ఆంధ్రప్రదేశ్ వార్తలు

YS Sharmila fire on Chandrababu and Nara Lokesh over false promises

నిరుద్యోగులకు జాబుల్లేవు కానీ లోకేష్‌కు 3మంత్రిత్వ శాఖలా?

అధికార పార్టీ నేతల తీరును వైఎస్ షర్మిల కడిగిపారేశారు. సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. సంక్షేమం పేరుతో మరోసారి మోసానికి బయలుదేరారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చలేదని ఏపీ సీఎంపై ఫైర్ అయ్యారు. రుణమాఫీ అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో దోచుకొని దాచుకున్నారంటూ సైకిల్ లీడర్ల బాగోతాలను బయటపెట్టారు. రాజధాని పేరుతో రాజమౌళి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని హామీ ఇచ్చిన చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌కు మూడు మంత్రిత్వ శాఖలను ఎలా కేటాయిస్తారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.

మరింత +
Janasena releases final list of Assembly and Lok sabha contestants

జనసేన పార్టీ అభ్యర్థుల ఫైనల్ జాబితా విడుదల

జనసేన పార్టీ ఇవాళ తమ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఇదివరకే కొన్ని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించగా.. మరి కొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. తాజాగా 19 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించింది.  

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే.. 

నరసన్నపేట- మెట్ట వైకుంఠం 
విజయనగరం- పాలవలస యశస్వి 
గజపతి నగరం- రాజీవ్‌ కుమార్‌ తలచుట్ల 
నర్సీపట్నం- వేగి దివాకర్‌ 
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు 
అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ 
యర్రగొండపాలెం (ఎస్సీ)- డాక్టర్‌ గౌతమ్‌ 
కందుకూరు- పులి మల్లికార్జునరావు 
ఆత్మకూరు- జి.చిన్నారెడ్డి 
బనగానపల్లి- సజ్జల అరవింద్‌ రాణి 
శ్రీశైలం- సజ్జల సుజల 
ఆలూరు- ఎస్‌ వెంకప్ప 
పెనుకొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మి 
పత్తికొండ- కెఎల్‌ మూర్తి 
ఉరవకొండ- సాకే రవికుమార్‌ 
శింగనమల (ఎస్సీ)- సాకే మురళీకృష్ణ 
పుట్టపర్తి- పత్తి చలపతి 
చిత్తూరు- ఎన్‌.దయారామ్‌ 
కుప్పం- డాక్టర్‌ వెంకటరమణ 
 
లోక్‌సభ అభ్యర్థులు వీళ్లే... 

విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్‌ 
నరసరావుపేట- నయూబ్‌ కమాల్‌ 
హిందూపూర్‌- కరీముల్లా ఖాన్‌

మరింత +
YCP Chief YS Jagan Election Campaign in Kurnool, Chittoor and Anantapur today

చంద్రబాబు సొంత జిల్లాలో జగన్ ఎన్నికల ప్రచారం

వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాలో నేడు జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం ఆదోనిలో జగన్ పర్యటన కొనసాగుతుంది. ఆ తరువాత తాడిపత్రి, మదనపల్లిలలో జగన్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ నేతలు పూర్తిచేశారు.

మరింత +
MLA Roja files nominations for Nagari Assembly seat in Chittoor

నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా నామినేషన్

చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గంలో YSR పార్టీ తరపున ఎమ్మెల్యే రోజా నామినేషన్ వేశారు. వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు.చంద్రబాబు గెలిచేందుకు కుట్రలు పన్నుతున్నారని, పవన్ తో లోపాయికారి ఒప్పందం చేసుకొన్నారని విమర్శించారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మాత్రం వైసీపీదే అన్నారు.

మరింత +
Voting For YSR Congress Like Writing Death Warrant: Chandrababu Naidu

జగన్ గురించి జేడీ లక్ష్మీనారాయణ నిజాలు చెప్పాలి

వైసీపీ అధినేత YS జగన్ పై ఏపీ CM చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ మాట్లాడేవి అన్ని అవాస్తవాలని, అక్రమాలకు మరో పేరు జగన్ అని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి విషయాల్లో వాస్తవాలు చెప్పాలని లక్ష్మీనారాయణను ఆయన డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్యకేసును టీడీపీనే చేయించిందనడం దారుణ మన్నారు. వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని దోషులు ఎవరైనా కఠిన శిక్ష తప్పదన్నారు.

మరింత +
Nara Lokesh at Mangalagiri, YS Jagan at Pulivendula and Pawan Kalyan at Bheemavaram file namination papers for AP Assembly elections

ఏపీలో ప్రముఖుల నామినేషన్‌లు

ఏపీలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. మంగళగిరి తహశీల్ధార్ ఆఫీస్ లో ఏపీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులతో వచ్చిన ఆయన మంగళగిరిలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలొచ్చారు.  

