రాజ్ ప్రత్యేకం

Serilingam Pally Sunnam Cheruvu Lake's Mafia Land Kabja

కబ్జా కోరల్లో సున్నం చెరువు: 22 ఎకరాలు హాంఫట్

కబ్జాకు కాదేది అనర్హమన్నట్టు తయారైంది పరిస్థితి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కమ్మేస్తున్నారు. గుడి, బడి అనే తేడా లేకుండా కైంకర్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. చెరువు స్థలాలను యథేచ్ఛగా కబ్జాగా చేసేస్తున్నారు. తాజాగా శేరిలింగంపల్లి సున్నం చెరువు అక్రమార్కుల చేతికి చిక్కింది. అయితే చెరువు ఆక్రమణకు అక్రమార్కులు వేసిన స్కెచ్‌‌కు రాజ్‌న్యూస్ చెక్ పెట్టింది.  

భాగ్య నగరంలో చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. అక్రమార్కుల దనదాహానికి చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. శేరిలింగంపల్లిలోని సున్నం చెరవు దోపిడీదారుల చేతిలో పడి.. నానాటికి తరిగిపోతుంది. 32 ఎకరాల చెరువు కాస్త ఇప్పుడు పది ఎకరాలైంది. దోపిడీదారులు 22 ఎకరాల చెరువు స్థలాన్ని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు. కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఫలితంగా ఎంతో మందికి ఉపయోగపడే సున్నం చెరువు ఇప్పుడు నిరుపయోగంగా మారింది. అధికారుల అలసత్వం అక్రమార్కులకు కలసిరావడంతో.. చెరువుకే టెండర్ పెట్టారు.  

సున్నం చెరువులోని నీళ్లను సైతం వదలడం లేదు. బోర్ మోటార్ సాయంతో నీటి ట్యాంకర్లలో నింపి లక్షల రూపాయలతో జేబులు నింపుకుంటున్నారు. ఒక్క రోజుకు 500 నీటి ట్యాంకర్లు నీరు అక్రమంగా బయటకు సరఫరా అవుతోంది. ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముడుపులు తీసుకుని అధికారులు పట్టించుకోకపోవడం వల్లే.. ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.  

తాజాగా చెరువుకు ఆనుకుని ఉన్న ఎఫ్‌టీఎస్, బఫర్ ల్యాండ్‌లను కూడా కైవశం చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బఫర్‌జోన్‌లోని భూమిలో అక్రమార్కులు నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి రాజ్ న్యూస్ అడ్డుకట్ట వేసింది. ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి రాజ్ న్యూస్ బృందం ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఎమ్మార్వో సున్నం చెరువు వద్దకు తన సిబ్బందితో చేరుకుని బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. బఫర్ జోన్ ప్రాంతానికి మార్క్ చేసి మరోసారి ఇక్కడ నిర్మాణాలు చేపడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మరింత +
AP People looking to YS Jagan as Chief Minister,  Promised to give him 100 Assembly seats in Andhrapradesh 2019 elections

జగనన్న పాదయాత్రకు జననీరాజనం

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆయనో ఆశాకిరణం. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆయనో ఓ ధైర్యం. అందుకే తనను నమ్మిన ప్రజల కోసం నేనున్నానంటూ ఓ యజ్ఞం ప్రారంభించారు. నేడు ఆ నాయకుడి పుట్టినరోజు. జననేత జగన్ 46వ వసంతంలోకి అడుగుపెట్టారు. తనకు తెలియకుండానే రాజకీయాల్లోకి వచ్చారు. అనుకోకుండానే పార్టీ పెట్టారు. ఎన్నికష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకెళ్తున్నారు. యుద్ధం మొదలుపెట్టాక వెనుదిరిగేదిలేదంటూ తేల్చిచెబుతున్నారు. ఫ్యూచర్‌పై జగన్‌లో ఫుల్ క్లారిటీ కనిపిస్తోంది. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోకుండా ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామ రక్ష అంటూ వైసీపీ అధినేత ముందుకు సాగుతున్నారు. 2019లో వార్ వన్ సైడేనంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. నిత్యం ప్రజల కోసం తపించే ప్రజా నాయకుడే జగన్ మోహన్ రెడ్డి. అందుకే ఆయన్ను అభిమానులు తమ గుండెల్లో పెట్టుకుంటున్నారు. జననేత పాదయాత్రకు జననీరాజనం పలుకుతున్నారు.  

1972 డిసెంబర్ 21న జన్మించిన జగన్ YSR వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో కడప పార్లమెంట్ స్థానం నుంచి లక్షా 78 వేల 846 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డిపై జగన్మోహన్ రెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దికాలంలోనే 2009 సెప్టెంబర్ 2న YS రాజ‌శేఖ‌ర్ రెడ్డి హఠాన్మరణంతో జగన్ రాజకీయ జీవితం మలుపు తిరిగింది. YSR విధేయులైన మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను సీఎం చేయాలని సంతకాలు పెట్టి కాంగ్రెస్ హైకమాండ్‌కు వినతిపత్రం అందించారు. దీంతో జగన్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే అని భావించిన హస్తం నేతలకు ఢిల్లీ పెద్దలు ఊహించని రీతిలో షాకిచ్చారు. YSR మరణం తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా రోశయ్యతో ప్రమాణ స్వీకారం చేశారు. అయినా జగన్ చలించలేదు. అధికారం కన్నా ప్రజలే ముఖ్యమనుకున్నారు. ముఖ్యమంత్రి పదవి దక్కకున్నా రెండేళ్ల పాటు ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన అభిమానుల కుటుంబాలను కలుసుకునేందుకు ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు జగన్.  

జనంలో జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్‌లోని కొందరు సీనియర్లు యాత్రకు అడ్డుతగిలారు. ఓదార్పు యాత్రపై ఫిర్యాదులు రావడంతో జగన్ యాత్రకు హైకమాండ్ రెడ్ సిగ్నల్ వేసింది. పైగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. హస్తంలో జరుగుతున్న పరిణామాలేవీ జగన్‌కు మింగుడు పడలేదు. దీంతో తండ్రికి రాజకీయ జన్మనిచ్చి, ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు గుడ్‌బై చెప్పి కొత్త పార్టీ ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి.  

