బిజినెస్ వార్తలు

Jet Airways crisis: A million seats go missing in a month

సంక్షోభంలో జెట్ ఎయిర్‌వేస్: ఉద్యోగుల్లో అలజడి

విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంక్షోభం మరవక ముందే మరో విమాన యాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ కుప్పకూలే దిశగా కొనసాగుతోంది. గత కొద్ది నెలలుగా జెట్ ఎయిర్ వేస్ పైలట్లు, ఇతర సిబ్బందికి జీతాలు చెల్లించటం లేదు. బ్యాంకులకు, విమానాల లీజుదార్లకు 82 వందల కోట్ల రూపాయల బాకీ పడిపోయింది. ఒకప్పుడు 119 విమానాలతో భారత్ మార్కెట్‌ను శాసించిన జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంతో మూడు నెలల్లోనే 41 విమానాలను కోల్పోయింది. 25 ఏళ్లుగా జాతీయ, అంతర్జాతీయ సేవలందిస్తున్న జెట్ ఎయిర్‌వేస్ దివాళా స్థితికి చేరుకోవడానికి నిర్వహణ లోపాలే కారణమని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఒక వేళ జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభంతో మూత పడితే దాదాపు 23,000 మంది రోడ్డున పడనున్నారు.

మరింత +
India Announces New Rs. 20 Coin With A One-Of-A-Kind Shape

20 రూపాయల నాణెం అతి త్వరలో...

భారతదేశ కాయిన్స్ లలో కొత్తగా 20 రూపాయల నాణెంను తీసుకురావడానికి కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. దీంతో రూ. 2, రూ. 5, రూ. 10 నాణేల జతకు తర్వలోనే రూ. 20 నాణేన్ని కూడా చూడబోతున్నామనమాట. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ 20 రూపాయాల నాణేనికి 12 అంచులు ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. బహుభుజి ఆకారంలో ఉండే రూ. 20 నాణేం దాదాపుగా రూ. 10 నాణేనికి దగ్గర పోలిక ఉంటుంది. 27 మిల్లీమీటర్ల వ్యాసంతో ఈ నాణేంను తయారు చేయనున్నారు. దీని వెలుపలి లైన్ 65 శాతం కాపర్, 15 శాతం జింక్, 20 శాతం నికెల్‌ మిశ్రమం జతచేయగా, ఇక లోపలి భాగం 75 శాతం కాపర్, 20 శాతం జింక్, ఐదు శాతం నికెల్‌తో తయారవుతుందని తెలిపింది. ఇక నాణేనికి ముందువైపు అశోకుడి స్తంభం,మూడు సింహాల గుర్తు ఉంటుంది. కింద సత్యమేవ జయతే అని హిందీలో రాసి ఉంటుంది. ఒక వైపు భారత్ మరోవైపు ఇండియా ఆంగ్లం అక్షరాలతో ఉంటుందని తెలిపింది.

మరింత +
Onions likely to cost Rs 45 a kg by Diwali on low kharif crop

త్వరపడండి: త్వరలో ఉల్లి ధర పెరుగుతుందంట!

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో సతమతమవుతోన్న ముంబై జనాల నడ్డి విరచడానికి ఉల్లిపాయ కూడా సిద్ధమవుతోంది. అతి త్వరలోనే ఉల్లి ధర భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో 10 రూపాయలు పలుకుతున్న ఉల్లిపాయలు మరో వారం రోజుల్లోనే దాదాపు 50 రూపాయలకు చేరనున్నట్లు భావిస్తున్నారు. గతంలో ప్రతి రోజు మార్కెట్‌కు దాదాపు 125 - 150 టన్నుల ఉల్లి వచ్చేదని కానీ కొన్ని రోజులుగా ఉల్లి దిగుమతి భారీగా తగ్గిందని వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ప్రసుతం రోజుకు కేవలం 50 టన్నుల ఉల్లి మాత్రమే మార్కెట్‌ లోకి వస్తుంది. దీంతో త్వరలోనే 50 రూపాయలను తాకే అవకావమున్నట్లు తెలుస్తోంది.

