇది అతనికి అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో రికార్డు.  అంతకు ముందు సౌతాఫ్రికాతో గతేడాది సెంచూరియన్ లో ఆడిన వన్డేలో 22 పరుగులకు 5 వికెట్లు తీసి చరిత్ర కెక్కాడు చాహల్. ప్రస్తుత ఆటలో రెండు వికెట్లు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌‌ కు దక్కాయి. అంత‌కుముందు వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. కొద్దిసేప‌టి అనంత‌రం వ‌ర్షం ఆగటంతో అంపైర్లు మ్యాచ్‌ను ప్రారంభించారు. ఈ ఆట గెలుపైనే సిరీస్ ఎవరిదనేది తేలిపోతుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో రెండు జ‌ట్లు 1-1తో స‌మంగా ఉన్న విషయం తెలిసిందే.

మరింత +
Rishabh Pant posts photo with girlfriend Isha Negi. Fans can't keep calm

వీరిద్దరి మనసులు ఒకటయ్యాయి..!

భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రేమలో పడ్డాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశాడు. నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వు నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే నేను చేయాల్సింది’ అని కామెంట్‌‌ను కూడా జోడించాడు. కాగా ఆ అమ్మాయి పేరు ఇషా నేగి అని అతని సన్నిహితులు వెల్లడించారు.

మరింత +
Ind vs Aus 3rd ODI Predictions: Who will win the Australia vs India 3rd ODI match

రేపు మెల్‌బోర్న్ వేదికగా మూడో వన్డే

భారత్-ఆస్ట్రేలియా మధ్య మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. రేపు మెల్‌బోర్న్ వేదికగా మూడో వన్డే ప్రారంభం కానుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌‌లో ఇరు జట్లు చెరోమ్యాచ్‌‌ను గెలిచాయి. దీంతో నిర్ణయాత్మక మూడు వన్డేలో గెలిచి సిరీస్ నెగ్గాలని ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగనుంది. అయితే టీం ఇండియాను బౌలింగ్ కలవరపెడుతుంది. రెండు వన్డేల్లోను భారత బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. దీంతో బౌలింగ్ దళం ఎలాగైనా గాడిలో పడాలనుకుంటుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌‌లో నెగ్గి కనీసం వన్డే సిరీస్‌‌ను గెలచి పరువు దక్కించుకోవాలను భావిస్తోంది.

మరింత +
India vs Australia 1st ODI: Bhuvneshwar Kumar returns as India enter with five-pronged bowling attack

సిడ్నీ వన్డే: మూడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

సిడ్నీ వేదికగా భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. 41 పరుగులకే ఆసీస్ ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ చేరారు. భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. చాలాకాలం తరువాత జ‌డేజా, దినేష్ కార్తీక్‌కి వ‌న్డేలో ఆడే అవ‌కాశం ద‌క్కింది. బుమ్రా ప్లేస్ లో జట్టులోకి వచ్చిన సిరాజ్‌కు ఫైన‌ల్ లిస్ట్‌లో మాత్రం ప్లేస్ ద‌క్క‌లేదు. మొత్తంముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగింది. మరోవైపు స్టార్ స్నిన్నర్ నాథన్ లియాన్, సీనియర్ పేసర్ పీటర్ సిడిల్ చేరికతో ఆసీస్ జట్టు పటిష్ఠంగా ఉంది.

మరింత +
Inappropriate: Kohli says Pandya and Rahul were out of line

రాహుల్, హార్ధిక్ పాండ్యాలపై బీసీసీఐ వేటు

భారత క్రికెటర్లు రాహుల్, హార్ధిక్ పాండ్యాలపై బీసీసీఐ వేటు వేసింది. ఇద్దరు ఆటగాళ్లపై ఒక వన్డే నిషేధం విధించింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాతా నిర్వహిస్తున్న ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సిడ్నిలో ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డేకు పాండ్యా, రాహుల్ దూరమయ్యారు.

మరింత +
Indian Boxer Mary Kom tops AIBA rankings

AIBA ర్యాంకింగ్‌లో వరల్డ్ నంబర్ వన్‌‌గా మేరీకోమ్

ఇండియన్ బాక్సర్ మేరీ కోమ్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచింది. అసాధారణ రీతిలో ఆరోసారి వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన మేరీ.. ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కు దూసుకెళ్లింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ బాక్సర్ మేరీ కోమ్ కావడం విశేషం. గతేడాది నవంబర్‌లో జరిగిన టోర్నీలో 48 కేజీల విభాగంగా ఆమె చాంపియన్‌గా నిలిచింది. ఈ కేటగిరీలో 1700 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న మేరీ 2018లో మంచి ఫామ్‌లో ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్స్‌తోపాటు కామన్వెల్త్ గేమ్స్, పోలాండ్‌లో జరిగిన మరో టోర్నీలోనూ గోల్డ్ మెడల్స్ సాధించింది.