2011 మార్చి 11న YSR కాంగ్రెస్ పార్టీని జగన్ స్థాపించారు. వైఎస్‌పై ఉన్న విపరీతమైన సానుభూతి, జగన్‌ వైపు సానుకూల పవనాలు వీయడంతో కాంగ్రెస్, TDP నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. 2011లో జరిగిన ఉపఎన్నికల్లో జగన్ రికార్డు సృష్టించారు. కడప ఎంపీగా పోటీ చేసిన ఆయనకు 5 లక్షల 45వేల 672 ఓట్ల మెజార్టీ లభించింది. వైసీపీ విజయ ప్రభంజనంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి హేమాహేమీలు జగన్ పార్టీలో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో గడిపారు జగన్. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చిన ఆయన పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేశారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ఆదరణ, ప్రజల నుంచి స్పందన వస్తుండటంతో కాబోయే సీఎంను తానేనని జగన్ భావించారు. ఆ నమ్మకంతోనే 2014 ఎన్నికల్లో ఒంటరిపోరుకు మొగ్గు చూపి తప్పు చేశారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పరిణామాలు టీడీపీకి కలిసొచ్చాయి. దానికితోడు గెలుపు కోసం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి పవన్, బీజేపీతో పొత్తు పెట్టుకోగా జగన్ మాత్రం ఒంటరిపోరుకే మొగ్గు చూపారు. దీనికి తోడు చివరి క్షణాల్లో వైసీపీ నుంచి వీడిన నేతలు చేసిన ఆరోపణలు ఆ పార్టీ ఓటమికి దారి తీశాయి. అయినా 2014 ఎన్నికల్లో వైసీపీ గట్టిపోటీనే ఇచ్చింది. 67 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. కేవలం రెండు శాతం ఓట్లతో అధికారం చేజారిపోయిందన్న బలమైన నమ్మకంతో ఉన్న జగన్ ఈ సారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వినూత్న ఎత్తుగడలతో ముందుకెళ్తున్నారు. తండ్రి నమ్మిన పాదయాత్ర సిద్ధాంతానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్రతో జనాల్లోకి వెళ్లారు. ప్రజలతో మమేకమవుతున్న జ‌గ‌న్ పాదయాత్ర లక్షలాది మందితో దండుగా కదులుతున్న ప్రజాయాత్ర. బృహత్తర యజ్ఞంలా కొనసాగుతున్న మహాయాత్ర. విమర్శణ బాణాలు ఎక్కుపెడుతున్న రాజకీయ యాత్ర. సంకల్పం సడలని జైత్రయాత్ర అదే YCP అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర. ఎండాలేదు వానలేదు పాదమెటు పోతున్నా పయనమెందాకైనా..? అంటూ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నారు YS జగన్. ఇడుపులపాయలో ఒక్క అడుగుతో మొదలైన పాదయాత్ర 326 రోజుల్లో 3 వేల 500 కిలోమీటర్ల మైలురాయికి చేరింది.  

ఓ యజ్ఞంలా ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలే ఎజెండాగా జగన్ ముందుకు కదులుతున్నారు. పులివెందుల వేదికగా 2017 నవంబర్ 6న ప్రజాసంకల్పయాత్రకు జగన్ శ్రీకారం చుట్టారు. తల్లి విజయమ్మ ఆశీర్వాదంతో ఇడుపులపాయలోని YSRఘాట్ వద్ద తండ్రికి నివాళి అర్పించి మహత్తర యాత్రకు పయనమయ్యారు. ప్రజా సమస్యల అన్వేషనే ఎజెండాగా ముందుకు సాగుతూ ప్రజలతో మమేకమవుతున్నారు జగన్. ఇలా ఒక్క అడుగుతో మొదలైన పాదయాత్ర అడుగు అడుగు ముందుకేస్తూ 3500కిలో మీటర్లకు చేరువైంది. ప్రజా సంకల్ప యాత్రలో కవర్ కానీ 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా కలవడానికి ఆయన ఎన్నికలముందు సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ఇప్పటికే 60 శాతం అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఇలా అటు పార్టీని ఇటు ప్రజా సమస్యలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి వైసీపీ అధినేత సర్వసన్నద్ధం అవుతున్నారు.  

ప్రచార వ్యూహంలో భాగంగా నవరత్నాలు పేరిట వినూత్న పథకాలకు నాంది పలికారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రశాంత్ కిషోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా రంగంలోకి దింపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హోరెత్తిస్తున్నారు. మాటతప్పను, మడమతిప్పనంటున్నారు జగన్. కష్టాలెన్నొచ్చినా ఎదుర్కొంటున్నానని స్పష్టం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారాన్ని పొగొట్టుకున్న ఆయన ఈసారి ఎలాంటి తడబాటు లేకుండా విజయాన్ని సొంతం చేసుకోవాలని పక్కా లెక్కలతో ముందుకెళ్తున్నారు. జనం నమ్మకమే పాదయాత్రకు స్ఫూర్తి అని నాడు వైఎస్ఆర్‌కు లభించిన విజయమే 2019లో తనకు లభిస్తుందన్న విశ్వాసంతో అడుగులేస్తున్నారు.

మరింత +
KCR in dilemma over his One way thinking and Monarchism, huge loss to TRS Party !

ఆ ఒంటెద్దు పోకడే కేసీఆర్‌ని ముంచుతోందా?

