జాతీయ వార్తలు

EC instructs AP govt to transfer officers posted at one place for last 3 years

బదిలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు

సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం, ఒడిసా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అధికారుల బదిలీ, పోస్టింగులపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం ఒకే దగ్గర పనిచేస్తున్న వారు, సొంత జిల్లాల్లో పని చేస్తున్న వారిని బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ కార్యదర్శి లేఖ రాశారు. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు, గత నాలుగేళ్ల కాలంలో మూడేళ్లు ఒకే దగ్గర పని చేస్తున్న వారు, 2019 మే 31 వరకు మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్నవారు బదిలీలకు అర్హులని స్పష్టం చేశారు. అంతేకాకుండా, బదిలీ చేసిన తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో లేదా 2017 మే 31కు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన చోట పోస్టింగ్‌ ఇవ్వవద్దని సూచించారు.  

ఎన్నికల విధులు నిర్వర్తించే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌, సహాయక రిటర్నింగ్‌ అధికారులతో పాటు కలెక్టర్‌, డిప్యూటీ కలెక్టర్‌, సంయుక్త కలెక్టర్‌, తహసీల్దార్‌, మండల అభివృద్ధి అధికారులకు తమ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. ఎన్నికలకు భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే పోలీసు బలగాల్లో రేంజ్‌ ఐజీ, డీఐజీలు, ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లకూ ఇవి వర్తిస్తాయన్నారు. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని, ఫిబ్రవరి 28లోపు బదిలీలు పూర్తి చేసి మార్చి తొలి వారంలోగా వివరాలివ్వాలన్నారు.

మరింత +
Special director Rakesh Asthana moved out of CBI

రాకేశ్ అస్థానాపై బదిలీ వేటు

సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై బదిలీ వేటు పడింది. సీబీఐ నుంచి తప్పించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయన్ని బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, సీబీఐ చీఫ్ పదవి నుంచి అలోక్ వర్మను తప్పించి ఫైర్ సర్వీసెస్ డీజీగా ఇటీవల బదిలీ చేశారు. మనస్తాపం చెందిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అలోక్ వర్మ రాజీనామా చేసిన నాలుగు రోజులకే, సీబీఐలో నెంబర్ 2గా కొనసాగిన అస్థానాను ఆ పదవి నుంచి తప్పించడం గమనార్హం.

మరింత +
Jammu Kashmir Students federation meet governor to Ban PUBG Game due to youth and students over addiction

పబ్‌జీ గేమ్‌ బ్యాన్ చేయండి.. లేదంటే విద్యార్థులు ఫెయిల్!

పబ్‌జీ గేమ్‌కు యువత, విద్యార్థులు పూర్తిగా బానిసలుగా మారారు అనడానికి ఈ సంఘటనే ఓ నిదర్శనం. రోజూ గంటల తరబడి గేమ్ ఆడుతూనే గడిపేస్తున్నారట జమ్ముకశ్మీర్ విద్యార్థులు. దీంతో చదువులు అటకెక్కుతున్నాయి. దీని కారణంగా ఈ మధ్య విడుదలైన పది, పన్నెండో తరగతి పరీక్షల ఫలితాల్లో చాలా దారుణంగా ఉన్నాయని వాపోయారు. వెంటనే ఈ గేమ్‌పై నిషేధం విధించాలని జమ్ముకశ్మీర్ విద్యార్థుల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ నాయక్‌ను కలిసి పబ్‌జీ గేమ్‌‌ని నిషేధించాల్సిందిగా కొందరు విద్యార్థులు కోరారు. విద్యార్థులు ఈ గేమ్‌కు బానిసలవుతున్నారని వారు అభిప్రాయపడ్డారు.

మరింత +
Public goes mad for Cake Loot, Dancers At Events To Celebrate Mayawati's Birthday

మాయావతి బర్త్ డే వేడుకలో క్షణాల్లో కేక్ మాయం

ఉత్తర్ ప్రదేశ్ లో వింత చోటు చేసుకుంది. యూపీ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి 63వ పుట్టిన రోజు వేడుకలు రభస జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకు 420 కిమీల దూరంలో వున్న అమ్రోహాలో భారీ ఏర్పాట్లు చేశారు బీఎస్‌పీ కార్యకర్తలు. అందుకు తగ్గట్టుగానే భారీ కేక్ ఆర్డర్ చేశారు. ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్టలు రాగానే కేక్ కట్ చేసేందుకు అంతా రెడీగా వున్నారు. ఇంతలోనే కేకును చూడగానే కార్యకర్తలకు నోరు ఊరినట్టుంది. అమాంతంగా కేకుపై దాడి చేశారు. చాకు అవసరం లేకుండానే ఎవరికి అందినంత వారు లాగేసుకుని తినేసారు. చివరికి, ఒకరిపై ఒకరు కలబడుతూ క్షణాల్లో ఆ కేకును మాయం చేశారు. అదే వేదికపై ఉన్న పెద్దలు మైకుల్లో మొత్తుకుంటున్నా పట్టించుకోలేదు. ఎవరికి వారు చేతులతో కేకును లాక్కోవడంతో చితికిపోయి నుజ్జు నుజ్జుగా అయిపోయినా వదల్లేదు. క్షణాల్లోనే కేక్‌ను ఖాళీ చేశారు. ఆ తరువాత బర్త్ డే వేడుకలు జరగకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో నెట్ లో వైరల్‌గా మారింది.

