ముఖ్యాంశాలు

Major chaos at BJP presser in Delhi; shoe hurled at MP GVL Narasimha Rao; suspect detained

బీజేపీ ఎంపీపై బూటు విసిరిన వ్యక్తి అరెస్ట్

బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా, అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. జీవీఎల్ మీడియాతో మాట్లాడుతుండగానే ఓ వ్యక్తి ఆయన పై చెప్పును విసిరాడు. వెంటనే అప్రమత్తమైన బీజేపీ కార్యకర్తలు, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, జీవీఎల్ పై చెప్పు విసిరిన వ్యక్తిని యూపీలోని కాన్పూర్ కు చెందిన శక్తి భార్గవగా పోలీసులు గుర్తించారు.

మరింత +
Maoists Kill Poll Panel Official In Odisha Ahead Of Second Phase Of Polls

ఒడిస్సాలో పోల్ సిబ్బంది వాహనం పేల్చివేత

ఒడిస్సాలోని కధమాల్ అటవీప్రాంతంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. పోలింగ్ సిబ్బందే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ దాడిలో పోలింగ్ ఏజెంట్ స్జుక్తా దిగల్ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్‌ను విస్తృతం చేశాయి. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

మరింత +
Police force deployed in large number at Manda Krishna Madiga house in Amberpet

మందకృష్ణ మాదిగ హౌస్ అరెస్ట్

ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అంబర్‌పేటలోని డీడీ కాలనీలో ఆయన నివాసం ముందు భారీగా పోలీసులు మోహరించారు. మందకృష్ణ మాదిగ అరెస్ట్‌ను ఎమ్మార్పీఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందోని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నియంతల వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. అంబేద్కర్‌ విగ్రహానికి జరిగిన అవమానికి నిరసనగా ఈ నెల 22 వరకు గ్రామపంచాయతీలు, అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని మందకృష్ణ తెలిపారు. దీంతో పోలీసులు ఆయనను ఇంటి నుంచి బయటికి రాకుండా నిర్భందించారు.

మరింత +
Temperature set to rise further this week in Hyderabad says IMD

భాగ్యనగరంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

భానుడు భాగ్యనగరంపై నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడంతోపాటు వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం నగరంలో గరిష్ఠంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగురోజులుగా నగరంలో సాధారణం కంటే 2- 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు 25-26 డిగ్రీలకు చేరడంతో రాత్రివేళల్లో సైతం వేడిగాలుల తీవ్రత కన్పిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో మధ్యాహ్న సమయంలో రోడ్లపైకి వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ప్రధాన రహదారులపై వచ్చేందుకు వాహనదారులు భయపడుతున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో, ఏప్రిల్‌ చివరి నాటికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు చేరే అవకాశముందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఉష్ణోగ్రతలతోపాటు వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు కూడా వీచే అవకాశాలు అధికంగా ఉంటాయని, ఏప్రిల్‌, మే నెలలో సాధారణం కంటే 4-5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, జూన్‌లో వర్షాలు కురిసే వరకు ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరింత +
Manda Krishna call state level protest on 22nd April over Ambedkar Statue issue

ఈనెల 22న రాష్ట్ర వ్యాప్త నిరసనకు MRPS పిలుపు

హైదరాబాద్ లో రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్‌ విగ్రహన్ని తొలగించడాన్ని నిరసిస్తూ, ఈ రోజు ఎమ్మార్సీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ నిరసనకు దిగనున్నారు.అయితే హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద నిరసన చేసేందుకు ఆయన పోలీసుల అనుమతి కోరగా, శాంతి భద్రతల దృష్ట్యా అతని నిరసనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు త్వరలో తగిన బుద్ది చెప్తామని, అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల 22 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని మందక్రిష్ణ పిలుపునిచ్చారు.

మరింత +
High Court of Telangana line clears for Local Body polls, EC ready to conduct polls in May 1st and 2nd Week

స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో లోకల్ వార్‌కి అడ్డంకులు తొలిగాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఆపలేము అని కోర్టు తేల్చిచెప్పింది. ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ బీసీ సంఘం నేతలు వేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50శాతం మించకూడదని తెలిపింది. రిజర్వేషన్ల పిటిషన్ పై 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22 వ తేదీకి వాయిదా వేసింది. మే నెలలో 3 దశల్లో MPTC, ZPTC ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. మే 6, మే 10, మే 14 తేదీల్లో పరిషత్ ఎన్నికలు జరుగుతాయని, షెడ్యూల్‌ని ప్రభుత్వానికి అందచేసినట్లు సమాచారం.

మరింత +
India Squad 2019: BCCI announced India Team for World Cup in England and Wales on May 30

వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టు ఇదే...

వరల్డ్ కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ ముంబయిలో సమావేశమై 15 మందితో కూడిన టీమిండియా జట్టను ప్రకటించింది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు సీనియర్ ఆటగాళ్లు హాజరయ్యారు. 
విరాట్ కోహ్లీ సేన ఇదే.. 
విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌) , ధోనీ, రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్‌ శంకర్‌, కేఎల్‌ రాహుల్‌, దినేశ్‌ కార్తీక్‌, చాహల్‌ భువనేశ్వర్‌ కుమార్‌, కుల్దీప్‌యాదవ్‌, బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ.