కేసీఆర్‌కు స‌మిష్టిత‌త్వం అన్నా స‌మిష్టి నిర్ణ‌యాల‌న్న అస్స‌లు న‌చ్చ‌వు. నిర్ణ‌యాధికారం తానొక్క‌డి సొంత‌మ‌ని భావిస్తారు. అందుకే విప‌క్షాలు ప్ర‌జాకూట‌మి క‌డితే స‌హించ‌లేక‌పోతున్నారు. ప్ర‌జాస్వామ్యానికి బ‌లం స‌మిష్టి భావ‌నే అన్న‌ మూల సిద్ధాంతాన్ని మ‌రిచి కూటమి అంటేనే ఒంటి కాలి మీద లేస్తున్నారు. 
ఒంటెద్దు పోకడే...
కేసీఆర్‌ది ఎప్పుడూ సింగిల్ రూటే. మొదటి నుంచి ఆయనది ఒంటెద్దు పోకడే. స‌ర్వం త‌న‌కే తెలుస‌నుకునే నైజం గులాబీదళపతిది. తాను తీసుకున్న నిర్ణయాలు స‌రి కాక‌పోయినా తన పార్టీలోని అందరూ తలూపాల్సిందే. లేకపోతే ఎంతపెద్ద నాయకుడికైనా కారులో బెర్త్ దక్కదు. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక నేతలు ఎంతోమంది గులాబీ పార్టీని వీడటానికి ఆయన వైఖరే ప్రధాన కారణం. అందుకే కేసీఆర్‌కు స‌ల‌హాలు,సూచ‌న‌లిచ్చే సాహసం ఎవ్వరూ చేయ‌రు. పొర‌పాటున చేస్తే ఇక అంతేసంగ‌తులు. దళపతి చెప్పింది చేయడం తప్ప ఆయన నిర్ణయాల్లో ఎవ్వరూ త‌లదూర్చ‌రు. 
సమిష్టి భావన లేదు...
ఉద్యమసమయంలో సైతం కేసీఆర్‌కు సమిష్టి భావన లేదు. కానీ ఉద్యమంలో ముందున్నారు క‌నుక, అంతా సైలెంట్‌గా ఆయ‌న్ను అనుస‌రించే వారు. ఏ స‌మ‌యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..? టీఆర్ఎస్ సీనియ‌ర్లకే తెలియ‌కపోయేది. అప్ప‌ట్లో టీ-జేఏసీ త‌ల‌పెట్టిన సాగ‌రహారానికి కేసీఆర్ మొద‌ట మ‌ద్ద‌తివ్వ‌లేదు. తమ పార్టీకి సంబంధం లేదన్నట్లు గులాబీ క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చారు. తీరా సాగరహారం మొదలయ్యాక మ‌న‌సు మార్చుకున్నారు. ఆ మహోద్యమంలో భాగస్వామ్యం కాకపోతే పల్చన అవుతామని చివరి నిమిషంలో కేసీఆర్ ట్యాంక్‌బండ్ మీదకు వచ్చారు. ఇప్పుడా..! వ‌చ్చేదని తెలంగాణవాదులు నిల‌దీయ‌డంతో వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో అసలు సాగరహారానికి మొద‌ట్లో ఎందుకు మ‌ద్ద‌తియ్యలోదో..? ఆ త‌ర్వాత ట్యాంక్‌బండ్ మీదకు ఎందుకు వ‌చ్చారో..? తెలియ‌క TRS పార్టీ నేత‌లు జుట్టు పీక్కున్నారు. ఇదొక్క విష‌యంలోనే కాదు, ఉద్య‌మస‌మ‌యంలో అన్ని సంద‌ర్బాల్లోనూ ఇంచుమించు ఇలానే జ‌రిగేది. 
జేఏసీ కార్య‌క్ర‌మాల్లో మొక్కుబ‌డిగా...
సొంత‌పార్టీ కార్య‌క్ర‌మాలైతే ఎంతో ఉత్సాహంగా నిర్వ‌హించేవారు. ఎందుకంటే అక్క‌డ అంతా కేసీఆర్ జ‌ప‌మే. ఆయ‌న నిర్ణ‌యాల‌పై స‌మీక్ష‌లు గానీ, లోటు పాట్లు గాని చ‌ర్చించ‌రు. బాస్ ఇస్ రైట్ అన్న‌ట్లుగానే ఉంటుంది. అందుకే జేఏసీ కార్య‌క్ర‌మాలైతే అంటీముట్ట‌నట్లుగా వ్యవ‌హ‌రించేవారు. ఎందుకంటే జాయింట్ యాక్షన్ కమిటీలో కేసీఆర్ ఒక్క‌రి మాటే చెల్లుబాటు కాదు. అక్క‌డ ఎన్నో పార్టీలు, మ‌రెన్నో ప్ర‌జా సంఘాలు. అంద‌రూ సమగ్రంగా చ‌ర్చించి, స‌మిష్టి నిర్ణ‌యం తీసుకుని ఉమ్మ‌డిగా అమ‌లు చేయాలి. అందుకే ఆయనకు జేఏసీ కార్యక్రమాలు చికాకు పుట్టించేవి. దీంతో కేసీఆర్ జేఏసీ కార్య‌క్ర‌మాల్లో మొక్కుబ‌డిగా పాల్గొనేవారు. ఏది జ‌రిగినా త‌న చేతుల మీద జ‌ర‌గాలి. త‌న నిర్ణ‌యాలే చెల్లుబాటు కావాలి అనే నైజ‌మే దీనంతటికి కార‌ణం. 
అధికారం చేతికి వచ్చాక...
ఇక అధికారంలోకి వచ్చాక కూడా కేసీఆర్ వైఖరిలో మార్పు రాలేదు. అంతా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలే. రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా స‌మిష్టి నిర్ణ‌యాలంటేనే ఆయ‌న స‌హించే వారు కాదు. అన్ని సొంత నిర్ణయాలే. అందుకే 2014 ఎన్నిక‌ల మేనిఫెస్టో మొద‌టి పేజీలో పెట్టిన పౌర స‌మాజ పాల‌న అనే అంశాన్ని కల్వకుంట్ల మ‌రిచిపోయారు. మేధావులు, పౌరసమాజ పెద్ద‌ల‌తో స‌ల‌హామండలి ఏర్పాటు చేస్తాము. వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పాల‌న సాగిస్తామ‌న్న కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ఆ విషయాన్ని పక్కనపెట్టారు. సమిష్టి నిర్ణయాలకు నీళ్లొదిలారు. నిర్ణ‌యాల్లో ఇత‌రుల‌కు భాగస్వామ్యమే కల్పించలేదు.పైగా తాను కాకుండా మ‌రొక‌రు త‌మ అభిప్రాయ‌లు చెబితే మంత్రులైన స‌హించ‌రు. 
మంత్రులకు సైతం వార్నింగ్ లు...
ఓసారి రైతుల రుణమాఫీ విష‌యంలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కాలపరిమితి విధించాలని చెబితే మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ చివాట్లు పెట్టారు. ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి అనుభవం లేని మంత్రులు చేసిన ప్రకటనలు నమ్మొద్దని ప్రజల్ని కోరారు. అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి రాజ‌య్య ఒకస‌భ‌లో మాట్లాడుతూ వ‌రంగ‌ల్‌కు హెల్త్ యూనివర్సిటీ తెస్తామన్నారు. తాను చెప్పాల్సిన విష‌యాన్ని మ‌రొక‌రు చెప్పే స‌రికి సీఎం సీరియ‌స్ అయ్యారు. రాజయ్య‌..! నువ్వు తెస్తవా..? హెల్త్ యూనివర్సిటీ నీకు అస‌లు బ‌డ్జెట్ ఎంత ఉందో తెలుసా..? తెలిసీ తెల్వక హామీలు ఇవ్వొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవి నుంచి రాజయ్యను బర్తరఫ్ చేశారు. 