మరింత +
MP CM Kamal Nath launches Rs 50,000 crore farm loan waiver scheme

మధ్యప్రదేశ్‌లో భారీ రైతు రుణ విముక్తి పథకం

రైతుల పంట రుణాల మాఫీ కోసం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భారీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘జై కిసాన్‌ రుణ్‌ ముక్తి యోజన’ పేరుతో రూ.50 వేల కోట్ల పంట రుణాల్ని మాఫీ చేయనున్నారు. ఈ పథకం వల్ల సుమారు 55 లక్షల మంది చిన్న మధ్య తరహా రైతులకు మేలు కలుగుతుందని ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. రుణ విముక్తి పథకాన్ని ఓ మైలు రాయిగా ఆయన పేర్కొన్నారు. ఎలాంటి బడ్జెట్‌ పరిమితులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రుణమాఫీ సాధ్యం కాదన్న ప్రతిపక్షాలపై కమల్ నాథ్ మండిపడ్డారు. 
మధ్యప్రదేశ్‌‌‌లో ఆర్థిక వ్యవస్థ ప్రాధానంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉంటుంది. దాదాపు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం కొనసాగిస్తుంటారు. అన్నదాతలను బలోపేతం చేయకుండా ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయలేమని కమల్‌నాథ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక స్థితి దృష్ట్యా... రుణమాఫీ ప్రకటన చేసే ముందే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేశామని కమల్ నాథ్ అన్నారు.

మరింత +
On fifth day of hike, petrol price hits Rs 70 per litre, diesel Rs 64 in Delhi

హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 74.40కి పెరిగింది

దేశంలో ఇంధన ధరలు భగ్గు మంటున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గిన దేశీయంగా ఇంధన ధరలు పెరగడం గమనార్హం. ఈ నెలలో ఇప్పటి దాకా ఆరు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర 38 పైసలు, లీటరు డీజిల్ ధర 49 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర 70 రూపాయాలకు చేరితే.. డీజిల్ ధర 64 రూపాయలకు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోలు ధర 75 రూపాయల 77 పైసలు ఉండగా డీజిల్ ధర 67 రూపాయలుగా ఉంది. ఇక హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర 74 రూపాయల 40పైసలు ఉండగా డీజిల్ ధర 69రూపాయల 77పైసల వద్ద కొనసాగుతోంది.

మరింత +
Mohan Bhagwat Threatened to Scrap Caste Quotas, Modi Has Started Doing It: Tejashwi Yadav After Meeting Maya

ఎస్పీ-బీఎస్‌పీ కూటమిని సమర్ధించిన ఆర్జేడీ నేత

ఉత్తర్‌ప్రదేశ్‌ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని రాష్ట్రీయ జనతా దళ్‌ నేత తేజస్వీ యాదవ్‌ అన్నారు. బీజేపీని ఓడించేందుకు ఎస్సీ, బీఎస్పీ లు కలిసి పోటి చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మాయావతి, అఖిలేష్‌ ని కలిసి తేజస్వీ యాదవ్ అభినందనలు తెలిపారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు ను కూడా గెలుచుకోలేదని మాయావతి, అఖిలేష్ కూటమిని ప్రజలు స్వాగతిస్తారని ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో ఇదే తరహా కూటమిని ఏర్పడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తేజస్వీ యాదవ్.

మరింత +
Happy Lohri 2019: Lohri As The Harvest Festival Of India

ఉత్తరాదిన ఘనంగా లోహ్రీ సంబరాలు

ఉత్తరాదిన లోహ్రీ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చిన్నా పెద్దా భోగిమంటల దగ్గర సందడి చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ సిమ్లాలోని తన అధికారిక నివాసంలో జరిగిన లోహ్రీ సంబరాల్లో పాల్గొన్నారు. భోగిమంటల చుట్టూ అందరితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. 
ఇటు ప్రయాగ్ రాజ్ భక్తులతో కిటకిటలాడుతోంది. సాధువులు, భక్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో సందడిగా మారింది. భోగి పండుగను పురస్కరించుకుని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మకరసంక్రాంతి సందర్భంగా రేపటి నుండి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశ, విదేశల నుంచి భక్తులు కుంభమేళాకు చేరుకున్నారు. కుంభమేళా కోసం యోగి సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది.

