అంతర్జాతీయం వార్తలు

Almost 100 dead as Iraq ferry sinks on spring holiday trip

టైగ్రిస్ నదిలో పడవ మునిగి 92 మంది మృతి

ఇరాక్ లో కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మోసుల్ నగరం వద్ద టైగ్రిస్ నదిలో ఓ పడవ మునిగిపోవడంతో 92 మంది మృతి చెందారు. మరో 32 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, పిల్లలు ఉన్నారు. సహాయక చర్యల్లో భాగంగా స్థానికులు, పోలీసులు 55 మందిని కాపాడారు. కుర్ధ్ ప్రజలు తమ కొత్త సంవత్సరం 'నౌరుజ్' వేడుకలు జరుపుకోవడానికి పడవలోకి పరిమితికి మించి ఎక్కారు. అయితే పడవ మోసుల్ నగరం వద్దకు రాగానే నీట మునగడం ప్రారంభించింది. పడవ మునుగుతున్న సంగతి గమనించిన పలువురు ఇతరులను కాపాడేందుకు నదిలోకి దూకారు. అయితే కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురస్తుండటంతో టైగ్రిస్ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాటు మోసుల్ డ్యామ్ నుంచి దిగువకు భారీగా నీరు విడుదల చేశారు. దీంతో చాలామంది వరద నీటీలో కొట్టుకు పోయారు. సమీపంలో బోట్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రజలను కాపాడడం కష్టమైపోయింది. అందుబాటులో ఉన్న బోట్లతోనే కొందరిని కాపాడే లోగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.

మరింత +
Nirav Modi Arrested In London, To Be Produced In Court Shortly

లండన్‌లో నీరవ్ మోడీ అరెస్ట్

బ్యాంకులకు పెద్ద మొత్తంలో రుణాలు ఎగ్గొట్టి యూకేకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని లండన్ లో అరెస్ట్ చేశారు. భారత్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండో రోజుల్లోనే నీరవ్ మోడీ అరెస్ట్ అయ్యారు. 17నెలల క్రితం నీరవ్ మోడీ భారత్ ను విడిచి యూకేకు పారిపోయారు. అయితే గత ఏడాదే నీరవ్ ను అప్పగించాలని బ్రటిన్ ను భారత్ కోరింది. వెస్ట్ మినిస్టర్ కోర్టు ఆదేశాలతో నీరవ్ మోడీని అరెస్ట్ చేశారు. కాసేపట్లో ఆయన్ని లండన్ కోర్టులో హాజరుపర్చనున్నారు.

మరింత +
Cyclone Idai: Fears for 500,000 people as 90% of Mozambique city destroyed, aid officials say

ఇదాయ్ సైక్లోన్‌తో మొజాంబికా సిటీ అతలాకుతలం

ఆఫ్రికా దేశాలైన మొజాంబిక్‌, జింబాంబ్వే, మలావిలను ఇదాయ్ సైక్లోన్ అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని మరణించిన వారి సంఖ్య ఈ మూడు దేశాల్లో 215 కు చేరింది. మొజాంబిక్‌లో ఇప్పటి వరకు 84 మంది మ‌ృతి చెందారని మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసి తెలిపారు. జింబాబ్వేలో 89, మాలవిలో 42 మంది మృతిచెందినట్టు అధికారులు ధృవీకరించారు. ఇంకా వరదల్లో వందాలాది గల్లంతైయ్యారు. వరద ప్రభావానికి మూడు దేశాల్లో కలిపి దాదాపు 1.3 మిలియన్ల నిరాశ్రయులయ్యారు. దీంతో ఆర్మీతో పాటు రెడ్‌క్రాస్‌, ఇతర స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యల్లో ముమ్మరంగ పాల్గొంటున్నాయి. ఇదాయ్ కారణంగా 53 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్య సమతి వెల్లడించింది. మూడు దేశాలను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

మరింత +
21 soldiers killed in terrorist attack on army camp in Mali

ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి:21 మంది సైనికులు మృతి

ఉగ్రవాదులు మాలిలో మరోసారి రెచ్చిపోయారు. మధ్య మాలిలోని ఓ సైనిక స్థావరంపై కొంత మంది ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. బైకులు, కార్లలో వచ్చిన దుండగులు దియౌరాలోని ఆర్మీ క్యాంపుపై ఒక్కసారిగా కాల్పులకు దిగారని స్థానిక అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ దాడిలో 21 మంది సైనికులు చనిపోయినట్లు అక్కడి సైనిక వర్గాలు ప్రకటించాయి. ఓ మాజీ సైనికాధికారి నేతృత్వంలో ఏర్పడిన ఉగ్రవాద ముఠానే దాడికి తెగబడినట్లు అక్కడి అధికారులు అనుమానిస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశప్రజలంతా ఏకమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకార్‌ కీట పిలుపునిచ్చారు.  