మరింత +
Stock Market gained most in early trade on Friday

కోలుకున్న స్టాక్ మార్కెట్

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో నిన్న భారీగా కుదేలైన భారతీయ మార్కెట్లు ఈ రోజు తిరిగి లాభాల బాటపట్టాయి. ముడిచమురు ధరలు కొంత తగ్గడం, ఇతర అంతర్జాతీయ పరిణామాలతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ కూడా ట్రేడింగ్‌ ఆరంభంలో 29 పైసలు బలపడింది. ఉదయం సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభం కాగా, నిఫ్టీ 135 పాయింట్ల లాభంతో 10 వేల 350పైన ట్రేడింగ్‌ ఆరంభించింది. బ్యాంకులు, ఆటో, లోహ, ఫార్మా తదితర రంగాల షేర్లు లాభపడుతున్నాయి. NSEలో బజాజ్‌ ఫైనాన్స్‌, మారుతి సుజుకి, బజాజ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌, HPCL‌ తదితర కంపెనీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. HCL టెక్, TCS‌, ఇన్ఫోసిస్‌ తదితర కంపెనీలు నష్టపోతున్నాయి. ప్రస్తుతం డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 73 రూపాయల 72 పైసల వద్ద కొనసాగుతోంది.

మరింత +
RBI surprises markets, holds repo rate at 6.5%; stance turns hawkish

వడ్డీరేట్లపై రెపో రేటు యథాతథం: RBI

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. విశ్లేషకుల అంచనాలన్నింటికీ చెక్‌ పెడుతూ.. కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రెపో రేటును 6.5 శాతంగానే ఉంది. బ్యాంక్‌ రేటును 6.75 శాతంగా ఉంచింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అ​యితే మెజార్టీ విశ్లేషకులు, మార్కెట్లు ఈ సారి రెపో రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచుతుందని అభిప్రాయపడ్డాయి.

మరింత +
Rupee Hits New All-Time Low Of 73.77 Against Dollar

రూపాయి ఢమాల్: తొలిసారి 73 మార్క్‌‌ను దాటింది

దేశీయ కరెన్సీ రూపాయి మరో చారిత్రక కనిష్టాన్ని తాకింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.41 వద్ద తాజా జీవనకాల కనిష్ఠాన్నితాకగా దేశీ స్టాక్ మార్కెట్‌ ముగిసే సమయానికి రూపాయి విలువ భారీగా రికవరీ కాగలిగింది. 73.42 మార్కును తాకిన రూపాయి 40 పైసలకు పైగా రికవరీ అయింది. అమెరికా కరెన్సీ డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి భారీగా క్షీణించింది. డాలరు మారకంలో వరుసగా పతనమవుతూ వస్తున్న రూపాయి మార్కెట్‌ చరిత్రలోనే తొలిసారిగా 73 మార్క్‌ను దాటింది. క్రితం సెషన్ ముగింపు 72.91తో పోలిస్తే 34 పైసల నష్టంతో 73.25 వద్ద ప్రారంభమైంది..కాసేపటికే మరింత దిగజారి 73.34 వద్ద అత్యంత కనిష్ఠానికి పడిపోయింది. మిడ్ సెషన్ సమయానికి 39 పైసల నష్టంతో 73.30 వద్దకు చేరింది. బుధవారం నాటి ట్రేడింగ్‌ లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.41వద్ద తాజా జీవనకాల కనిష్ఠాన్ని తాకింది.దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, విదేశీ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడంతో దేశీయంగా రూపాయి విలువ భారీగా పతనమైందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 85 డాలర్లకు చేరడంతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్లు 1,842 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ఫారెక్స్ మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. అదేవిధంగా రూపాయి పతనం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావం చూపగా దేశీయ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి.

మరింత +
Google rebrands its Tez payments app to Google Pay in India, adds instant loans

