వీడియోలు

Raj News Telugu Special Talk Show With Munugode Congress MLA Komatireddy Rajagopal Reddy

P1:ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో టాక్‌షో

Raj News Special Talk Show With Munugode Congress MLA Komatireddy Rajagopal Reddy by Input Editor Sunil Reddy

మరింత +
Special Talk Show With Munugode Congress MLA Komatireddy Rajagopal Reddy

P2:ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో టాక్‌షో

Raj News Special Talk Show With Munugode Congress MLA Komatireddy Rajagopal Reddy by Input Editor Sunil Reddy 

మరింత +
Dear CM KCR : How do you promise to Sharath without knowing land issues behind that

డియర్ సీఎం: నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో హామీలా..!

రైతు శరత్ భూ వివాదంలో కొత్త మలుపు తిరిగింది. సీఎం కేసీఆర్ సంభాషణపై ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో మహిళ వాయిస్ రికార్డింగ్ వైరల్ అవుతోంది. తమ భూమిపై నిజానిజాలు తెలుసుకోకుండా ఎలా హామీ ఇచ్చారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

సీఎం గొప్పలకు పోయి తమ భూమికి ఎలా హామీ ఇస్తారని కడిగిపారేసింది. గులాబీ బాస్ తీరును ప్రశ్నించింది. సీఎం స్థాయిలో వాస్తవాలేంటో తెలుసుకోకుండా.. సోషల్ మీడియాలో పోస్ట్‌ను చూసి స్పందించానంటూ బిల్డప్ ఇచ్చారని ఫైర్ అయ్యింది. కుటుంబ సభ్యలు మధ్య ఉన్న వివాదంలో పరిష్కారం చేయకుండా.. ఏక పక్షంగా మాట్లాడటంపై మండిపడింది. తమ ల్యాండ్‌ను శరత్ తప్పుదోవ పట్టించారంటూ తెలిపింది. కేసీఆర్ ఇప్పటికైనా తమ ఆవేదన తెలుసుకొని అందరికి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించింది.

మరింత +
AICC releases Lok Sabha Candidates 3rd list for elections

ఏఐసీసీ లోక్ సభ మూడో జాబితా విడుదల

పార్లమెంట్ ఎన్నికల కోసం ఏఐసీసీ మూడో జాబితాను విడుదల చేసింది. ఈ మూడో జాబితాలో తెలంగాణ నుంచి 8 మందిని ప్రకటించింది. ఇదే తెలంగాణ కాంగ్రెస్ నుంచి మొదటి జాబితా. ఇటు అస్సోంకు ఐదుగురు, మేఘాలయాకు ఇద్దరు ,నాగాలాండ్ , సిక్కిం , యూపీ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం.

తెలంగాణ లోక్ సభ అభ్యర్థులు వీళ్లే..

1. ఆదిలాబాద్- రమేష్ రాథోడ్
2. పెద్దపల్లి-  ఏ చంద్రశేఖర్ 
3. కరీంనగర్-  పొన్నం ప్రభాకర్
4. జహీరాబాద్-  కె మదన్ మోహన్ రావు
5. మెదక్-  గాలి అనిల్ కుమార్
6. మాల్కాజ్ గిరి-  ఏ రేవంత్ రెడ్డి
7. చెవేళ్ల-  కొండా విశ్వేశ్వర్ రెడ్డి
8. మహబూబాబాద్-  బలరాం నాయక్

మరింత +
BJP Gift to Farmers: Announced 6000 to farmers under Kisan Samman Yojana Scheme

మోడీ రైతు బంధు పథకం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ మోడీ ప్రభుత్వం మరో బ్రహ్మోస్త్రాన్ని సంధించింది. ఇటీవల బీజేపీకి వరుస ఓటములు ఎదురవుతున్న వేళ మధ్యంతర బడ్జెట్ లో 12కోట్ల చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరేలా రైతుబంధు తరహా పథకాన్ని ప్రకటించింది.

మరింత +
Budget 2019 : Cost of Mobile Data & Voice Calls in India are Now lowest in the World

ప్రపంచంలోనే అత్యంత తక్కువ కాల్, డేటా చార్జీలు భారత్‌లోనే

ప్రపంచంలోనే అత్యంత తక్కువ కాల్, డేటా చార్జీలు భారత్‌లోనే ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. పార్లమెంట్ లో 2019 మధ్యంత బడ్జెట్ ను తొలిసారి లోకసభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చికిత్స కోసం విదేశాల్లో ఉండగా.. ఆ బాధ్యతను పీయూష్‌కు ఇచ్చారు ప్రధాని మోడీ.