టీఆర్ఎస్‌లో మంత్రులు ఉత్సవ విగ్రహాలే..!
మరోవైపు మంత్రుల్ని పరిగణలోకి తీసుకోకుండానే వారి శాఖ‌ల్లో కేసీఆర్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకునే వారు. మంత్రులు జిల్లా ప‌ర్య‌ట‌న‌ల్లో ఉన్న‌ప్పుడు వారి శాఖ‌ల‌పై ప్ర‌గతి భ‌వ‌న్‌లో స‌మీక్ష‌లు నిర్వ‌హించేవారు. బ‌డ్జెట్ క‌స‌ర‌త్తులు చేసేవారు. కీల‌క నిర్ణ‌యాల్లో మంత్రుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌కుండా వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. తనకు తప్ప మరొకరికి ఏమీ తెలియదనే భావనతో వ్యవహరించేవారు. 
ఒక్క సారి కూడా అఖిలపక్షాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లిన దాఖలాలు లేవు..!
నిజానికి కేసీఆర్‌కు సమిష్టి నిర్ణయాలన్న, ఐక్యకార్యాచరణన్న అస్సలు నచ్చదు. చేస్తే తానొక్క‌డే చేయాలి. లేకపోతే అది కాకుడ‌దనే వ్య‌వ‌హార‌శైలిని అసెంబ్లీ వేదిక‌గా ఎన్నోసార్లు బ‌య‌ట‌పెట్టుకున్నారు. త‌న 51 నెల‌ల పాల‌న‌లో ఒక్క అఖిలప‌క్ష స‌మావేశాన్ని నిర్వ‌హించలేదు. ముస్లిం, ఎస్టీ రిజ‌ర్వేష‌న్ల పెంపు, ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌, ప్రాణహిత‌ ప్రాజెక్ట్‌కు జాతీయహోదా, హైకోర్టు విభ‌జ‌న ఇలా ఎన్నో కీల‌క అంశాల‌పై అఖిలప‌క్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని శాసనసభ వేదికగా హామీ ఇచ్చారు. కానీ ఒక్క సారి కూడా అఖిలపక్షాన్ని కేంద్రపెద్దల వద్దకు తీసుకెళ్లలేదు. హ‌మీల అమ‌లు కోసం 50 సార్లు ఢిల్లీకి వెళ్లానని ప్రచార సభల్లో చెబుతున్న కేసీఆర్ అఖిలప‌క్షాన్ని ఎందుకు హస్తినకు తీసుకెళ్లలేదో..? చెప్ప‌డం లేదు. 
ప్రశ్నించిన వాళ్లపై దూకుడు..!
ఉమ్మ‌డి రాష్ట్రంలోనే కాదు ఇత‌ర రాష్ట్రాల్లోనూ అఖిల ప‌క్షాన్ని కేంద్రం వ‌ద్ద‌కు తీసుకెళ్లడం సర్వసాధారణం. ఫలాన అంశం మీద రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని సందేశం వినిపిస్తాయి. కానీ కేసీఆర్ మాత్రం అఖిలప‌క్షం అంటే స‌హించ లేరు. ఎందుకంటే అఖిలప‌క్షంలో స‌మిష్టిత‌త్వం ఉంటుంది. సమిష్టితత్వం త‌న నైజానికి విరుద్దం కావ‌డంతో అఖిలపక్ష విధానాన్ని అట‌కెక్కించారు. ఇక త‌న హ‌మీల‌ను గుర్తు చేయ‌డం కూడా కేసీఆర్‌కు రుచించ‌దు. తోట‌ప‌ల్లి రిజర్వాయర్‌ను కుర్చీవేసుకుని క‌ట్టిస్తాన‌ని గ‌త ఎన్నిక‌ల్లో కేసీఆర్ హ‌మీ ఇచ్చారు. దీన్ని గుర్తు చేసిన పాపానికి మ‌హిపాల్ రెడ్డి అనే రైతును అంద‌రి ముందు అవ‌మాన‌ప‌రిచారు. నువ్వు క‌ట్టిత్త‌వా రిజ‌ర్వాయ‌ర్..? నాకే అడ్డం పొడుగు మాట్లాడుతున్నవు. నీ తోటి అయిత‌దా..! అడోడు ఇడోడు మోపైనాడు అంటూ అవ‌మానించేలా మాట్లాడారు. 
ప్ర‌జా కూట‌మి భావ‌న‌ను కేసీఆర్ స‌హించలేక‌..!
ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌కు అలవాటు ప‌డిన కేసీఆర్ సమిష్టి భావన అంటేనే ఉలిక్కి ప‌డుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ, జ‌న‌స‌మితి, సీపీఐ పార్టీలు, ప్ర‌జా సంఘాలు, సామాజిక శ‌క్తులు క‌లిసి ప్ర‌జా కూట‌మిగా ఏర్పాడ్డాయి. కేసీఆర్ అప్ర‌జాస్వామ్య పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడుతామ‌ని ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌జా కూట‌మి భావ‌న‌నే కేసీఆర్ స‌హించలేక‌పోతున్నారు. నిర్ణయాధికారం ఒక్కడి చేతిలో కాకుండానాలుగు పార్టీల చేతిలోకి వెళ్లడాన్ని త‌ప్పుబ‌డుతున్నారు. అందుకే త‌న ప్ర‌చారసభల్లో ప్రజాకూటమిని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. 
తెలంగాణ ప్రజలు కూటమికే సై..!
ఏకపక్ష నిర్ణయాలు, ఒక్కరిచేతిలోనే పెత్తనం అనేది నియంతృత్వం అవుతోంది తప్ప ప్రజాస్వామ్యం కాదు. అందుకే సమిష్టితత్వ పునాదుల మీద ఏర్పడ్డ ప్రజాకూటమిని ఆడిపోసుకుంటున్నారు. పైగా తెలంగాణ సెంటిమెంట్‌ను జోడించి భావోద్వేగాలు పెంచి ఎన్నిక‌ల్లో లబ్ధిపొందేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఐతే ప్ర‌జాస్వామ్య పాల‌న కోరుకుంటున్న తెలంగాణ స‌మాజం గులాబీ దళపతి వ్యాఖ్యల్ని పెద్దగా ప‌ట్టించుకుంటున్న దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ప్ర‌జా కూట‌మిదే ఈ ఎన్నిక‌ల్లో పై చేయిగా నిలుస్తోంద‌న్న విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి.