తేజ్ యాప్ గూగుల్ పేగా మారింది

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు చెందిన యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ తేజ్ పేరును ఆ సంస్థ మార్చింది. అన‌తికాలంలోనే తేజ్ అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ‌ను చూర‌గొంది. ఆ యాప్ గూగుల్ పే కానుంది. ఈ బ్రాండ్ మార్పు వల్ల యూజర్లకు రీటెయిల్ స్టోర్స్ ల‌లో ఈ-పేమెంట్లకు ఈజీగా అవుతుంద‌ని తెలిపింది. వివిధ యాప్స్‌లో ఆన్‌లైన్ ట్రాన్సక్షన్స్ కు సుల‌భ‌త‌ర‌మ‌వుతుంద‌ని ప్రకటించింది. దీనితోపాటు ఇన్ స్టాంట్ లోన్స్ పొందేందుకు అవకాశం కల్పించింది. భార‌త్ లో గూగుల్ ప్రవేశపెట్టిన తొలి డిజిటల్ పేమెంట్ యాప్ తేజ్ ను గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేసింది. తేజ్ లో ఇప్పటివరకు 75 కోట్ల ట్రాన్సక్షన్లు జరిగాయని తెలిపింది. వీటి విలువ 2 లక్షల కోట్లని గూగుల్ ప్ర‌క‌టించింది. ప్రతి నెల ఈ యాప్ 2.2 కోట్ల మంది వాడుతున్నారని పేమెంట్స్ అండ్ నెక్ట్స్ బిలియన్ యూజర్స్ ఇనిషియేటివ్(PANBUI) మేనేజర్ సీజర్ సేన్‌గుప్తా బ్లాగ్ లో వెల్ల‌డించారు. 

మరింత +
BSE: Sensex tops 38,000 level for first time; Nifty nears 11,500

సెన్సెక్స్ చ‌రిత్ర‌లో తొలిసారి @38000 మార్క్

దేశీయ మార్కెట్ లో మ‌దుప‌ర్లు కొనుగోళ్ల వైపు మొగ్గు చూప‌డంతో సెన్సెక్స్ తొలిసారిగా 38 వేల మార్క్ ను దాటింది. ఆగస్టు 9(గురువారం) నాటి ట్రేడింగ్‌ లాభాలతో ప్రారంభం అయింది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకాయి. దీంతో బీఎస్ఈ చరిత్రలో తొలిసారి 38 వేల‌ మార్క్‌ను దాటి ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ కూడా లాభాల బాట ప‌ట్టింది. ట్రేడింగ్ మొద‌లైన తొలి గంట‌లోనే సెన్సెక్స్‌ 120 పాయింట్లకు పైగా దూసుకెళ్లింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభప‌డి 11వేల 500 మార్క్‌ను దాటింది. మార్కెట్‌ ఆరంభమైన గంట‌ తర్వాత కూడా సూచీలు అదే జోరును కొన‌ సాగించాయి. బ్యాంకింగ్‌, స్టీల్, విద్యుత్ రంగాల షేర్లు లాభాల్లో న‌డుస్తున్నాయి. బలపరుస్తున్నాయి. ఇక డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పెరిగి 68.53 రూపాయిలుగా ప‌లికింది.

మరింత +
Jio, SBI deepen digital partnership; integrate SBI YONO app, MyJio platform

జియోతో చేతులు కలిపిన ఎస్‌బీఐ

దేశంలోనే ఓవర్ ది టాప్ యాప్ గా నిలిచింది మై జియో యాప్స్. ఇకపై వీటితోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన యోనో యాప్ అందుబాటులో రానుంది. ఈ మేరకు రిలయన్స్ కంపెనీ ఎస్‌బీఐతో చేతులు కలిపింది. డిజిటల్‌ చెల్లింపుల సేవలను మరింత మందికి చేరువ చేయాలనే లక్ష్యంతోనే ఈ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. ఒప్పందం ప్రకారం ఆర్‌ఐఎల్‌-ఎస్‌బీఐ 70:30 నిష్పత్తి భాగస్వామ్యంతో పనిచేయనున్నాయి. దీంతో ప్రతి జియో ఫోన్ లో కూడా ఎస్‌బీఐ యోనో యాప్ ను అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో ఎస్‌బీఐ, ఇటు జియో కస్టమర్లు ఇద్దరూ రిలయన్స్‌ జియో ప్రైమ్‌ ప్రయోజనాన్ని పొందనున్నారు. ఈ భాగస్వామ్యంతో ఎస్‌బీఐ వినియోగదారులకు రివార్డు పాయింట్లు జమకానున్నాయి. జియో ప్రత్యేక ఆఫర్‌లు కూడా వీరికి అందుబాటులోకి రానున్నాయి. ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్ తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీల సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

మరింత +
RBI goes for back-to-back repo rate hike first time since October 2013, EMIs may get costlier