మరింత +
Chandrababu Naidu to campaign in Karnataka to support Congress-JDS alliance

కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమికి బాబు ప్రచారం

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. జేడీఎస్, కాంగ్రెస్ కూటమికి మద్దతుగా చంద్రబాబు ప్రచారంలో పాల్గొంటారు. మాజీ ప్రధాని దేవెగౌడ, ఆయన తనయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామితో కలిసి చంద్రబాబు పలు సభలతో పాటు రోడ్ షోలలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత +
CM KCR to attend TRS Party executive meet at TRS Bhavan today

ఇవాళ మధ్యాహ్నం టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నేడు జరగునుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం సమావేశం కానుంది. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పోటీచేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ఈ సమావేశానికి దాదాపు 400 మంది పార్టీ నేతలు హాజరయ్యే అవకాశం ఉన్నది. సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రణాళికపై విస్తృతంగా చర్చిస్తారు.

మరింత +
Sri Rama's Maha Pattabhishekam ceremony today at Bhadradri Temple

ఘనంగా భద్రాద్రి రాముడి పట్టాభిషేకం

భద్రాద్రి ఆలయంలో శ్రీరాముడి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరుగుతోంది. ఆలయ ప్రాంగంణం అంతా శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది. అశేష భక్త జనసందోహం మధ్య శ్రీరామపట్టాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకు ముందు భద్రాద్రి రామయ్యను గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు దర్శించుకున్నారు. ప్రధానాలయంలో అర్చకులు పూజలు నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి ఆలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరింత +
Passengers foil robbery bid on Sampark Kranti Express, case filed in Khazipeta Railway Station

ఎక్స్‌ప్రెస్‌ రైల్లో దోపిడీ దొంగల భీభత్సం

యశ్వంత్‌పూర్‌-ఢిల్లి సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. ఆరుగురు ప్రయాణికుల నుంచి దోపిడీ దొంగలు బంగారం, నగదు దోచుకున్నారు. రైలులో వెళుతున్న ప్రయాణికులకు దుండగులు మత్తు మందు ఇచ్చి దోపిడికి పాల్పడ్డారు. దీంతో బాధిత ప్రయాణికులు కాజీపేట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. వీరిలో ముగ్గురు యూపీ, ఒకరు త్రిపుర, ఒకరు మధ్యప్రదేశ్, మరొకరు కర్ణాటకకు చెందినవారిగా జీఆర్పీ పోలీసులు గుర్తించారు.

మరింత +
Democratic Teachers Federation demands to release Human Rights Activist Varavara Rao, Teachers arrested at TNO Bhavan in Hyderabad

పౌరహక్కుల నేతలను వెంటనే విడుదల చేయాలి

నాంపల్లి టీఎన్జీవోస్ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా అరెస్ట్ చేసిన వరవరరావు, పౌరహక్కుల నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ నాంపల్లిలోని టీఎన్జీవోస్ భవన్‌లో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన సభ తలపెట్టారు. అయితే ఈ సభకు హాజరయ్యేందుకు వచ్చిన ఉపాధ్యాయులను గాంధీ భవన్ ముందు పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అలాగే సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రొఫెసర్ హరగోపాల్‌ను కూడా అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మరింత +
TDP Chief Chandrababu Naidu Going to Delhi today

నేడు ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో టీడీపీ రివిజన్ పిటిషన్ వేయనుంది. చంద్రబాబు వెంట పార్టీ సీనియర్ నేతలు తరలివెళ్లనున్నారు. ఎన్నికల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం, మొరాయించడం, పార్టీల గుర్తు మారడం వంటి అంశాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీకి వీటిపై చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు.

మరింత +
Two more days to release ZPTC, MPP election notification said sources

రెండ్రోజుల్లో జెడ్పిటీసీ, ఎంపీపీ ఎన్నికల నోటిఫికేషన్

జెడ్పిటీసీ, ఎంపీపీ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు జెడ్పిటీసీ, ఎంపీపీ ఎన్నికలు నిర్వహించాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ సర్కార్ ప్రతిపాదించింది. దీనిపై రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఫలితాలను మాత్రం లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాతే ప్రకటిస్తారని తెలుస్తోంది.

మరింత +
AP Inter second year results out, 72% passed

ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలే ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఉదయలక్ష్మీ. పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 60 శాతం, సెకండియర్లో 72 ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. ఈ ఫలితాల్లో బాలికలే ఎక్కువగా ఉత్తీర్ణత పొందారని తెలిపారు. 81% శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటిస్థానంలో, కడప జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు. తొలిసారిగా గ్రేడింగ్‌ విధానంలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశామన్నారు.ఫస్టియర్‌లో 13,966 మందికి, సెకండియర్‌లో 9,340 మంది విద్యార్థులకు 10కి 10 గ్రేడ్‌లు వచ్చాయి. మే 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. 
ఇక ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్ సైట్(www.bieap.govt.in) లో తెలుసుకోవచ్చు లేదా APGEN2REGISTRATION NO to 56263 ఎస్ ఎమ్ ఎస్ పంపి తెలుసుకోవచ్చు.

మరింత +