మరింత +
VISSA TV Short Film Contest

విస్సా టీవీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్

షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కు త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకునే గొప్ప అవ‌కాశాన్ని విస్సా టీవీ క‌ల్పిస్తోంది. క్వాలిటీ మ‌రియు క్రియేటివ్ మేకింగ్ తో మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ ల‌ను మాకు పంపించండి. వాటిలో ది బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ల‌ను ఎంపిక చేసి.. బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట‌ర్ మ‌రియు ఇతర విభాగాలలో మొద‌టి ముగ్గురు విజేత‌ల‌కు ప్ర‌థ‌మ‌, ద్వితీయ‌, తృతీయ బ‌హుమ‌తులు అందజేయటం జరుగుతుంది.

గ‌మ‌నిక‌: ప‌్ర‌వేశ రుసుము లేదు (ఉచితం)
ఫోన్ నంబ‌ర్: 6302033385
మెయిల్ ఐడీ: thedirector@susheemedia.com

మరింత +
Telangana Political heat after Assembly election notification release

అలకలు, బుజ్జగింపులతో వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు

తెలంగాణలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సై అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జారీతో పొలిటికల్ హీట్ నెలకొంది. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. ఎవరికి వారు గద్దెనెక్కేందుకు కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలు కానున్న నేపథ్యంలో.. తెలంగాణలో రాజకీయం ఉత్కంఠగా మారింది. వ్యూహ ప్రతివ్యూహాలు, సీట్ల సర్దుబాట్లు, చేరికలు, అలకలు, నిరసనలు, బుజ్జగింపులతో రాష్ట్రంలో రసవత్తర రాజకీయం నెలకొంది.  
తెలంగాణలో లడాయి షురూ..
ఏ పార్టీ ధీమా ఆ పార్టీది, ఏ పార్టీ వ్యూహాలు ఆ పార్టీవి అన్నింటి లక్ష్యం ఒక్కటే అధికారం సొంతం చేసుకోవడం. అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి టీఆర్ఎస్ అడుగుల వేస్తుండగా, టీఆర్ఎస్ ఓటమి చూసేందుకు మహా కూటమి సన్నద్ధమవుతుంది. బీజేపీ ఓ వైపు, సీపీఎం ఆధ్వర్యంలో బీఎల్ఎఫ్ మరోవైపు పోటీకి సిద్ధమయ్యాయి. మొత్తం మీద పదికి పైగా ప్రధాన రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. మరికొన్ని చిన్న పార్టీలూ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాయి.  
ముందస్తు ఎన్నికలకు తెరలేపిన కేసీఆర్..
ఎన్నికల విషయంలో టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తోంది. ముందస్తు ఎన్నికలకు తెరలేపి, ఆరోజే అభ్యర్థులను ప్రకటించింది. వెంటనే ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి నామినేషన్ల దాఖలకు టీఆర్ఎస్ సన్నద్ధమవుతుంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. కేసీఆర్‌ సెప్టెంబరు ఏడో తేదీన హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు పలు నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించి టీఆర్ఎస్‌కు అసమ్మతి సెగలు రాజుకున్నాయి. మాజీ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాదాపు 30 నియోజకవర్గాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.  
టీఆర్ఎస్‌‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సై..
టీఆర్ఎస్‌కు ధీటుగానే కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తూ.. ప్రజల్లో పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. టీఆర్ఎస్‌పై వ్యతిరేకత, ఎన్నికల్లో తాము ఇస్తున్న హామీలు గెలుపును సొంతం చేస్తాయనే ఆశాభావంతో కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో మహా కూటమికి సారథ్యం వహిస్తూ.. పొత్తుల ప్రక్రియకు తెరలేపింది.  
మహాకూటమితో కాంగ్రెస్ ముందుకు..
మరోవైపు అభ్యర్థుల ఎంపికపై ముమ్మర కసరత్తు సాగిస్తోంది. మహాకూటమిలోని పార్టీలకు పొత్తుల స్థానాలు పోగా.. మిగిలిన 94 స్థానాల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌ సిద్ధమైంది. ఎన్నికల ప్రణాళికను దాదాపు పూర్తిచేసిన కాంగ్రెస్‌ అందులోని కీలకాంశాల్ని ఇప్పటికే ప్రకటించింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పటికే ఒకసారి రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొన్నారు ప్రచారానికి మరింత ఊపు తెచ్చేలా యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీనీ బహిరంగ సభలకు రప్పించబోతున్నారు.  
పొత్తుల్లో భాగంగా 14 స్థానాలు టీడీపీకి..
ఈ ఎన్నికల్లో టీడీపీ తన అదృష్టాన్ని పరిక్షీంచుకోనుంది. కాంగ్రెస్‌తో జట్టుకట్టి బరిలో దిగుతోంది. మహాకూటమిలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత ఎన్నికల్లో 15 స్థానాల్లో నెగ్గిన టీడీపీ ఈ సారి కూడా ఆ సంఖ్యకు తగ్గకుండా పోటీచేయడానికి ప్రయత్నిస్తోంది. పొత్తుల్లో భాగంగా 14 స్థానాలు ఖరారయ్యాయి.  
కోదండరాంకు మహాకూటమిలో కీలక పాత్ర..
కొత్తగా ఆవిర్భవించిన టీజేఎస్ కోదండరామ్ నేతృత్వంలో తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతోంది. మహాకూటమిలో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమయ్యారు. మహాకూటమి అభ్యర్థుల గెలుపు లక్ష్యంగా కోదండరాం రాష్ట్రమంతటా ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా సీపీఐ మహాకూటమిలో భాగస్వామ్యమైంది.

యువతెలంగాణతో బరిలోకి దిగుతున్న బీజేపీ..
తెలంగాణలో ఎలాగైన విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహా, ప్రతివ్యూహాలతో ముందుకు కదులుతుంది. తాజాగా యువ తెలంగాణ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలుపు కోసం కృషి చేస్తోంది. మరికొన్ని పార్టీలు, సామాజిక శక్తులతో కూటమి కట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో 66 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మిగిలిన స్థానాల్లో ఎంపికకు కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపేందుకు మహాకూటమిలో, టీఆర్ఎస్‌లోని అసంతృప్తులపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో మిగిలిన 53 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోదీతో మూడు, నాలుగుచోట్ల బహిరంగ సభలకు పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.  
119 స్థానాల్లో బరిలోకి దిగుతున్న చిన్న పార్టీలు..
అలాగే ఎంఐఎం పార్టీ ఈసారి కూడా ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లపై విశ్వాసంతో బరిలో దిగుతోంది.  అదే విధంగా సీపీఎం నేతృత్వంలో 28 పార్టీలు, ప్రజా సంఘాలతో ఏర్పాటైన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎన్నికల బరిలోకి దిగుతోంది. రాష్ట్రంలోని 119 స్థానాలకూ బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు పోటీచేయనున్నారు. 