మరింత +
How an SP-BSP alliance can impact the BJP arithmetic in Uttar Pradesh?

బీజేపీకి చెక్: దోస్తీ కడుతున్న అఖిలేష్, మాయావతి!

ఎన్నికల వేళ సరికొత్త కూటములకు తెరలేస్తోంది. ఉత్తరప్రదేశ్ లో తిరిగి పట్టు సాధించేందుకు శతృత్వాన్ని వీడి.. ఎస్పీ, బీఎస్పీలు మిత్రపక్షాలుగా మారుతున్నాయి.రెండు పార్టీల కూటమిపై ఇవాళ అధికారికంగా ప్రకటన వెలువడనుంది. పొత్తుకు సంబంధించి అఖిలేష్ యాదవ్,మాయావతి సంయుక్తంగా కీలక ప్రకటన చేయనున్నారు. గత కొన్ని రోజులుగా అఖిలేష్, మాయావతిలు వరుస సమావేశాలను నిర్వహించారు. ఇరు పార్టీలకు సంబంధించి సీట్ల పంపకాలు కూడా ఖరారైనట్టు తెలుస్తోంది. కూటమిలోకి రాష్ట్రీయ లోక్ దళ్, నిషద్ పార్టీలాంటి చిన్న పార్టీలను కూడా కలుపుకుని పోవాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కాగా.. యూపీలో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సూచనప్రాయంగా తెలిపింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో 80 లోక్ సభ స్థానాలకు గాను 73 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఎస్పీ 5 స్థానాలలో గెలుపొందింది. మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్ నుంచి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు గెలుపొందారు.

మరింత +
India's second moon mission Chandrayaan-2 to be launched in mid April Says ISRO chairman K Sivan

ఏప్రిల్‌లో చంద్రయాన్-2 మిషన్

చంద్రయాన్-2 మిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో చేపట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ కే.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని జనవరి లేదా ఫిబ్రవరిలో ఉంటుందని గతంలో ఇస్రో వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును మరో నెల రోజులు పొడగించినట్లు తెలుస్తోంది. చంద్రయాన్-2 కోసం సుమారు 800 కోట్లు ఖర్చు చేయనున్నారు. చంద్రయాన్-1 మిషన్‌కు అడ్వాన్స్‌డ్ వర్షెన్‌గా చంద్రయాన్-2ను డిజైన్ చేశారు. మార్చి నుంచి ఏప్రిల్ మధ్య వరకు ఎప్పుడైనా చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టవచ్చని శివన్ తెలిపారు.

మరింత +
DMK rules out an alliance with BJP, says PM Modi is not Vajpayee

బీజేపీతో పొత్తుకు డీఎంకే దూరం

రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ స్పష్టంచేశారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తుకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటుందన్న మోడీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. వాజ్‌పేయీ లాంటి నిర్ణయాత్మక రాజకీయాలు మోదీ చెయ్యలేరని అభిప్రాయపడ్డారు. మోడీ తనను తాను వాజ్‌పేయితో పోల్చుకోవడం హాస్యస్పాదమని విమర్శించారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రాంతీయ పార్టీలకు కలుపుకుని పోయారని కానీ, ఇప్పుడు బీజేపీలో అలాంటి నాయకత్వం లేదని స్టాలిన్‌ ఆరోపించారు.

మరింత +
Ahead of 2019 general elections, Modi has grand plans for Indian middle Class

త్వరలో మధ్యతరగతికి మోడీ మరిన్ని వరాలు

కీలక నిర్ణయాలు ఊహకందని మార్పులు గత పాలకులు చేయలేని సాహసాలు వెరసి, సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ దూకుడు పెంచారు. ఇందులో భాగంగా అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకోవడమే కాకుండా వెంటనే కోటాపై బిల్లును పాస్ చేయించుకోని విపక్షాలకు సవాల్ విసిరారు మోడీ. అయితే ఇదొక్కటే కాదు పేదలు, మధ్యతరగతి వర్గాలే లక్ష్యంగా మోడీ త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఐటీ నుంచి జీఎస్టీ వరకు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది.     

దేశప్రజలందరిని ఆకర్షించేలా త్వరలో మరిన్నీ కీలక నిర్ణయాలు మోడీ తీసుకోనున్నారని బీజేపీ నేతలు హింట్ ఇస్తున్నారు. రైతుల వైపు నుంచి ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో వారినీ కూడా ప్రసన్నం చేసుకునేందుకు.. సరికొత్త పథకాన్ని రూపొందిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతుబంధు తరహా పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేయడంతో పాటు కౌలు రైతులకు కూడా ప్రయోజం కలిగించేలా పథకాన్ని రూపొందిస్తున్నారట మోడీ. ఫసల్ బీమాలో రైతులు కట్టే ప్రీమియంను 90శాతం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలే చెల్లించేలా పథకంలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది.     