ఇక కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ పత్రాలు సమర్పించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.  

ఇటు భీమవరంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. హెలికాప్టర్ ద్వారా భీమవరం చేరుకున్న పవన్ కళ్యాణ్ కు జనసేన నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచీ జనాసైనికుల భారీ ర్యాలీతో పవన్ కళ్యాణ్ ఎమ్మార్వో ఆఫీస్ కు చేరుకుని తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. జన సైనికుల ర్యాలీతో భీమవరం పట్టణం మారుమ్రోగింది.
హీరో నందమూరి బాలకృష్ణ‌ ఇదివరకు పోటీ చేసిన హిందూపురం సీటుకే నామినేషన్ పత్రాలు సమర్పించారు.

మరింత +
Janasena Candidate Ravela Kishore Babu election campaign at Pattipati in Guntur

పత్తిపాడులో జనసేన అభ్యర్థి రావెల కిషోర్ ప్రచారం

గుంటూరు జిల్లా పత్తిపాడు నుంచి జనసేన తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న రావెల పత్తిపాడు నియోజకవర్గాన్ని మంత్రిగా అభివృద్ది చేశానన్నారు. పవన్ సిద్దాంతాలతో ప్రజల్లోకి వెళ్తున్నామని ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. తాను మరోసారి గెలిస్తే పెండింగ్‌లో ఉన్న అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేస్తానన్నారు. అంతేకాకుండా పత్తిపాడు నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటున్న రావెల కిషోర్ బాబు

మరింత +
AP CM Chandrababu Naidu road show in Eluru in Andhrapradesh

నేడు ఏలూరులో చంద్రబాబు రోడ్ షో

నేటి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బహిరంగ సభలు,రోడ్ షో ల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు చంద్రబాబు. ఇవాళ మధ్యాహ్నం చింతలపూడి నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. సాయంత్రం నూజివీడు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి ఏడు గంటలకు ఏలూరులో రోడ్ షో, బహిరంగ సభలలో పాల్గొని టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు.

మరింత +
Janasena Party Chief Pawan Kalyan to contest from Gajuvaka and Bheemavaram Assembly seats in AP Elections

ఏపీలో పవన్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలు ఇవే...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ స్థానాలను అధికారికంగా ప్రకటించారు. ఆయన పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం, అలాగే విశాఖలోని గాజువాక నియోజకవర్గాల నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు ఇవాళ వెల్లడించారు. పార్టీలో విస్తృత చర్చల అనంతరం నాయకుల ఆమోదంతో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో పవన్ పోటీ చేసే స్థానాలను తెలియజేశారు. గాజువాక నియోజకవర్గాల్లో కాపు ఓటు బ్యాంకు పెద్ద సంఖ్యలో ఉండడంతో తనకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు పవన్. ఇటు భీమవరంలో 2004 నుంచి వరుసగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులే గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు పవన్ 77 మంది జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఇక పొత్తులో భాగంగా బీఎస్పీకి 21 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలను కేటాయించారు. ఇటు సీపీఐ, సీపీఎంలకు 7 చొప్పున అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు కేటాయించారు.

మరింత +
AP congress Releases 132 Assembly, 25 MP Candidates for Elections

APCC: 132 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్థుల ఖరారు

ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 22 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మిగతా రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అలాగే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 132 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.  

ఏపీలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులను చూస్తే బాపట్ల నుంచి జే.డి. శీలం, ఒంగోలు నుంచి సిరివెల్ల ప్రసాద్, అమలాపురం నుంచి జంగా గౌతమ్, గుంటూరు నుంచి ఎస్.కే. మస్తాన్ వలీ, కాకినాడ నుంచి పల్లంరాజ, కర్నూల్ నుంచి అహ్మద్ అలీఖాన్, అనంతపురం నుంచి కే.రాజీవ్ రెడ్డి, హిందూపూర్ నుంచి కే.టి. శ్రీధర్, కడప నుంచి జి. శ్రీరాములు, నెల్లూరు నుంచి దేవకుమార్ రెడ్డి, తిరుపతి నుంచి చింతా మోహన్, రాజంపేట నుంచి షాజహాన్ బాషా కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులగా ఎంపికయ్యారు.  

అలాగే చిత్తూరు నుంచి శ్రీ రంగప్ప, అరకు నుంచి శృతిదేవీ, శ్రీకాకుళం నుంచి డోలా జగన్ మోహన్ రావు, విజయనగరం నుంచి యడ్ల ఆదిరాజు, అనకాపల్లి నుంచి శ్రీ రామమూర్తి, రాజమండ్రి నుంచి ఎన్.వి. శ్రీనివాస్ రావు, ఏలూరు నుంచి జెట్టి గురునాథరావు, మచిలీపట్నం నుంచి గొల్లు కృష్ణ, నరసరావుపేట నుంచి పక్కాల సూరిబాబు, నరసాపురం నుంచి కనుమూరి బాపిరాజు కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల పోటీ చేయనున్నారు.