రెపోరేటు పెంపుతో పెరగనున్న రుణాలపై వడ్డీ

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచినట్లు వెల్లడించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో మానిటరీ పాలసీ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6.50 శాతానికి చేరుకుంది. ఇక రెపో రేటు పెరగడంతో బ్యాంకులు ఇక రుణాలపై వడ్డీ శాతాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏప్రిల్ నెల‌లో పారిశ్రామిక వృద్ధి మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని తెలిపారు ఉర్జిత్ ప‌టేల్. స‌ర్వీసుల రంగం వేగం పెరిగింద‌న్నారు. మొద‌టి రెండు నెలల్లో ఎఫ్‌డీఐ బాగా పెరిగింద‌న్నారు. పెట్టుబ‌డుల రంగం కూడా ఆశాజ‌న‌కంగానే ఉంద‌న్నారు ప‌టేల్. దేశ జీడీపీ 7.4 శాతం చేరుకుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

మరింత +
The Sensex touches the new peak today, Nifty50 records all time high

రంకెలేసిన సెన్సెక్స్, నిఫ్టీ: బలపడిన రూపాయి

భార‌తీయ‌ మార్కెట్ ఇవాళ ప‌రుగులు తీసింది. ఉద‌యం ట్రేడింగ్ మొద‌ల‌వ‌గానే రంకేసిన‌ట్టు స్టాక్‌మార్కెట్  పరుగు పెట్టింది. దీంతో సెన్సెక్స్ 107 పాయింట్లు లాభ‌ప‌డి 37 వేల మార్క్‌ను తాకింది. ఉదయం 36 వేల 972 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ట్రేడింగ్ మొదలవ‌గా.. ఆ తర్వాత శరవేగంగా దూసుకెళ్లింది. ఆగకుండా పైపైకి వెళ్లి 37 వేల మార్క్‌ను అందుకుంది. గురువారం సెన్సెక్స్  మొదటిసారి 37 వేల మార్క్ ను దాటింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ తో పాటు ముందుకు క‌దిలింది. 29 పాయింట్ల లాభంతో 11 వేల 172 పాయింట్లు చేరుకుని నిఫ్టీ ఆల్ టైమ్ రికార్డును సొంతం చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లార్సెన్ అండ్ ట‌ర్బో, ఐటీసీ, భార‌తి ఎయిర్ టెల్‌, హీరో సంస్థ‌లు.. సెన్సెక్స్ ప‌రుగులో లాభాలు పంచుకున్నాయి.  డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.63 పైస‌లుగా కొనసాగుతోంది.

మరింత +
Sensex closes at record high; Nifty settles at 11,084

సెన్సెక్స్ రికార్డ్ హై: మదుపర్ల ముఖాల్లో ఆనందం

దేశీయ మార్కెట్ ఇవాళ లాభాల బాట పట్టింది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై.. ఆ తర్వాత కాస్త తగ్గింది.. మళ్లీ పుంజుకొని సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా ఎగబాకి జీవనకాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కూడా భారీ లాభాలలో కొనసాగింది. జీఎస్టీ రేట్లు తగ్గడం వల్లే లాభాల్లో దూసుకెళ్లాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇక తొలి గంటలో మదుపర్లు కొనుగోళ్లు చేయకపోగా సూచీలు కొంత ఒడుదొడుకులకు లోనయ్యాయి. అయితే  లోహ, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలకు కలిసొచ్చింది. ఈ దూకుడుతో సెన్సెక్స్ రికార్డు స్థాయిలో లాభపడింది. ఇవాళ ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 222 పాయింట్లు పెరిగి 36 వేల 719 వద్ద సరికొత్త జీవన కాల మార్క్ ను తాకింది. అటు నిఫ్టీ కూడా 74 పాయింట్ల లాభంతో 11 వేల 85 వద్ద స్థిరపడింది. డాలర్ తో పోల్చితే.. రూపాయి మారకం విలువ 68.82 పైసలకు చేరుకుంది.