మరో వైపు జీఎస్టీలో కూడా కీలక మార్పులు చేయాలని మోడీ భావిస్తున్నారు. 28 శాతం పన్ను కింద మూడు నాలుగు రకాల వస్తువులు మాత్రమే ఉంచి మిగతా వస్తువులన్నింటిని 18శాతం శ్లాబులోకి మార్చేందుకు కసరత్తు చేస్తున్నారు . దాంతో పాటు 12, 18 శాతం శ్లాబులను కలిపే ఒకే శ్లాబుగా చేయాలనే ప్రతిపాదన ఉంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో ఇప్పుడు ఆదాయపన్ను పరిమితిని రెండున్నర లక్షలనుంచి 5 లక్షలకు పెంచడంతో పాటు 20శాతం, 30శాతం పన్ను కట్టాల్సిన ఆదాయ పరిమితిని భారీగా పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.     

ఇక కనీస ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉన్న వారికి ఆర్థికంగా ఎంతో కొంత సాయం అందించడం వంటి కీలక నిర్ణయాలు ఎన్నికల ముందు తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. వీటితో పాటే లోక్ సభలో ఆమోదం పొందిన ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో కూడా గట్టెక్కించడంపై మోడీ ఫోకస్ చేశారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజాకర్షక నిర్ణయాలకు మార్పులు చేర్పులకు రెడీ అవుతున్నారు ప్రధాని మోడీ.

మరింత +
AICC President Rahul Gandhi gets NWC notice over commenting on Defence Minister Nirmala Seetharaman

రాహుల్ గాంధీకి నోటీసులు

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు పంపింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌పై రాహుల్‌ ‘మోసపూరితమైన, అనైతిక’ వ్యాఖ్యలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు నోటీసులు జారీ చేసింది. పార్లమెంటులో రాఫేల్‌ ఒప్పందంపై సీతారామన్‌ చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తనను కాపాడుకోవడానికి ఓ మహిళ దొరికారు అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఆయన మాటలపై మహిళా కమిషన్‌ అభ్యంతరం వ్యక్తంచేసింది.

మరింత +
5-Judge Constitution Bench Of Supreme Court To Hear Ayodhya Case Today

అయోధ్య అంశంపై నేడు వాదనలు

రామ జన్మభూమి అయోధ్య, బాబ్రీ మసీదు వివాదం అంశంపై సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లను విచారించేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వం వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్‌ SA బాబ్డే, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ యు.యు. లలిత్, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సభ్యులుగా ఉన్నారు.  

అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలో ఉన్న 2.77 ఎకరాల భూమిని ఈ కేసులో కక్షిదారులుగా ఉన్న సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖారా, రామ్‌ లల్లా సంస్థలు సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అయోధ్య వివాదం విషయంలో వాదనలు వినేందుకు జనవరిలో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గత అక్టోబర్‌ 29న వెల్లడించింది. అయితే, అయోధ్య కేసులో అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారి వాదనలను తోసిపుచ్చింది.  

తాజాగా ఏర్పాటైన ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి మినహా మిగిలిన నలుగురూ భవిష్యత్తులో సీజేఐ అయ్యే అవకాశం ఉన్న వారే కావడం గమనార్హం. అయోధ్యలో రామమందిరం నిర్మించేందుకు వీలుగా ఆర్డినెన్స్‌ తేవాలంటూ పలు హిందూత్వ సంస్థలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. అయితే, సుప్రీంకోర్టులో న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాతే.. మందిర నిర్మాణంపై ఆర్డినెన్స్‌ తెచ్చే విషయంలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరింత +
PM Narendra Modi express happiness for EBC bill pass in the Parliament

పార్లమెంట్‌లో ఈబీసీ బిల్ పాస్‌పై ప్రధాని స్పందన

124వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించడం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ ట్విట్టర్‌లో ట్విట్ చేశారు. బిల్లుకు ఇంత విస్తృత మద్దతు లభించడం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. సభలో బిల్లుపై ఉత్సాహభరిత చర్చ జరిగిందన్నారు. బిల్లును ఆమోదించడం ద్వారా మన రాజ్యాంగ రూపకర్తలకు స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళులర్పించిన వారమౌతామన్నారు. సామాజిక న్యాయానికి ఇదో గొప్ప విజయమన్నారు ప్రధాని మోడీ.

మరింత +