మరింత +
India Win First Test Series In Australia 2-1 As 4th Test Ends In A Draw

ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా

ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్ర సృష్టించింది. 71 ఏళ్ల నుంచి ఊరిస్తున్న సిరీస్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో దక్కించుకుంది. చివరిదైన సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో కోహ్లీ సేన సిరీస్‌ను హస్తగతం చేసుకుంది. ఆస్ట్రేలియాను వారి గడ్డపై కోహ్లీ సేన చిత్తు చిత్తు చేసింది. ఆల్ రౌండ్ షోతో మెరుపులు మెరిపించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టింది. మొత్తం నాలుగు టెస్టుల సిరీస్‌లో టాప్ ప్లేయర్ పుజారా సూపర్ షో చేశాడు. చివరి మ్యాచ్‌లో భారీ సెంచరీ చేయడంతో పాటు.. సిరీస్‌లో మొత్తం మూడు సెంచరీలు చేసిన పుజారాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. ఈ సిరీస్‌లో మొత్తం మూడు సెంచరీలతో 521 పరుగులు చేశాడు పుజారా. మరోవైపు బౌలర్లు కూడా అదరగొట్టారు. ముఖ్యంగా పేస్ త్రయం బుమ్రా, షమీ, ఇషాంత్ ప్రత్యర్ధిని కట్టడి చేశారు. బుమ్రా 21 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలవగా.. షమీ 16 వికెట్లు, ఇషాంత్ 11 వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.

మరింత +
India vs Australia, 4th Test: Australia trail India by 598 runs at stumps on Day 2

ఏడువికెట్ల నష్టానికి 622 పరుగులు చేసిన భారత్

భారత్-ఆస్ట్రేలియా మద్య సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌‌లో భారత్ భారీ స్కోరు చేసింది. ఏడువికెట్ల నష్టానికి 622 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది.ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 77 , పుజారా 193, జడేజా 81 పరుగులు చేయగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 159 పరుగులతో నౌటౌ‌ట్‌‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్పిన్నర్ నాథన్ లియాన్‌‌కు 4 దక్కగా, హజీల్ వుడ్ రెండు వికెట్లు, స్టార్క్ ఒక్క వికెట్ దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్లేమి నష్టపోకుండా 24 పరుగులు చేసింది.

మరింత +
India vs Australia, 4th Test, Day 2: Pant completes ton, India cross 500

సిడ్నీ టెస్టులో పంత్ సెంచరీ.. భారత్ భారీ స్కోర్

సిడ్నీ టెస్టులో భారత్ బాట్స్ మెన్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 77, పుజారా 193పరుగులతో రాణించగా ఇప్పుడు రిషబ్ పంత్ సెంచరీతో కదం తొక్కాడు. 137 బంతుల్లో సెంచరీ చేసిన పంత్ జడేజాతో కలిసి ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. రిషబ్ పంత్ జోరుకు టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 510పరుగులు చేసి మ్యాచ్ పై మంచి పట్టు సాధించింది.

మరింత +
India vs Australia 4th Test: Cheteshwar Pujara begins New Year with 18th Test hundred, 3rd in Australia

4వ టెస్టు: తొలిరోజు ఆటలో పుజారా మరో సెంచరీ

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేనకు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ రాహుల్ మరోసారి తక్కువ పరుగులకే పెవీలియన్ చేరగా మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆ తరువాత కోహ్లీ, రహానె తక్కువ పరుగులకే ఔటైనా మరో ఎండ్ లో పుజారా సెంచరీతో రాణించాడు. టెస్ట్ కెరీర్‌లో 18వ సెంచరీ చేసిన పుజారా ఈ సిరీస్‌లో 3వ సెంచరీ నమోదు చేశాడు. ఆట ముగిసే సమయానికి పుజారా 130 పరుగులు, విహారి 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. హాజిల్ వుడ్ రెండు వికెట్లు తీయగా స్టార్క్, లియాన్ చెరో వికెట్ తీశారు.

