తెలంగాణ వార్తలు

KCR is the only reason for not giving Peddapalli TRS MP Seat says Ex MP G Vivek

కేసీఆర్ వల్లే నాకు టికెట్ రాలేదు:మాజీఎంపీ వివేక్

కేసీఆర్ వల్లే తనకు టికెట్ రాలేదని పెద్దపల్లి మాజీఎంపీ వివేక్ అన్నారు. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుదామనుకున్నా.. సమయం సరిపొలేదని చెప్పారు. ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. ఇప్పటి వరకు అండంగా నిలిచిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. దీనికి ముందు పెద్దపల్లి టికెట్ ఆశించి బీజేపీ, బీఎస్‌పీ పార్టీలను సంప్రదించారు వివేక్.

మరింత +
CLP Leader Bhatti Vikramarka fire on KCR over undemocratic rule in Telangana

కేసీఆర్ అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారు:భట్టి

సీఎం కేసీఆర్‌పై సీఎల్పీనేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రజాస్వామ్య పాలన కొనసాగుతోందన్నారు.  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధికి వాడాల్సిన డబ్బును ఎమ్మెల్యేలను కొనడానికి వాడుతున్నారని దుయ్యబట్టారు.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అఖిల పక్ష సమావేశానికి టీజెఎస్ అధ్యక్షుడు కోదండారం, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తదితరులు హాజరయ్యారు. 

మరింత +
Two Passenger arrested at RGIA for smuggling gold biscuits

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లర్స్ అరెస్ట్

హైదరాబాద్‌లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని, ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై రెండు గోల్డ్ స్మగ్లింగ్ కేసులను నమోదు చేశారు. ప్రయాణికుల దగ్గర నుండి నాలుగు గోల్డ్ బార్లు, రెండు బంగారు కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మరింత +
Telangana Congress Senior Leader Komatireddy Venkat Reddy files nominations for Bhuvanagiri Lok Sabha seat

భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నామినేషన్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు జూబ్లీహిల్స్ ఫిలింనగర్ లోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

మరింత +
Telangana Congress Leaders to meet Governor tomorrow over KCR's Operation Aakarsh

రేపు గవర్నర్‌ నరసింహన్‌తో టీకాంగ్రెస్ లీడర్ల భేటీ

రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ ఉంది. రేపు గవర్నర్‌ నరసింహన్‌తో టీ-కాంగ్రెస్ లీడర్లు భేటీ కానున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఆయన్ను కలువనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన లీడర్లు ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకుంటున్నారు. ఒకపార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తుల్ని మరో పార్టీలో చేర్చుకోవడంపై టీ-కాంగ్రెస్ లీడర్లు గుర్రుగా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అధికార టీఆర్ఎస్ అపహాస్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ ఫిరాయింపుదారులపై, ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ నరసింహన్‌‌కు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.

మరింత +
Group 2 qualified candidates protest in front of HRC,  urge for mercy killing,  to delay in Posting

గ్రూప్-2 క్వాలిఫైడ్ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్ గ్రూప్-2 నియామక ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హెచ్‌ఆర్‌సీని కోరారు. సీఎం చొరవ చూపినా అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. తమ బాధను సీఎంకు చేరకుండా TSPSC నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

మరింత +
33 Candidates contesting for 3 MLC seats in Telangana

తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు 33మంది పోటీ

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలో మూడు, ఏపీలోని మూడు ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.  

మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఈ రెండు ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. మూడు స్థానాలకు 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం మూడు నియోజకవర్గాల్లో కలిపి 814 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.  

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం 5,62,186 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మూడు చోట్ల కలిపి 94 మంది పోటీ పడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 817 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి బరిలో 46 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక గుంటూరు-కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గానికి 40 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

మరింత +
Komatireddy Brothers fire on KCR and Modi over Operation Aakarsh

కేసీఆర్, మోడీని కడిగిపారేసిన కోమటిరెడ్డి బ్రదర్స్

గులాబీ బాస్ తీరును కడిగిపారేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టైనా కట్టారా అంటూ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు నల్గొండ ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు. 16 ఎంపీ స్థానాలు రాకుంటే కేసీఆర్ ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు. భువనగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.  

