రీల్ న్యూస్

Rajinikanth, Kamal Hassan, Nirmala Sitharaman and others cast votes in Lok Sabha polls

ఓటు వేసిన తమిళ సెలబ్రిటీలు

నేడు రెండోదశ లోకసభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 95 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. అజిత్‌, అరుణ్‌ విజయ్‌, మ‌క్క‌ల్ నీది మ‌య్య‌మ్ పార్టీ అధ్యక్షుడు క‌మ‌ల్ హాస‌న్, శృతి హాస‌న్‌తో క‌లిసి ఆల్వార్ పేట కార్పోరేష‌న్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. తమిళనాడులోని 38 లోక్‌సభ సీట్లతోపాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రంలో లోక్‌సభ బరిలో 822 మంది అభ్యర్థులు ఉండగా, అసెంబ్లీలో ప్రవేశించేందుకు 269 మంది పోటీ పడుతున్నారు. సుమారు  6 కోట్ల మంది తమిళులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మరింత +
Tollywood Celebs casts vote at Jubileehills in Hyderabad

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రిటీలు

హైదరాబాద్ లో సినీ హీరోలు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరితో పాటే క్యూ లైన్లో నిలబడ్డారు. ఇటు సినీ నటుడు.. చిరంజీవి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, రామ్‌చరణ్‌, సురేఖ, ఉపాసనలు జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఓటు వేశారు.

మరింత +
Top Court Won't Stop PM Modi Biopic Release: 'Time Wasted On Non-Issues' says SC

ఏప్రిల్ 11న నరేంద్రమోడీ బయోపిక్ మూవీ రిలీజ్!

ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈనెల 11న ఈ మూవీ విడుదల కానుంది. అయితే ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని కాంగ్రెస్‌, విపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ చిత్రాన్ని ఇప్పుడు విడుదల చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందికి వస్తుందంటూ ఆరోపించాయి. నరేంద్ర మోడీ సినిమాను విడుదల చేయకుండా ఆపాలంటూ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. సెన్సార్‌ బోర్డు నుంచి సర్టిఫికేట్‌ రానందున విడుదలను వాయిదా వేయలేమని వెల్లడించింది. సినిమా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిందా? లేదా? అన్నది కేంద్ర ఎన్నికల కమిషన్‌ చూసుకుంటుందని కోర్టు తెలిపింది. ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోడీ పాత్రలో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డేతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 8న విచారణ చేపట్టి ఈరోజు తీర్పును వెలువరించింది. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది.

మరింత +
Actress Alia Bhatt posted Brahmastra Logo in the sky inauguration video shared

ఆకాశంలో బ్రహ్మాస్త్రా మూవీ లోగోపై ఆలియా భట్

సినిమా చరత్రలోనే తొలిసారిగా ఆకాశంలో బ్రహ్మాస్త్రా మూవీ లోగో ఆవిష్కరణ జరిగిన కార్యక్రమంపై ఆలియా మస్తు ఎంగ్జైటింగ్ గా ఉందని తెలిపింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప్ర‌యాగ కుంభ‌మేళాలో వినూత్నంగా లోగో విడుద‌ల చేసినప్పుడు ర‌ణ‌భీర్ కపూర్‌, అలియా భ‌ట్‌, ద‌ర్శ‌కుడు అయాన్ ముఖ‌ర్జీ ప్ర‌యాగ‌కు వెళ్లారు. హీరోయిన్ అలియా భ‌ట్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా లైవ్‌లో బ్రహ్మాస్త్రా లోగో విడుదల ప్రోగ్రాం వివ‌రాల‌ను తెలియ‌జేశారు. 150 డ్రోన్ కెమెరాల స‌హాయంతో బ్ర‌హ్మాస్త్ర లోగోను ఆకాశంలో ఆవిష్క‌రించడం జరిగిందని తనకు చాలా సంతోషం కలిగిందని తెలియజేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం బ్ర‌హ్మాస్త్రా తొలి భాగం క్రిస్మ‌స్ కానుక‌గా విడుదల కానుంది. శివ పాత్ర‌లో ర‌ణ్‌బీర్ న‌టిస్తుండ‌గా, ఇషా పాత్ర‌లో అలియా క‌నువిందు చేయ‌నుంది. రెండు భాగాలుగా విడుదలవుతున్న ఈ మూవీలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, నాగార్జున అక్కినేని, అలియా భ‌ట్‌, మౌనీ రాయ్ తదితరులు నటిస్తున్నారు.