మరింత +
India vs Australia, 4th Test: Pujara, Kohli take India to 177/2 at tea on Day 1

నాలుగో టెస్టులో నిలకడగా ఆడుతున్న భారత్

ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా నిలకడగా ఆడుతోంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దూకుడుగా ఆడిన ఓపెనర్ రాహుల్ మరోసారి తక్కువ పరుగులకే పెవీలియన్ చేరాడు. దీంతో వన్ డౌన్‌లో వచ్చిన పుజారాతో కలిసి మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్ కు 116 పరుగుల జోడించారు. ఈ క్రమంలోనే అగర్వాల్ రెండో టెస్టులోను హాఫ్ సెంచరీతో రాణించాడు. 77 పరుగులు చేసి పెవీలియన్ చేరాడు. హాజిల్ వుడ్, లియాన్ చెరో వికెట్ తీశారు.

మరింత +
Vice President Venkaiah Naidu meets shuttler PV Sindhu

పీవీ సింధుకు ఉపరాష్ట్రపతి అభినందన

భారత్ స్టార్ షటర్ల పీవీ సింధు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. ఇటీవల BWF వరల్డ్ టూర్ ఫైనల్స్ లో సింధు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడును కలిసిన ఆమె బంగారు పతకాన్ని ఆయనకు చూపించారు. సింధు ప్రతిభ దేశ యువతకు ఆదర్శమని ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు కొనియాడారు.

మరింత +
Premier Badminton League begins in Mumbai today

ఇవాళ్టి నుంచి ముంబయిలో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌-4

నేటి నుంచి ముంబయి వేదికగా ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌-4 ఆరంభం కానుంది. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ టైటిల్‌ గెలిచి ఊపు మీదున్న పీవీ సింధుతో పాటు మరో భారత స్టార్‌ సైనా నెహ్వాల్‌, రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కరోలినా మారీన్‌, కిదాంబి శ్రీకాంత్‌ లాంటి టాప్‌ షట్లర్లు బరిలో ఉన్నారు. మొత్తం 17 దేశాల నుంచి 90 మంది క్రీడాకారులు తొమ్మిది జట్ల తరఫున ఈ లీగ్‌లో పోటీ పడనున్నారు.  

సింధు వర్సెస్ మారిన్‌ వీళ్లిద్దరి మధ్య పోరే ఈ లీగ్‌లో ప్రత్యేకంగా నిలువనుంది. రియో ఒలింపిక్స్‌లో స్వర్ణ సమరం నుంచి వీళ్లిద్దరు ఎప్పుడు తలపడినా ఆ మ్యాచ్‌ ప్రత్యేకం అవుతుంది. ఈసారి కొత్త జట్టు పుణె 7 ఏసెస్‌కు మారిన్‌ కెప్టెన్‌గా ఉండగా చెన్నై స్మాషర్స్‌ నుంచి హైదరాబాద్‌ హంటర్స్‌కు వచ్చిన సింధు జట్టుకు టైటిల్‌ అందించాలనే పట్టుదలతో ఉంది. ఈసారి లీగ్‌ తొలి పోరులోనే మారిన్‌తో సింధు తలపడనుండడం విశేషం. ఇప్పటిదాకా ఈ లీగ్‌లో మారిన్‌తో రెండుసార్లు తలపడిన సింధు రెండింట్లోనూ ఓడింది. ప్రస్తుతం జోరు మీదున్న సింధు ఈసారి ఎలాంటి ఫలితం రాబడుతుందనేది ఆసక్తిగా మారింది.  

2013 తొలి పీబీఎల్‌ టోర్నీలో హైదరాబాద్‌ హంటర్స్‌ టైటిల్ కైవసం చేసుకోగా 2016లో దిల్లీ డాషర్స్ విజయం సాధించింది. ఆ తర్వాత 2017 టోర్నీలో చెన్నై స్మాషర్స్ గెలిచింది. ఈ సారి సింధు రాకతో బలంగా తయారైన హైదరాబాద్ హంటర్స్‌ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

మరింత +
WV Raman appointed women's coach: Wrong reasons lead to right process, but team must avoid superstar culture

మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌గా వెంకట్‌ రామన్‌

భారత మహిళల క్రికెట్‌ జట్టు కోచ్‌గా మాజీ ఆటగాడు ఊర్కెరి వెంకట్‌ రామన్‌ ఎంపికయ్యారు. తొలి ప్రాధామ్యంగా ఉన్న గ్యారీ కిర్‌స్టన్‌ను కాదని బీసీసీఐ ఆయనను ఎంపిక చేయడం విశేషం. దిగ్గజాలైన కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంతా రంగస్వామి నేతృత్వంలోని కమిటీ కిర్‌స్టన్‌కు తొలి ప్రాధాన్యం ఇచ్చింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల రీత్యా ఆయన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కోచ్‌ పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇష్టపడకపోవడంతో రామన్‌కు అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బ్యాటింగ్‌ సలహాదారుగా పనిచేస్తున్నారు.

మరింత +