ఇటు కేసీఆర్ కు ఓటు వేస్తే మోడీకి వేసినట్లేనని అన్నారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవి కేసీఆర్ కు కాంగ్రెస్ కు జరుగుతున్న ఎన్నికలు కావని ఆయన తెలిపారు. మోడీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలిచ్చారనీ అవన్నీ నీటిమూటలయ్యాయని వెంకట్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం ధనవంతుల కోసమే మోడీ ప్రభుత్వం పని చేస్తుందని వెంకట్ రెడ్డి అన్నారు. భువనగిరికి నిమ్స్ తెచ్చింది తామేననీ ఇంతవరకు నిమ్స్ ను కూడా పూర్తి చేయలేదని అన్నారు. రాబోయే రోజుల్లో భువనగిరికి ఐటీ కంపెనీ తెస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.

మరింత +
Secunderabad Congress MP candidate Anjan Kumar Yadav meets TJS Chief Kodandaram over Elections

కోదండరాం మద్దతు కోరిన అంజన్ కుమార్ యాదవ్

సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాంను కలిసారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసమితి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని కోదండరామ్ ముందుండి నడిపించారని అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. తెలంగాణ అమర వీరుల శాపం కేటీఆర్, కేసీఆర్ీల నాశనానికి దారితీస్తుందని మండిపడ్డారు. అయితే అంజన్ కుమార్ యాదవ్‌కు మద్దతిచ్చే విషయాన్ని సాయత్రం లోపు చర్చంచి తెలుపుతామని కోదండరామ్ అన్నారు.

మరింత +
AICC puts Khammam MP Seat in pending from Telangana, 16 seats announced

తెలంగాణలో 16 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు

తెలంగాణలో పోటీ చేసే లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. మొత్తం 8 లోకసభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఖమ్మం నియోజక వర్గాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచింది.  

తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల రెండు జాబితా విడుదలైంది. ఇప్పటికే మొదటి జాబితాలో 8 మంది అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్టానం రెండో లిస్ట్‌లో 8 మందికి చోటు కల్పించింది. అయితే ఒక్క ఖమ్మం నియోజకవర్గాన్ని మాత్రం కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్‌కు 16 స్థానాలు ఖరారయ్యాయి.  

ఇక రెండో జాబితాలో భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్, నిజామాబాద్ నుంచి మధుయాష్కీ గౌడ్, వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యకు స్థానం దక్కింది.  

తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో ఆలస్యం చేసిన కాంగ్రెస్ అధిష్టానం .. ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం కాస్త వేగంగానే అడుగులు వేసింది. సోనియా గాంధీ నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలతో పాటు తెలంగాణలో మిగిలిన 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. రాత్రికి ఫైనల్‌గా ఏపీతో పాటు తెలంగాణ లిస్ట్ ను విడుదల చేశారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాలో ఖమ్మం నియోజకవర్గంపై మాత్రం క్లారిటీ రాలేదు.

మరింత +
Congress Senior Leader Shabbir Ali fire on KCR over offering price for Cong MLAs into TRS

ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25కోట్లు,పదవి ఇస్తున్న కేసీఆర్!

టీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల ప్రకటన, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ పదవులు ఇచ్చి కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు దమ్ముంటే ఖమ్మం నుంచి పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.

మరింత +
Former Congress Minister Komatireddy Venkat Reddy to contest from Bhuvanagiri Lok Sabha seat

భువనగిరి లోక్ సభ బరిలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరుపున మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. భువనగిరిలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ తరుపున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయితేనే విజయం సాధిస్తారనే నివేదికలు అధిష్టానానికి అందడంతో ఆయన పేరుపు ఏఐసీసీ పెద్దలు ఓకే చేశారు. ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రకటించనున్నారు.  
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతూనే ఉంది. తొలిసారి 2009 ఎన్నికల్లో భువనగిరి లోక్ సభ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి భారీ విజయం సాధించగా నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. నాలుగు సార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం మినిస్టర్‌గా పనిచేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. బునాది కాల్వ, ఉదయ సముద్రం, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టులను జిల్లాకు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు.   

ఇటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ సింహంలా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం వెంకట్ రెడ్డి తృణప్రాయంగా వదులుకున్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్గొండలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. 1999 నుంచి వరుసగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా కోమటిరెడ్డి గెలుస్తూ వచ్చారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో మంచి అనుబంధం, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు.  