మరింత +
AP High Court Judge to watch RGV's Laxmi's NTR Movie in his Chamber over Release issue

ఏపీ హైకోర్టు జడ్జి ఛాంబర్‌లో నేడు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ప్రదర్శన

ఆంధ్ర ప్రదేశ్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు హైకోర్టు స్టే విధించారు. దీనిపై ఈ చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి, దర్శకుడు రాంగోపాల్ వర్మలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి ఎదురుదెబ్బ తగిలింది. అయితే నేడు సాయంత్రం 4గంటలకు హైకోర్టు జడ్జి ఛాంబర్‌లో ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. సినిమాను చూసిన అనంతరం విడుదల చెయ్యాలా? వద్దా? అనే విషయంపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.

మరింత +
Lakshmi's NTR Movie Reviews: Ram Gopal Varma film gets slammed online

కొందరి ఒత్తిళ్లతోనే సినిమా ఏపీలో విడుదల కాలేదు

ఒకదేశంలో ఒక సినిమాను కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే విడుదల చేయనివ్వకపోవడమనేది... ఎవ్వరూ ఊహించి ఉండరని లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్‌వర్మ అన్నారు. సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు రాకేశ్‌ రెడ్డి వైసీపీ నాయకుడని తనకు తెలీయదని చెప్పారు. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన కథ అందరికీ తెలియాలని ఏ విధంగా జరిగిందనేది తెలియాలని మూవీ తీసానన్నారు. కొందరు చేస్తున్న ఒత్తిళ్ల వల్ల సినిమాను ఏపీలో విడుదల కానివ్వలేదని తెలిపారు. త్వరలో ఏపీలోనూ సినిమాను విడుదల చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నమన్నారు.

మరింత +
No change in Lakshmi's NTR release in Telangana

లక్ష్మీస్ ఎన్టీఆర్ తెలంగాణలో విడుదల

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు బ్రేక్‌ వేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు ఈ సినిమాను ప్రదర్శించరాదని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ, నిర్మాత రాకేష్‌రెడ్డి తదితరులను హైకోర్టు ఆదేశించింది. ఈ సినిమాను ఏప్రిల్‌ 3న తాము స్వయంగా వీక్షిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాకేష్‌రెడ్డికి సూచించింది. అయితే, తెలంగాణలో మాత్రం విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో ముందుగా ప్రకటించిన ప్రకారమే ఇవాళ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరింత +
Hero Vishal Injured in shooting

హీరో విశాల్‌కు షూటింగ్‌లో గాయాలు

ప్రముఖ హీరో విశాల్‌ తీవ్రంగా గాయపడ్డారు. సుందర్‌.సి దర్శకత్వంలో విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ప్రస్తుతం టర్కీలో షూటింగ్‌ జరుగుతోంది. షూటింగ్‌లో ఓ ఫైట్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా విశాల్‌ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న విశాల్‌ ఫోటో ప్రస్తుం వైరల్‌ అవుతోంది.

మరింత +
TDP seeks postponement of 'Lakshmi's NTR'

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను నిలిపివేయాలి

కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, రవీంద్ర కుమార్, జూపూడి ప్రభాకర్ కలిశారు. ఎటువంటి విచారణ జరపకుండా‌ ఏపీ ఇంటలిజెన్స్ ఛీప్ సహా.. ఇద్దరు ఎస్పీలను సీఈసీ బదిలీ చేయడాన్ని టీడీపీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల నిలిపివేయాలని ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు.‌

మరింత +
Hero Mahesh Babu Fans can see his Wax Figure at AMB Cinemas at Gachibowli today

హైదరాబాద్‌లో మహేశ్‌బాబు మైనపు బొమ్మ

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు మైనపు బొమ్మ హైదరాబాద్‌కు వచ్చేసింది. గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ఈ విగ్రహాన్ని ఒక రోజు ప్రదర్శనకు ఉంచనున్నారు. బ్లాక్‌ సూట్‌లో ఉన్న మహేశ్‌ మైనపు బొమ్మ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహేశ్‌ తన సతీమణి నమ్రత, పిల్లలు సితార, గౌతమ్‌ లతో కలిసి మైనపు బొమ్మ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. మహేశ్‌ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో రూపొందించారు. మహేశ్‌ అభిమానుల కోసం ఒక రోజు ప్రదర్శనకు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఒక రోజు తర్వాత మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలిస్తారు. మహేశ్ కు చెందిన ఏఎంబీ థియేటర్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో తరలివస్తున్నారు.