మరింత +
Central Minister Piyush Goyal Press Meet on Union Budget 2019

మాది బడుగు బలహీన వర్గాల బడ్జెట్: గోయల్

అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉందని కేంద్ర ఆర్థిక శాఖమంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్దికి కేంద్రం పని చేస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అవినీతి లేకుండా పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు.

మరింత +
See How TPCC Working President Revanth Reddy arrested by Telangana Police at Home in the Midnight on 3rd December

రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసిన తీరు..

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేశారు. ముందుగా హైదరాబాద్‌కు తరలిచేందుకు ఏర్పాట్లు చేసిన పోలీసులు అనంతరం జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, ఇంటి తలుపులు పగులగొట్టి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. రేవంత్ అరెస్టును సీపీఐ నేత నారాయణ ఖండించారు. కేసీఆర్ ఓటమి భయంతోనే రేవంత్‌ను అరెస్ట్ అరెస్ట్ చేశారని ఆయన ఆరోపించారు.

మరింత +
Prajakutami Leaders Released People's Manifesto for Telangana Assembly Polls

ప్రజా కూటమి ఎన్నికల ప్రణాళికలో వరాల జల్లు

అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ప్రజా కూటమి ఎన్నికల ప్రణాళిక విడుదలైంది. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ కూటమి నేతలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఎల్‌.రమణ, కోదండరాం, పల్లా వెంకట్‌ రెడ్డి విడుదల చేసిన.. ఈ మేనిఫెస్టోలో రైతులకు ఏకకాలంలో 2లక్షల రూపాయల వరకు రుణమాఫీ, పింఛను వయో పరిమితిని 60 నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తామని కూటమి నేతలు వెల్లడించారు. ప్రజా కూటమిని తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారని ఆ నమ్మకం తమకు ఉందని వారు ధీమా వ్యక్తం చేశారు.

మరింత +
Komatireddy Raj Gopal Reddy Election Campaign at Sarampeta | Munugode

అబద్ధపు హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేశారు

కేసీఆర్, కేటీఆర్‌లపై మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలతో ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. కేవలం ఓట్ల కోసమే అమలు చేయలేని హామీలను ఇస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో కుదాబక్షుపల్లి ప్రాజెక్టుల పనులను 10శాతం కూడా పనులు పూర్తిచేయలేదని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌లు ఎవరు వచ్చినా మునుగోడులో తన గెలుపును ఆపలేరన్నారు. 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఒక న్యాయం, చర్లగూడెం భూ నిర్వాసితులకు ఓ న్యాయమా..? అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ప్రశ్నించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చర్లగూడెంలో భూ నిర్వాసితులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భూ సేకరణ చట్టాన్ని పక్కన పెట్టి.. అన్యాయంగా రైతుల భూములను లాక్కుని ప్రాజెక్ట్‌లు కడుతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. అబద్ధాల మాటలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఓటు వేయోద్దని పిలుపునిచ్చారు. అబద్ధాల పుట్ట కేసీఆర్, అబద్ధాలు చెప్పడంలో దిట్ట కేసీఆర్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. అబద్ధపు హామీలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని, కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు.

మరింత +
Komatireddy Raj Gopal Reddy Election Campaign at Choutuppal

కోమటి రెడ్డి బ్రదర్స్ మాట తప్పినట్టు చరిత్రలో లేదు

మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.నియోజకవర్గంలో ఆయన ఎక్కడికి వెళ్లినా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు.చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులో నిర్వహించిన ప్రచారంలో కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మునుగోడు ప్రాంతం అభివృద్దే తన లక్ష్యమని,ప్రజలకు సేవ చేయడం కోసమే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారన్నారు. ప్రజలను కేసీఆర్ మాటలతో మభ్యపెడుతున్నారని,మరోసారి ప్రజలు మోసపోవద్దు అన్నారు. కుసుకుంట్లను ఇంటికి పంపి,కేసీఆర్‌ను ఫాంహౌజ్‌కు పంపాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కోమటి రెడ్డి బ్రదర్స్ మాట ఇస్తే తప్పినట్లు చరిత్రలో లేదని, తమను నమ్ముకున్న వారిని ఎప్పుడూ మోసం చేయమన్నారు.ఆపదలో ఉన్నవారు అర్ధరాత్రి ఫోన్‌చేసినా తాము స్పందిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు.