మరింత +
TRS party facing negative response from Social Media

సోషల్ మీడియా దెబ్బకు టీఆర్ఎస్‌లో వణుకు

టీఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియా శనిలా వెంటాడుతోంది. ఎన్నికల ప్రచారం అంటేనే టీఆర్‌ఎస్ అభ్యర్ధులకు వెన్నులో వణుకు పుడుతోంది. ఏ ఊరిలో ఎవరు నిలదీస్తారో, ఎవరు కన్నెర్ర చేస్తారోనని గులబి నేతల గుండెలు గుభేల్‌మంటున్నాయి. నిలదీత వీడియోలను ఎప్పుడు ఎవరు సోషల్ మీడియాలో పెడతారోనన్న భయంతో .. ఆపార్టీ అభ్యర్ధులు టెన్షన్ పడుతున్నారు. పైకి మళ్లీ అధికారం మనదే అని కేసీఆర్ చెబుతున్నా క్షేత్ర స్థాయిలో నిరసనల హోరుతో కారు పార్టీ కంగారు పడుతోంది. అధినాయకత్వాన్నిసైతం ఈ వైరల్ వైరస్‌ వణికిస్తోంది‌.  
భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో...
భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ అభ్యర్ధులకు వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. పాలేరు, వైరా, అశ్వరావుపేట, పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల అభ్యర్ధులైన తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, జలగం వెంకట్రావ్‌కు నిరసన సెగలు తలనొప్పిగా మారాయి. ప్రజాకర్షక పథకాల్ని సైతం పక్కనపెట్టి .. జనం తమ గ్రామ సమస్యలపై నేతలను నిలదీస్తున్నారు. దీంతో అధికార పార్టీ అభ్యర్ధులకు ఏం పాలు పోవడం లేదు. జనం నుంచి ఊహించని నిలదీతలు వారికి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పైగా ఆ నిరసనలను సెల్ పోన్లతో చిత్రీకరించడం .. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో.. రచ్చరచ్చ అవుతోంది. దీంతో ఓరి దేవుడా ఈ ట్రెండేంటిరా బాబు అని .. గులాబి అభ్యర్ధులు దేవుడికి దండాలుపెడుతున్నారు.  
తుమ్మల నాగేశ్వర్‌రావు ఇలాకాలో...
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో .. ఓవైపు గులాబి నేతల మధ్య వర్గ విబేధాలు తారాస్ధాయికి చేరితే.. మరోవైపు ఓటర్ల నుంచి నిరసన సెగలు ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. కొద్ది రోజుల క్రితం నేలకొండపల్లి మండలం అప్పలనర్సింహాపురంలో మంత్రి తుమ్మల ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. మంత్రి పర్యటన తెలుసుకున్న గ్రామస్తులు .. తమ ఊరికి ఏం చేశావంటూ ఆయన్ని నిలదీశారు. దాదాపు అరగంటపాటు మంత్రి వాహనాన్ని కదలనివ్వలేదు. దీంతో అవాక్కయిన మంత్రి తుమ్మల .. ప్రచారం సంగతి దేవుడెరుగు.. కనీసం తన కారు కూడా దిగకుండానే వెళ్ళిపోయారు. ఈ పరిణామం గ్రామస్తులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.  
తాటి వెంకటేశ్వర్లకు జనం చుక్కలు...
అశ్వరావుపేట టీఆర్ఎస్ అభ్యర్ధి తాటి వెంకటేశ్వర్లకు జనం చుక్కలు చూపిస్తున్నారు. వైరా ఎమ్మెల్యే మధన్‌లాల్‌ది అదే పరిస్థితి. వైరా నియోజకవర్గంలో అసలే అసమ్మతి పోరుతో సతమతమవుతుంటే .. మరోవైపు నిలదీతలు, సోషల్‌ మీడియా రచ్చతో నేతలు రగిలిపోతున్నారు. అశ్వరావుపేట మండలం గాండ్లగూడెం ప్రచారానికి వెళితే తాటి గో బ్యాక్ అంటూ తరిమినంత పని చేశారు. మరిసటిరోజు మల్లాయిగూడెం వెళితే అక్కడా.. తాటికి ఎదురీతే. ఎందకొచ్చాన్రా అంటూ తలపట్టుకోవడం తప్ప .. ఆయన ఏమీ చేయలేని పరిస్ధితి. వైసీపీలో గెలిచి అమ్ముడు పోయావంటూ జనం దాడిని ఎక్కుపెట్టారు. పైగా ఆ గొడవ అంతా సెల్ ఫోన్‌లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  
జలగం వెంకట్రావ్‌కు పరాభావం ...
పినపాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పాయం తరపున ప్రచారం చేస్తున్న మండల స్థాయి నేతలనూ ఓటర్లు వదలడం లేదు. అశ్వాపురం మండలం పాములపల్లిలో గిరిజన యువకులు మా ఊరికి ఎందుకు వచ్చారు, మా రిజర్వేషన్ల సంగతి ఏంటనీ మొహం మీదనే అడిగేశారు. అక్కడ ఉన్న యూత్‌తో గొడవ పడలేక నేతలు పలాయనం చిత్తగించారు. కొత్తగూడెం నియోజకవర్గంలొ టీఆర్ఎస్ అభ్యర్ధి జలగం వెంకట్రావ్‌కూ పరాభావం తప్పలేదు. అప్పుడు ఎప్పుడో ఎన్నికలపుడు వచ్చారు.. మళ్లీ ఇపుడు ఓట్ల కోసం వచ్చారా అంటూ మొహం మీదనే ఓటర్లు నిలదీశారు. పాల్వంచ, సుజాతనగర్‌తో పాటు పలుచోట్ల నిరసనలు జలగంకు చికాకు కలిగిస్తున్నాయి.  
నిమిషాల వ్యవధిలొ అభ్యర్ధి నడిబజార్లో...
గత ఎన్నికల వరకూ ఎంత పడని పార్టీ వాళ్లు ప్రచారానికి వచ్చినా, ఆ ఊరిలో కనీసం ఏజెంట్ లేకపోయినా.. ప్రచారం చేసుకునే పరిస్థితి ఉండేది. కానీ కాలం మారింది అంతా నిలదీతల పర్వం మొదలైంది. టీఆర్ఎస్ అభ్యర్ధి ఎన్నికల ప్రచారానికి వస్తే చాలు.. ఆ గ్రామంలో నలుగురు పోగవ్వడం సమస్యలపై నిలదీయడం, దాన్ని సెల్ పోన్ లో షూట్ చేసి .. పోస్ట్ చేయడం పరిపాటిగా మారింది. దీంతో ఏముందీ .. నిమిషాల వ్యవధిలో ఆ అభ్యర్ధిని నడిబజాట్లో నిలబెడుతున్నరు ఓటర్లు. టీఆర్‌ఎస్ అభ్యర్ధులకు ఎదురవుతున్న నిరసనల సెగ.. మహాకూటమికి మాత్రం చాలా ప్లస్ అయింది. వాళ్లు ఎటూ అధికారంలో లేరు కాబట్టి.. జనం వారిని పెద్దగా నిలదీసే పరిస్థితి లేదు. రాజకీయాల్లో దుమారం రేపుతున్న ఈ నయాట్రెండ్ .. ఎన్నికల్లో ఎవరి కొంప ముంచుతుందోననే ఆందోళనలో.. గులాబీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు.

మరింత +
Election dates for Rajasthan, Madhya Pradesh, Chhattisgarh, Mizoram and Telangana out, results on Dec 11

5రాష్ట్రాలకు ఎన్నికలనగారా: ఇండియాసెమీఫైనల్‌

దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. సెమీ ఫైనల్‌ సంగ్రామానికి షెడ్యూల్ విడుదల అయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రావత్ ఎన్నికల తేదీలను ప్రకటించారు.  
ఇండియా ఎలక్షన్ సెమీ ఫైనల్..
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, మిజోరాం రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమీషనర్ ఓపీ రావత్ ఢిల్లీలో ప్రకటించారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించటానికి ఎలక్షన్ కమీషన్ అన్ని చర్యలు తీసుకుందని ఆయన వివరించారు. నాలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ 6 నుంచి కోడ్ అమల్లోకి రాగా తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ప్రచురిస్తామని తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ రాష్ట్రాల్లో అభ్యర్ధుల వ్యయ పరిమితి 28 లక్షలకు, మిజోరాంలో 20 లక్షలకు పరిమితం చేశామని వెల్లడించారు.  
ఈసీ షెడ్యూల్ ప్రకారం తొలి దశలో..
ఇక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుందని ఈసీ ప్రకటించింది. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని అక్కడ 2 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్టు ఈసీ తెలిపింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం తొలి దశలో సదరన్ ఛత్తీస్‌ఘడ్‌లోని 18 అసెంబ్లీ స్థానాలకు నవంబర్12న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 23న తుది గడువుగా నిర్దేశించింది. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 26న విత్ డ్రాకు తుది గడువుగా ఈసీ ప్రకటించింది.  
రెండవ దశ ఎన్నికల్లో ..
మరో వైపు రెండవ దశ ఎన్నికల్లో భాగంగా ఉత్తర ఛత్తీస్‌ఘడ్‌లో మొత్తం 72 స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 26న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 2 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉండగా నవంబర్ 3వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 5 వరకు ఈసీ గడువు నిర్దేశించింది.  
మధ్యప్రదేశ్, మిజోరాంలలో..
ఇక మధ్య ప్రదేశ్‌లోని 230 స్థానాలకు, మిజోరాం రాష్ట్రంలోని 40 స్థానాలకు సింగిల్ ఫేజ్‌లో నవంబర్ 28న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల నిర్వహణలో భాగంగా రెండు రాష్ట్రాల్లో నవంబర్ 2న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 9 వ తేదీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ కాగా నవంబర్ 12న నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 14 ఆఖరు తేదీగా ఈసీ పేర్కొంది.  
రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు..
మరో వైపు రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 119 స్థానాలకు డిసెంబర్‌ 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. దీనికి గాను నవంబర్ 12న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నవంబర్ 19న నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ కాగా నవంబర్ 20న పరిశీలన ఉంటుంది. ఈ రెండు రాష్ట్రాల్లో నవంబర్ 22న నామినేషన్ల విత్‌డ్రాకు తుది గడువుగా ఈసీ ప్రకటించింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో డిసెంబర్ 11న కౌంటింగ్ నిర్వహించి అదే రోజున తుది ఫలితాలను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది.  
ఎవరికి ఓటేసిందీ తెలుసుకొనే సదుపాయం..
ఈసీ ప్రకటనతో కీలక పోరుకు తెర లేచినట్లయింది. ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేయనున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ లో ఇప్పటికే కాంగ్రెస్‌, బీజేపీ నేతలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాలన్నీ ఓటర్లు తాము ఎవరికి ఓటేసిందీ తెలుసుకొనే పేపర్‌ ఆడిట్‌ యంత్రాలతో అనుసంధానం చేసి ఉంటాయని అధికారులు చెప్పారు.