మరింత +
Gold Prices Rise For Third Straight Day, Silver prices down

బంగారం పెరిగింది.. వెండి తగ్గింది

దేశీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ పరిణామాల నేపధ్యంలో వ్యాపారుల కొనుగోళ్లు అధికమయ్యాయి. దీంతో బులియన్‌ మార్కెట్లో ఇవాళ పసిడి ధర మరింత ప్రియమైంది. గత రెండ్రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధర మూడో రోజు కూడా పెరిగింది. నిన్నటితో పోల్చితే తొలం బంగారం ధర 130 పెరిగి 31వేల మార్క్‌కు చేరుకుంది. నిన్నటి బంగారం ధర 30 వేల 970 ఉండేది. ఈ ఏడాది కనిష్ఠస్థాయి నుంచి కోలుకోవడంతో ట్రేడర్ల సెంటిమెంట్‌ బలపడినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అయితే వెండి ధర మాత్రం తగ్గుముఖం పట్టింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో వెండి డిమాండ్ తగ్గింది. దీంతో దీని ధర 645 రూపాయలు తగ్గింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజి వెండి ధర 39 వేల 255 పలికింది.

మరింత +
IDBI Bank shares drop 7% after employees threaten 6-day strike next week to protest stake sale to LIC

స‌మ్మెకు సిద్ధ‌మైన ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు

ఇండ‌స్ట్రియ‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) అధికారులు స‌మ్మెకు సిద్ద‌మ‌య్యారు. జులై 16 నుంచి ఆరు రోజుల పాటు వీరు సమ్మెలో కూర్చునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించిన నోటీసులు అధికారులు ఐడీబీఐ బ్యాంక్‌కు అందించారు. ఈ విష‌యాన్ని రెగ్యులేటరీ సంస్థలకు ఐడీబీఐ బ్యాంకుకు సమాచారం అందించారు. అదీగాక జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ విష‌యంతోపాటు వేతనానికి సంబంధించిన సమస్యలపై కొందరు ఐడీబీఐ అధికారులు సమ్మెచేస్తున్నట్టు తెలిపారు. స‌మ్మెకు సంబంధించిన‌ నోటీసులను తాము అందుకున్నామని ఐడీబీఐ బ్యాంక్‌, రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2012 నుంచి ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగుల వేతనాలను సవరించలేదని వారు పేర్కొన్నారు. వేత‌న స‌వ‌ర‌ణ‌పై గ‌తేడాది సమ్మె నోటీసు ఇచ్చినా మేనేజ్‌మెంట్‌ ఇచ్చిన హామీతో విరమించుకున్నామ‌న్నారు. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను ఎల్‌ఐసీకి అమ్మ‌డాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్ పేర్కొంది. దీనిపై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి వినతిపత్రం అందించింది. ఉద్యోగులు, అధికారులు సమ్మెకు దిగడంతో బ్యాంకు షేర్లు 7శాతం పడిపోయాయి. 

మరింత +
Sensex Opens 230 Points Higher, Nifty Above 10,800 On Positive Global Cues

పెరిగిన రూపాయి, సెన్సెక్స్ 150 పాయింట్ల పైకి

దేశీయ మార్కెట్ లాభాల్లో దూసుకుపోతోంది. ఇవాళ మ‌దుప‌ర్లకు లాభాలు చేర్చేలా మును ముందుకు కొనసాగింది. మొదట 230తో మొదలై 250 పాయింట్లకుపైగా దూసుకెళ్లింది. చివ‌రికి 174 పాయింట్ల వ‌ద్ద సెన్సెక్స్ ఆగి..  35 వేల 832 మార్క్ వ‌ద్ద నిలిచింది. మదుపర్లు కొనుగోళ్ల‌పై దృష్టి పెట్ట‌డంతో సెన్సెక్స్ లాభాల వైపుగా దూసుకెళ్లింది. మరో వైపు కార్పొరేట్‌ సంస్థ‌లు.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక ఫలితాలపై సానుకూలత వ్య‌క్తం చేయ‌డంతో ఈ ఫ‌లితాలు వ‌చ్చాయంటున్నారు మార్కెట్ విశ్లేష‌కులు. ఇటు నిఫ్టీ 10 వేల 800 మార్క్‌ పైన ట్రేడ్‌ అవుతోంది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 30 పైస‌లు పెరిగి 68.61గా కొనసాగుతోంది. టాటాస్టీల్‌, రిలయన్స్‌, యస్‌ బ్యాంక్‌ తదిరత షేర్లు లాభాల బాట‌లో ప‌రిగెత్తాయి. టీసీఎస్‌, టైటాన్‌, భారత్‌ పెట్రోలియం షేర్లు నష్టాల్లో కొన‌సాగుతున్నాయి.

మరింత +