ఎదిగిన కుమారుడు ప్రమాదంలో మరణించడం వెంకట్ రెడ్డికి జీవితంలో మరిచిపోలేని బాధను విగిల్చింది. అలాంటి బాధను మరెవరూ అనుభవించరాదని ఆ తర్వాత కాలంలో ఆయన కుమారుడు ప్రతీక్ పేరుతో ఫౌండేషన్ స్థాపించారు. 2012 ప్రతీక్‌ రెడ్డి మరణానంతరం కోమటి రెడ్డి ప్రతీక్‌ మెమోరియల్‌ ప్రభుత్వ జూనియర్‌ బాలుర కళాశాలగా మార్చారు. 3.5 కోట్లను వెచ్చించి బాలికల వొకేష్‌నల్‌ జూనియర్‌ కళాశాలను పుననర్నిర్మాన పనులు చేపట్టారు. ఫౌండేషన్ తరఫున ప్రతిఏటా టాపర్స్‌కు బంగారు పతకాలు, నగదు ప్రోత్సాహకాలు, జాబ్‌ మేళాలు, నిరుద్యోగులకు ఉపాది కల్పన, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య, రక్తదాన సేవలనందించటం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపడుతున్నారు.

మరింత +
SSC Exam in Telangana from Mar 16

ఈనె 16 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు

పదో తరగతి పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. దాని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమిషం నిబంధన లేకున్నా విద్యార్థులు పరీక్ష సమయం కంటే ముందే సెంటర్ కు చేరుకోవాలని అధికారులు చెబుతున్నారు. పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ కు పాల్పడ్డా చర్యలు తప్పవని అంటున్నారు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్.

మరింత +
Former Minister Sabitha Indra Reddy gets Promise from KCR for Chevella MP seat  her Son Karthik

కారెక్కిన సబిత కొడుకు కార్తిక్‌కే చెవేళ్ల ఎంపీ స్థానం

కాంగ్రెస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కారెక్కేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు అనుగుణంగా బుధవారం టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ను తన కుమారుడితో కలిసి సబితాఇంద్రారెడ్డి. అనంతరం జరిగిన సుదీర్ఘంగా భేటీ అయ్యారు. చేవెళ్ల ఎంపీ స్థానాన్ని కుమారుడు కార్తీక్‌ రెడ్డికి కేటాయించడంతో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎంను కోరినట్టు తెలుస్తోంది. చేవెళ్ల ఎంపీ స్థానం ఇచ్చేందుకు కేసీఆర్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం త్వరలో చేవెళ్లలో జరిగే టీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభలో కారెక్కనున్నట్టు సబితా ఇంద్రారెడ్డి కుటుంబం తెలిపింది. సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగానే కలిశామని కార్తీక్‌రెడ్డి చెప్పారు. తాము అడగాల్సినవి అడిగామని సీఎం చెప్పాల్సినవి చెప్పారని తెలిపారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో తెరాసలో చేరతామని కార్తీక్ రెడ్డి వెల్లడించారు.

మరింత +
TRS won 4 MLCs and MIM 1, Congress, BJP walked out

ఫలితాలు: టీఆర్ఎస్ 4, ఎంఐఎం 1 ఎమ్మెల్సీల గెలుపు

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికల్లో తెరాస నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఒకరు గెలుపొందారు. ఓటింగ్‌కు కాంగ్రెస్‌ సహా విపక్షాలు దూరంగా ఉండటంతో ఐదుగురు అభ్యర్థుల ఎన్నిక లాంఛనమైంది. ఐదు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలవగా వీరిలో టీఆర్ఎస్ నుంచి శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహమూద్‌ అలీ, ఎగ్గె మల్లేశం గెలుపొందగా మజ్లిస్‌ నుంచి మీర్జా రియాజ్‌ హసన్‌ విజయం సాధించారు. ఎన్నికల పోలింగ్‌లో టీఆర్ఎస్ కు చెందిన 91 మంది, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పార్టీ ఫిరాయింపులకు నిరసనగా కాంగ్రెస్ ఈ ఎన్నికలను బైకాట్ చేయగా బీజేపీ కూడా దూరంగా ఉంది. ఈ ఎన్నికలకు శశాంక్‌ గోయల్‌ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరించారు. టీఆర్ఎస్ ముందస్తుగా అనుకున్నట్లుగానే ఫలితం రావడంతో ఆ పార్టీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు.

మరింత +