మరింత +
Maoists Kill Andhra Lawmaker, TDP Leader; Mob Sets Police Stations Afire

మావోల దాడితో మన్యంలో భయాందోళనలు

మావోయిస్టుల కాల్పులు మన్యంలో మంట పుట్టిస్తున్నాయి. సర్వేశ్వరరావు, సోమ మృతితో స్థానికులు భగ్గుమన్నారు. పచ్చని అడవుల్లో రక్తపు మడుగులకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా మావోయిస్టులు తుపాకీ ఎక్కుపెడుతున్నారని తెలిసి కూడా ఎందుకు చర్యలు చేపట్టలేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఖాకీల అలసత్వంపై కన్నెర్ర చేసిన స్థానిక ప్రజలు పోలీస్ స్టేషన్ల ముట్టడికి పాల్పడ్డారు.  
అరకులో మావోల అలజడి..
మావోయిస్టుల కాల్పులతో అరకు వణుకుతోంది. పచ్చని అడవులతో నిత్యం ప్రశాంతంగా ఉండే విశాఖ మన్యంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నక్సలైట్ల కాల్పుల్లో ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలంటూ అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లను ముట్టడించారు.  
పోలీస్ స్టేషన్ పై స్థానికుల దాడి..
అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్ల వద్ద ఆందోళన నిర్వహించి పోలీస్ స్టేషన్‌లోని సామాగ్రి ధ్వంసం చేశారు. అంతటితో ఆగని ఆందోళనకారులు ఫర్నీచర్, పోలీస్ స్టేషన్ ఆవరణలోని పర్ణశాలకు నిప్పంటించారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం పోలీసులు చేసినా స్థానికులు రాళ్ల దాడికి ఎగబడ్డారు. దీంతో పోలీసులు పరుగులు తీశారు. పోలీసులు కాల్పులు జరుపుతామంటూ హెచ్చరించినా ఆందోళనకారులు వినలేదు. పైగా కానిస్టేబుళ్లను దొరకబట్టుకొని చితకబాదారు. దీంతో మన్యంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది.  
మావోల కోసం కూంబింగ్ ముమ్మరం..
గ్రే హౌండ్స్‌ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్దకంగా మారింది. అయితే కొన్ని రోజులుగా మావోయిస్టులు మళ్లీ అలజడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు వారోత్సవాలు నిర్వహిస్తూ పోస్టర్లు అంటించారు. ఈ సమయంలో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని స్థానిక ప్రజలు మండిపోతున్నారు. మావోయిస్టుల నుంచి ముందస్తు హెచ్చరికలు ఉన్నా పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే పోలీసులు కూబింగ్ నిర్వహించి బందోబస్త్ చేపడితే ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతి చెందే వారు కాదని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష వైఖరిని నిరసిస్తూ మృతదేహాలతో ఆందోళన నిర్వహించారు. కలెక్టర్, ఉన్నతాధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  
కేంద్ర హోంశాఖ రంగంలోకి..
ఆందోళనలతో అరకు హడలెత్తిపోతుంటే పోలీసులు కనుచూపుమేరలో కూడా కానరావడం లేదు. అయితే పరిస్థితిని మాత్రం అధికారులు ఎప్పటికప్పడు తెల్సుకుంటున్నారు. ఏపీ ఇంచార్జి డీజీపీ హరీష్ గుప్తా, ఇంటలీజెన్స్ అధికారులు పరిస్థితిని అదుపుచేసేందుకు సమాలోచనలు చేస్తున్నారు. అవసరమైతే గ్రేహౌండ్స్ ను రంగంలోకి దింపేందుకు హోంశాఖ సిద్ధమవుతోంది. విశాఖ బేస్ క్యాంపు నుంచి 6 ప్రత్యేక బృందాల్ని పంపేందుకు నిర్ణయించింది. పరిస్థితిపై చర్చలు జరుపుతున్న పోలీస్ ఉన్నతాధికారులు ఏం చేయాలనేదానిపై సమాలోచనలు చేస్తున్నారు.  
పోలీసుల్లో వణుకు..
ఓవైపు మావోయిస్టుల దుశ్చర్యలు మరోవైపు ప్రజల ఆందోళనలతో ఎప్పుడేం జరుగుతుందోనని పోలీసులు భయాందోళనకు గురవుతున్నారు. అదునుచూసి రంగంలోకి దిగి పరిస్థితి అదుపుచేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

మరింత +
Raj News Telugu stands with Adivasis over Land issues, Adivasis,

రాజ్ న్యూస్: ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా..