మరింత +
Victory Venkatesh’s daughter Aashritha ties the knot with Vinayak Reddy at Jaipur

పెళ్లి రాజస్థాన్‌లో... విందు హైదరాబాద్‌లో...

తెలుగు స్టార్ హీరో వెంకటేష్‌ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌ రాజధాని జయపురలోని ఓ హోటల్‌లో ఆశ్రిత - వినాయక్‌ రెడ్డిలు పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమించుకున్నా.. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది ఈ జంట. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహమాడి ఆ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. రెండు కుటుంబాల పెద్దలు, వ్యాపారస్తులు, స్టార్స్ వివాహ వేడుక, సంగీత్‌ కార్యక్రమంతొ సందడిగా సాగింది. ఈ పెళ్లికి బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌తో పాటు ఇతర పరిశ్రమలకి చెందిన పలువురు అతిథులతోపాటు రామ్‌చరణ్‌, ఉపాసన, నాగచైతన్య, సమంత జంటలు వేడుకలో సందడి చేశారు.

మరింత +
Nagababu Joins in janasena Party to contest from Narsapuram Lok Sabha Constituency

జనసేన: నర్సాపురం నుంచి నాగబాబు పోటీ

జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేరారు. ఆయన్ను కండువా కప్పి జనసేనాని పార్టీలోకి ఆహ్వనించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన సోదరుడు నాగబాబును దొడ్డిదారిన కాకుండా నేరుగా ప్రజా క్షేత్రంలో నిలబెడుతున్నానని పవన్ అన్నారు. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానని చెప్పారు. నాగబాబు అందరికి అందుబాటులో ఉండే వ్యక్తి అని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజాసేవ చేసేందుకు తనకు అవకాశం దక్కిందని నాగబాబు అన్నారు.

మరింత +
Beauty Pageant Winner Now an Army Officer, Netizens Go Gaga Over Lt. Garima Yadav’s Life Journey

ఆర్మీ ఆఫీసర్‌గా మాజీ మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్

మిస్ ఇండియా చార్మింగ్ ఫేస్- 2017 కిరీటాన్ని సొంతం చేసుకున్న గరిమా యాదవ్ ఆర్మీ ఆఫీసర్‌గా.. సైన్యంలో చేరి లెఫ్టినెంట్‌గా బాధ్యతలు స్వీకరించింది. న్యూఢిల్లీలో సెయింట్ స్టిఫెన్స్ కళాశాలలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన అనంతరం కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్షలో గరిమా ఉత్తీర్ణత సాధించారు. అనంతరం చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో చేరి శిక్షణ తీసుకుంది. సైన్యంలో చేరాలన్న పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది.

మరింత +
Dear Comrade Movie Teaser: Vijay Deverakonda’s lip lock scene with Rashmika Mandanna creates rage on social media

డియర్ కామ్రేడ్ టీజర్‌లో విజయ్‌దేవరకొండ లిప్‌లాక్

యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన మరో చిత్రం డియర్‌ కామ్రేడ్‌. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ టీజర్‌ పై హిట్ టాక్ వస్తోంది. విళ్లీద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి, లిప్ లాక్ సీన్ గురించి సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతకు ముందు గీత గోవిందం మూవీలో విజయ్‌, రష్మిక జంటగా నటించగా ఆ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు.

మరింత +
Jr NTR to Romance Daisy Edgar-Jones in SS Rajamouli’s Magnum Opus!

ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బ్రిటీష్ నటి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ యంగ్ కొమురం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ కు జోడీగా ప్రముఖ బ్రిటీష్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటిస్తున్నారని తెలియజేశారు దర్శకుడు రాజమౌళి. 19వ శతాబ్దం ఆరంభంలో అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణ ప్రాంతంలోనూ ఒకేసారి తెగల హక్కుల కోసం పోరాడిన యోధులు.. యుక్త వయసులో ఎలా ఉన్నారు? ఏం చేశారు అని తెలియజేసే పాత్రలో  కనిపించబోతున్నారు ఎన్టీఆర్, రామ్ చరణ్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు రామ్ చరణ్. ఆయన ప్రియురాలు సీత పాత్రలో ఆలియా భట్ నటించేందుకు ఒప్పుకుందట ఈ బాలీవుడ్ సుందరి.

మరింత +