గత కొన్ని సంవత్సరాలుగా మాలిలో ఐసిస్‌ ఉగ్రవాదుల ప్రాబల్యం పెరుగుతూ వస్తోంది. 2012లో వీరు ఉత్తర ప్రాంతంలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ 2013లో ఫ్రెంచ్‌ బలగాలు వారిని తరిమికొట్టాయి. అనంతరం ఐరాస అక్కడ శాంతి పరిరక్షక దళాల్ని మొహరించింది. భారీ సంఖ్యలో ఫ్రెంచ్‌ భద్రతా బలగాలు సైతం ఇక్కడ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. 2015లో మాలి ప్రభుత్వానికి తీవ్రవాద ముఠాలకు మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదు.

మరింత +
Christchurch shooting: 40 dead in terrorist attack at two mosques

న్యూజిలాండ్ మసీదు కాల్పుల్లో 40మంది మృతి

న్యూజిలాండ్‌, క్రిస్ట్‌చర్చ్‌ ప్రాంతంలోని అల్‌నూర్ మజీదులో దుండగుల కాల్పులు కలకలం రేపాయి. కాల్పుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. హగ్లీపార్క్‌లో సమీపంలోని రెండు మజీదులపై ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనతో రెండు మజీదులు రక్తసిక్తమయ్యాయి. జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్ట్‌చర్చ్‌ సిటీలోని ప్రజలెవరు బయటకు రావద్దని సూచించారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతున్న బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు. ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. కాల్పుల సమయంలో బస్సులోనే ఉండటంతో ప్రమాదం తప్పిందని చెప్పారు.

మరింత +
More than 1,300 flights cancelled in US as 'bomb cyclone' unleashes snow, high winds

అమెరికాను వణికిస్తోన్న 'బాంబ్‌ తుపాను'

అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల కొలరాడో, నెబ్రస్కా, డకోటాలోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. స్కూళ్లు, వ్యాపారాలు మూతబడ్డాయి.  

ఇక కొన్ని చోట్ల హిమపాతంతో పాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకటిలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానుకు ‘బాంబ్‌ తుపాను’గా వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.  

రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని చోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్‌ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మరింత +
Who is Masood Azhar and why is China blocking India from banning him at the UN?

రేపు ఐరాసలో మసూద్‌పై తీర్మానం: చైనా కొర్రి

పుల్వామా ఉగ్రదాడి సూత్రదాడి, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్‌ను మరోసారి వెనుకోసుకొచ్చింది డ్రాగన్ కంట్రీ చైనా. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ప్రపంచదేశాలు ముక్త కంఠంతో బెబుతుండగా చైనా మాత్రం అందకు భిన్నంగా వ్యవహరిస్తుంది. అతడి పేరును ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో బ్లాక్‌లిస్టులో చేర్చాలని మెజార్టీ శాశ్వత సభ్యదేశాలు కోరుతుండగా చైనా మాత్రం తన వైఖరిని స్పష్టం చేయటంలేదు. భారత్, యూఎన్‌ సభ్య దేశాలు ఇప్పటికే ఈ అంశంపై మూడు సార్లు తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైనా అడ్డుకుంది. ఈ సమస్యను భారత్, పాకిస్తాన్‌లు చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని డ్రాగన్ పాతపాటే పాడింది. పుల్వామా ఉగ్రఘటనతో అజార్‌ను ఉగ్రవాదిగా గుర్తించేలా సభ్య దేశాలు రేపు ఐరాసలో కొత్తగా మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నాయి. అయితే ఈ తీర్మానానికి మరోసారి చైనా అడ్డుపడే అవకాశం ఉంది.