మరింత +
TDP final list for 25 Lok Sabha, 36 Assembly seats released

టీడీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల

లోక్‌సభ ఎన్నికల సంబంధించి తీవ్ర కసరత్తు చేసిన TDP అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. అలాగే పెండింగ్‌లో ఉంచి 36 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది.  

టీడీపీ లోక్ సభ అభ్యర్థులను చూస్తే శ్రీకాకుళం నుంచి రామ్మోహన్‌ నాయుడు, విజయనగరం నుంచి అశోక్‌ గజపతిరాజు, అరకు నుంచి కిషోర్‌ చంద్రదేవ్‌, విశాఖ నంచి భరత్‌, అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్‌, కాకినాడ- చలమలశెట్టి సునీల్‌, అమలాపురం నుంచి గంటి హరీష్‌, రాజమండ్రి నుంచి మాగంటి రూప, నర్సాపురం నుంచి వేటుకూరి వెంకట శివరామరాజు, ఏలూరు నుంచి మాగంటి బాబు పోటీ చేయనున్నారు.  

అలాగే విజయవాడ నుంచి కేశినేని నాని, మచిలీపట్నం నుంచి కొనకళ్ల నారాయణ, గుంటూరు నుంచి గల్లా జయదేవ్‌, నర్సారావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు, బాపట్ల నుంచి శ్రీరాం మాల్యాద్రి, ఒంగోలు నుంచి శిద్దా రాఘవరావు, నెల్లూరు నుంచి బీదా మస్తాన్‌రావు, కడప నుంచి ఆది నారాయణరెడ్డి, హిందూపురం నుంచి నిమ్మల కిష్టప్ప, అనంతపురం నుంచి జేసీ పవన్‌రెడ్డి, నంద్యాల నుంచి మాండ్ర శివానంద్‌రెడ్డి, కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రాజంపేట నుంచి డీకే సత్యప్రభ, తిరుపతి నుంచి పనబాక లక్ష్మి, చిత్తూరు నుంచి శివప్రసాద్‌ టీడీపీ అభ్యర్థిగా లోక్ సభ పోటీ చేయనున్నారు.

మరింత +
AP CM Chandrababu Naidu Election Campaign at SVGS College in Nellore today

నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఏపీ సిఎం చంద్రబాబు నేడు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు నగరంలో పార్టీ కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు, బూత్ స్థాయి కన్వీనర్లతో సమావేశం నిర్వహించనున్నారు.ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్థేశం చేయనున్నారు. ఉదయం 10 గంటల 30నిమిషాలకు హెలికాప్టర్‌లో నెల్లూరు పోలీసు కవాతు మైదానానికి చేరుకోనున్నారు. 10గంటల 40నిమిషాలకు SVGS కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. 11నుంచి 12గంటల వరకు నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లతో సమీక్షనిర్వహంచనున్నారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను పార్టీ శ్రేణులకు వివరించనున్నారు.

మరింత +
Police fire in the air to control mob at Kagallu in Mantralayam Constituency in Kurnool, TDP Leader Tikkareddy wounded

మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తత

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కాగల్లులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగల్లులో ప్రచారానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల్లో తిక్కారెడ్డి కాలికి బుల్లెట్ తగిలి గాయం అయింది. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో తిక్కారెడ్డి చికిత్స పొందుతున్నారు.

మరింత +
YS Vivekananda Reddy's funeral at Pulivendula in Kadapa district

పులివెందులలో వివేకానందరెడ్డి అంత్యక్రియలు

కడపలో దారుణ హత్యకు గురైన వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి సమాధి పక్కనే వివేకానందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు వైఎస్‌ వివేకానందరెడ్డి భౌతికకాయాన్ని చివరిసారి చూసేందుకు రాజకీయ నేతలు, అభిమానులు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును రాష్ట్రేతర సంస్థకు అప్పగించాలని వైసీపీ నేతలు కోరుతున్నారు.

మరింత +
AP PCC screening committee sits to finalise AP Congress candidates list for Assembly and Lok Sabha

ఏపీ అసెంబ్లీ,లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. మరోవైపు వార్ రూమ్ లో ఏపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక పై రాష్ట్ర స్క్రీనింగ్ కమిటి సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్, పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాష్ట్ర ఏఐసిసి ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ, ఏఐసిసి ఇంచార్జ్ సెక్రటరీ లు క్రిస్టఫర్, మేయప్పన్‌లు పాల్గొననున్నారు.

మరింత +