మరింత +
KCR Speech at TRS Praja Ashirvada Sabha in Jadcherla | Telangana Polls |

సభలలో చంద్రబాబును టార్గెట్ చేసిన కేసీఆర్

పాలమూరు జిల్లా జడ్చర్ల ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొన్నారు. నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందనీ ఆయన అన్నారు. అయినా ప్రతిపక్ష పార్టీలు పని కట్టుకొని మరీ విమర్శలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు.తమకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జడ్చర్ల టీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచార సభల్లో వరుసగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు కేసీఆర్. జడ్చర్ల, దేవరకొండ సభలలోనూ అదే విధానాన్ని కొనసాగించారు. పాలమూరుకు నీళ్లు రానీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారనీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుతారని కేసీఆర్ ప్రశ్నించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాలు సాగులోకి రావాలనీ ఉద్దండాపూర్ దగ్గర రిజర్వాయర్ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు.

మరింత +
Congress STAR Campaigner Kushboo Face to Face | Fires on KCR | Raj News

కేసీఆర్‌ను కడిగిపారేసిన ఖుష్భూ

కేసీఆర్ సర్కారుపై ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖుష్బూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నాలుగున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయలేదంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని.. నలుగురి చేతిలోనే పాలన సాగిందంటూ మండిపడ్డారు. అవినీతిలో దేశంలోనే రెండో స్థానానికి తెలంగాణ రావడంలో కేసీఆర్ పాత్ర ఎంతో ఉందంటూ సెటైర్లు వేశారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారామె.

మరింత +
Dharna Chowk should be open for protests, Hyd HC tells Telangana govt

ధర్నా చౌక్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్‌: టీఆర్ఎస్ పతనం షురూ

తెలంగాణలో మళ్లీ స్వేచ్చా వాయువులు మొదలయ్యాయి. ధర్నా చౌక్ ఎత్తివేతను కొట్టేస్తూ కోర్టు ఉత్తరువులు జారీ చేసింది. దీంతో TRS పతనం మొదలైయ్యిందన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం. కోర్టు తీర్పును ప్రజా విజయంగా అభివర్ణించాయి వివిధ ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు. ప్రజల ఆవేదనను నిరసన రూపంలో తెలియజేయడానికి ధర్నా చౌక్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

మరింత +
KCR to Campaign 3 constituency per day, targets 100 meetings in 50days from November 6th

రోజుకు మూడు నియోజక వర్గాల్లో కేసీఆర్ ప్రచారం

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ నియోజకవర్గాల వారీగా ప్రచారానికి రెఢీ అవుతున్నారు. గత ఎన్నికల తరహాలోనే ఈసారి వంద అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి షెడ్యూల్‌ ప్లాన్ చేస్తున్నారు. తొలుత ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించి ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ప్రచార సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఈ బహిరంగ సభలు నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. నిజానికి అక్టోబర్‌లోనే బహిరంగసభలను పూర్తి చేయాలని మొదట అనుకున్నా మహాకూటమిపై స్పష్టత రాకపోవడంతో వచ్చే వారానికి వీటి నిర్వహణ వాయిదా వేశారు. మూడు ఉమ్మడి జిల్లాల బహిరంగ సభల తేదీలను రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం నియోజకవర్గాల వారీగా ప్రచార షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇక ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిరోజూ కనీసం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కొద్దిరోజుల పాటు రోజుకు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం ప్రచారం చేసేలా షెడ్యూల్‌ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రచార నిర్వహణ షెడ్యుల్ పై మంగళవారం ఉమ్మడి జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కేసీఆర్‌ పలువురు పార్టీ ముఖ్యనేతలతో చర్చించారు. దశలవారీగా ప్రచారం నిర్వహించే నియోజకవర్గాల జాబితాను రూపొందించారు. మహాకూటమిని లక్ష్యంగా చేసుకోని చేయనున్న ఈ ప్రచారంలో స్థానికంగా ప్రజలను ఆకట్టుకునే అంశాలు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నారు.

మరింత +