మరింత +
UN consultant with environment ministry among 4 Indians killed in Ethiopia plane crash

157 మంది విమాన ప్రమాద మ‌ృతుల్లో గుంటూరు యువతి

ఆఫ్రికా దేశం ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబీ బయల్దేరిన ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 ఈటీ 302 విమానం కుప్పకూలింది. అడిస్ అబాబాకు వాయవ్య దిశగా 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిషోఫ్టు పట్టణం దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘనలో 157 మంది మృతిచెందారు. మ‌ృతుల్లో నలుగురు భారతీయులు ఉండగా అందులో ఒకరు గుంటూరు వాసి మనీషాగా అధికారులు గుర్తించారు. గుంటూరు వైద్య కళాశాలలో MBBS పూర్తి చేసిన మనీషా నైబీరియాలో ఉంటున్న అక్కను చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

మరింత +
Finland's cabinet quits over failure to deliver healthcare reform

ఫిన్లాండ్ దేశ ప్రధాని సిపిలా రాజీనామా

ఫిన్లాండ్ దేశ ప్రధాని సిపిలా సంచలన నిర్ణయం తీసుకున్నారడు. తాను చేపట్టిన సంస్కరణలు అమలు చేయలేకపోవడాన్ని వ్యక్తిగత వైఫల్యంగా భావించి ప్రధాని పదికి రాజీనామ చేశారు. దీంతో ప్రభుత్వం కుడా రద్దయిపోయింది. సిపిలా కొంతకాలంగా సామాజిక ఆరోగ్య పథకాన్ని తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుండడంతో ప్రభుత్వంలో ఉన్న ఇతర పార్టీల సభ్యుల నుంచి ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయారు. గత దశాబ్దకాలంగా ఈ పథకం ప్రకటనలకే పరిమితమైంది. దాంతో ఎలాగైనా అమలులోకి తీసుకురావాలన్న సిపిలా ఆకాంక్షలకు మిత్రపక్షాలు అడ్డంకిగా మారాయి. అనేకసార్లు తాను రాజీనామా చేస్తానని బెదిరించినా ఫలితం లేకపోవడంతో ఎన్నికలు మరో 5 వారాల్లో ఉన్నాయనగా నిజంగానే రాజీనామా చేశారు .

మరింత +
India has become fastest growing large economy: M Venkaiah Naidu

పరాగ్వే పర్యటనలో భారత ఉపరాష్ట్రపతి

పరాగ్వేలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటన కొనసాగుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదేశ ప్రెసిడెంట్ మారిటో అబ్‌డో‌తో భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై భారత్ పోరాడుతున్న తీరును ప్రశంసించారు. పరాగ్వే కూడా టెర్రరిజంపై పోరాటం చేస్తుందని.. భారత్‌కు అండగా ఉంటుందని తెలిపారు. ఆ తరువాత ఆ దేశ ఉపాధ్యక్షుడు వెలాక్వెజ్ తోను వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం పరాగ్వేలోని భారతీయ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలోను పాల్గొన్నారు. భారత ఆయుధ శక్తి ఎంటో బాలాకోట్ ఘటనతో ప్రపంచానికి చాటి చెప్పిందని.. టెర్రరిజాన్ని అంతం చేయడమే తమ లక్ష్యమన్నారు. పాకిస్తాన్ ఆర్మీపై తాము దాడి చేయలేదని.. కేవలం టెర్రరిస్టులపై మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసిందన్నారు.

మరింత +
US Changes Pak Visa Policy, Journalists, Missionaries Affected: Report

పాకిస్థాన్ కు అమెరికా మరో షాక్

పాకిస్తాన్ కు అమెరికా వరుసగా షాక్‌లు ఇస్తోంది. మొన్న ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చిన అమెరికా తాజాగా వీసాల కాలపరిమితిని తగ్గించింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి కొత్త విధివిధానాలను వెల్లడించారు. వర్క్‌, మిషనరీస్‌కు సంబంధించిన వీసాల గడువును ఐదేళ్ల నుంచి ఏడాదికి కుదించింది. జర్నలిస్టుల వీసాల గడువును కూడా ఐదేళ్ల నుంచి మూడు నెలలకు తగ్గించింది. అదేవిధంగా పాక్‌ పౌరులకు వీసా దరఖాస్తు రుసుమును కూడా 160 డాలర్ల నుంచి 192 డాలర్లకు పెంచింది. అయితే, వర్తక, టూరిజం, స్టూడెంట్‌ వీసాల కాలపరిమితి మాత్రం ఐదేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇటీవల అమెరికా పౌరుల వీసాల విషయంలో పాక్‌ మార్పులు చేపట్టిన నేపథ్యంలో దానికి ప్రతిగా అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది.

మరింత +
Dentist Preethi Reddy found stuffed in suitcase, ex-boyfriend dies in crash

ఆస్ట్రేలియాలో ఎన్నారై ప్రీతిరెడ్డి దారుణ హత్య

గత ఆదివారం నుంచి ఆస్ట్రేలియాలో కనిపించకుండా పోయిన ఎన్నారై డెంటిస్ట్‌ ప్రీతిరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి మృతదేహన్ని ఆమె కారులోనే సూట్‌కేసులో వదిలి వెళ్లారు. అయితే ప్రీతిరెడ్డి మృతదేహం లభ్యమైన మరుసటి రోజే ఆమె మాజీ ప్రియుడు హర్ష్ నర్డే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆమె మర్డర్‌పై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చివరి సారిగా ప్రీతిరెడ్డి మెక్‌డోనాల్డ్‌కు వెళ్లినట్లు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా వెల్లడించారు. ఆ సమయంలో తనతో పాటు తన మాజీ ప్రియుడు హర్ష్ నర్డే కూడా ఉన్నట్లు గుర్తించారు.

మరింత +
Pakistan arrests 44 militants in new crackdown on extremist groups

ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గిన పాకిస్థాన్

ప్రపంచ దేశాల ఒత్తిళ్లకు పాకిస్తాన్ తలవంచింది. పుల్వామా ఘటనకు సంబంధించిన ఆధారాలను భారత్ పాకిస్తాన్ కు అందించడం మరోవైపు అగ్రరాజ్యాలన్నీ ఏకమై పాకిస్తాన్ పై సీరియస్ కావడంతో పాకిస్తాన్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అయిన మసూద్ అజహర్ తమ్ముడు రవూఫ్ ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. అతడితో పాటు జేషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 44 మందిని కూడా అరెస్ట్ చేసింది. వారందరినీ పాకిస్తాన్ లోనే అరెస్ట్ చేసినట్లు పాకిస్తాన్ హోంశాఖ ప్రకటించింది.  

మొదట్నుంచి కూడా ఉగ్రవాదుల తమ కార్యకలాపాల్ని పాక్ కేంద్రంగా నడిపిస్తున్నారని భారత్ చెబుతూ వస్తోంది. అయితే మొన్న పుల్వామా ఘటనతో భారత్ మరింత సీరియస్ అయింది. పాక్ పై వైమానిక దాడులు జరపడమే కాకుండా ప్రపంచ దేశాలతో పాక్ పై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలోనే భారత్ కు ప్రపంచ దేశాలు మద్దతు తెలపడమే కాకుండా పాక్ కు వార్నింగ్ ఇస్తూ వచ్చాయి. ఇరాన్ అయితే ఓ అడుగు ముందుకేసి ఉగ్రవాదులపై మీరు చర్యలు తీసుకుంటారా మిమ్మల్ని తీసుకొమ్మంటారా అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. అటు అమెరికా, బ్రిటన్, రష్యా కూడా పాక్ వైఖరిని తప్పుబట్టాయి. దీంతో పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకిగా మిగలాల్సి వచ్చింది. దీంతో పాక్ ఉగ్రవాదులపై చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

మరింత +
At least 23 dead in catastrophic tornado outbreak in Alabama, Georgia

అమెరికాలోని అలబామాలో టోర్నడో బీభత్సం

అమెరికాలోని అలబామా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను తీవ్రతతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. టోర్నడో ధాటికి ఇప్పటివరకు 23 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఆగ్నేయ అలబామాలో టోర్నడో ప్రభావం ఎక్కువగా ఉంది. ఇళ్లు కూలిపోవడంతో పలువురు గల్లంతయ్యారు. అత్యవసర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. చెట్లు కూలి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

మరింత +
Jaish-e-Mohammed Chief Masood Azhar Is

JeM చీఫ్‌ మసూద్‌ అజర్‌ బతికే ఉన్నాడు: పాక్

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ బతికే ఉన్నాడని పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. మసూద్‌ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. అయితే పాక్‌ ప్రభుత్వం నుంచి మసూద్‌ పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని, ఈ క్షణంలో ఏం జరిగిందనేది తనకు తెలియదని పాక్‌ సమాచార మంత్రి ఫవాద్‌ చౌధరి పేర్కొనడం గమనార్హం. కాగా, మసూద్‌ తీవ్ర అనారోగ్యంతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే అంశం మినహా తమకు ఎలాంటి సమాచారం లేదని భారత అధికారులు స్పష్టం చేశారు.

మరింత +