అడవుల జిల్లాలో అక్రమాలను అడ్డుకొంది. ఆదివాసీల సమస్యలపై గళమెత్తింది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను నిలదీసింది. బాధితులకు అండగా నిలబడి పోరాడింది. ప్రజా సమస్యలపై జనంతో కలిసి నడిచింది. అడవి బిడ్డల కష్టాల్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. గిరిపుత్రుల చదువుకోవాలన్న ఆకాంక్షను సర్కార్ ద‌ృష్టికి తీసుకెళ్లి సమస్యను తీర్చింది. ఇలా ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజా సమస్యలపై రాజ్ న్యూస్ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. 
ఏడాదిలోనే ఎన్నివిజయాలో..
అడవుల జిల్లా ఆదిలాబాద్ నుండి సింగరేణి సిరుల నేల మంచిర్యాల వరకు ప్రతి సమస్యపై రాజ్ న్యూస్ తనదైన శైలిలో గళం విప్పింది. మండే కాలంలో తాగినీటి కష్టాలు, వర్షాకాలంలో వరదలతో నీట మునిగిని గ్రామాలు, చలి పులి పంజాతో వణికిపోయిన దక్షిణ కశ్మీరం ఆదిలాబాద్ కష్టాలను ప్రతి ఫ్రేం లోను బందించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2, 2017న పునః ప్రసారాలను ప్రారంభించిన రాజ్ న్యూస్.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఒక్క నెలలోనే తొలి విజయాన్ని అందుకుంది. కొత్త జిల్లాగా ఏర్పాడ్డ కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా గోయివాం గ్రామంలోని సావర్ ఖేడ్‌లో అడవి బిడ్డలు పడుతున్న కష్టాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. రోడ్డు మార్గం లేక చదువుకోవాలన్న తపనను చంపుకోలేక గిరిజన విద్యార్థులు అడవుల వెంట వర్షంలో తడుస్తూ చెట్టు పుట్ట, కొండలను దాటుతూ ఆరు కిలోమీటర్లు కాలినడకన నడుస్తూ సాగిస్తున్న చదువులపై.. "అడవుల్లో చదువులు" అని కథనాన్ని ప్రసారం చేసింది. చదువుకోసం విద్యార్థులు పడుతున్న కష్టాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లింది రాజ్ న్యూస్. సావర్ ఖేడ్ గ్రామానికి రోడ్డు మార్గం ఏర్పాటై విద్యార్థులకోసం ప్రత్యేక బస్ వచ్చేలా తన వంతు ప్రయత్నం చేసి విజయం సాధించింది. 
అటవిశాఖలో దొంగల పనిపట్టిన రాజ్ న్యూస్..
ఆదిలాబాద్ జిల్లాలోని భోథ్ మండలం కుప్టీ గ్రామంలోని మొరకొండలను యధేచ్చగా తవ్వేస్తున్న భూబకాసురుల వైనంపై వరుస కథనాలను ప్రసారం చేసింది. దీంతో స్పందించిన రెవెన్యూ, అటవీ శాఖ ఖనిజ సంపదను కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగి మొర దొంగల పని పట్టేలా చేసింది రాజ్ న్యూస్. ఇటు నిర్మల్ జిల్లా కడెం మండలం గంగపూర్‌లో రోడ్డు మార్గం లేక ప్రజలు పడుతున్న కష్టాన్ని బాహ్య ప్రపంచానికి తెలియ జెప్పింది రాజ్ న్యూస్. చుట్టు అడవులు మద్యలో వాగు ఉండటంతో వర్షకాలంలో ఇక్కడి ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్న విదానాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మార్గం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. వాగుపై వంతెన నిర్మించేందుకు సిద్దమని మాటిచ్చింది. 
ఫ్లోరైడ్ బాధితుల చెంత నిలిచిన రాజ్ న్యూస్..
ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం గురుజ, ఆసిఫాబాద్ లొద్దిగూడా, భూతాయి తండాలలో ఫ్లోరైడ్ నీటితో అక్కడి ప్రజలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పొతున్న తీరును మానవీయకోణంలో చూపింది. వారి కన్నీటికష్టాలను ప్రభుత్వానికి అర్థమయ్యేవిధంగా రాజ్ న్యూస్ వరుస ప్రసారాలు చేసింది. మరో ఉద్దానం అంటూ ప్రసారం చేసిన కథనాలకు వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం ఫ్లోరెడ్‌తో బాధపడుతున్న గ్రామాల్లో హుటాహుటిన హెల్త్ క్యాంప్‌లను ఏర్పాటు చేసింది. నిమ్స్ వైద్య బృందంతో పరీక్షలు జరిపించి అనారోగ్య తీవ్రత ఎక్కువగా ఉన్న గిరిజనులకు అత్యవసర వైద్య చికిత్సల కోసం హైదరబాద్ నిమ్స్‌కు తరలించింది. తాగినీటి కోసం ఏర్పాట్లు చేసి ఫ్లోరైడ్ సమస్యకు తాత్కలికంగా చెక్ పెట్టింది. ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను సైతం ఇలా రాజ్ న్యూస్ కథనాలతో తీర్చింది. 
విద్యార్థి కుటుంబాల పక్షాన, నకిలీవిత్తనాలపై గళమెత్తిన రాజ్ న్యూస్..
గురుకుల పాఠశాలలో భద్రత కరువై, సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాల పక్షాన రాజ్ న్యూస్ గళాన్ని వినిపించింది. లక్షేట్టిపేట గురుకుల పాఠశాలలో ఇద్దరు బాలికల ఆత్యహత్య యత్నానికి పరోక్షంగా కారణమైన ప్రిన్సిపల్ కవిత సస్పెండ్ అయ్యే వరకు కథనాలు ప్రసారం చేసింది. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచిన విద్యార్థిని సాయినిధి కుటుంబానికి ఆర్థికంగా సాయం అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. మరో వైపు నకిలీ పత్తివిత్తనాలను రైతులకు అంటగట్టి నిండా ముంచేందుకు సిద్దమైన కేటుగాళ్ల భరతం పట్టేలా కథనాలు ప్రసారం చేసింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సోదాలు నిర్వహించి బెల్లంపల్లి, కాగజ్ నగర్, బోథ్ పరిధిలో కోట్ల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, గుప్పుమంటున్న గుట్కా దందా, ఇసుక అక్రమ రవాణా ఒక్కటేమిటి ఇలా చీకటి సామ్రాజ్యంలో తెర వెనుక సాగుతున్న ప్రతి దందాపై ఉక్కు పాదం మోపేలా కథనాలను ప్రసారం చేసింది రాజ్ న్యూస్. ఈ కథనాలతో కదిలిన రెవెన్యూ, టాస్క్ పోర్స్ యంత్రాంగం దాడులు చేసి కోట్ల విలువ చేసే సరుకులను సీజ్ చేసి కేసులు నమోదు చేసేలా చేసింది. మరోవైపు అధికారుల అవినీతి అక్రమాలతో కోట్లకు కోట్లు పడగలెత్తుతున్న విదానాలపైన కథనాలు ప్రసారం చేసింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెత్తించింది. జ్ఞాన సరస్వతి ఆలయంలో జరిగిన భారీ అవినీతి, అక్రమాలపై వరుస కథనాలు‌ ప్రసారం చేసింది. అమ్మవారి సొమ్మును ఆలయ ట్రస్ట్, ఈవో, ఏఈవోలు ఎలా దోచుకున్నారో వివరించి.. దేవాదాయ శాఖలో చలనం వచ్చేలా చేసింది. త్రిసభ్య కమిటి విచారణ కంటే ముందే మరిన్ని అవకతవకలను ముందస్తుగా అందించి విచారణ వేగవంతం అయ్యేలా చేసింది రాజ్ న్యూస్‌. 
కన్నేపల్లిలో తాగు నీటి సమస్యకు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని కదిలించిన రాజ్ న్యూస్..
తాగేందుకు మంచి నీళ్లు లేక కలిషిత జలాన్ని తాగి అనారోగ్యం భారిన పడి మృతి చెందిన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ప్రజల దుర్బర పరిస్థితులను ప్రపంచానికి తెలిసేలా రాజ్ న్యూస్ చేసింది. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల అలసత్వాన్ని నిగ్గదీసి ప్రశ్నించింది. అనారోగ్యంతో అంతకంతకు క్షీనిస్తున్న 30 మంది కన్నెపల్లి వాసుల ప్రాణాలు కాపాడటంలో క్రియాశీలక పాత్ర పోషించి అండగా నిలిచింది. మేమున్నాం అంటూ బాధితులకు రాజ్ న్యూస్ భరోసానిచ్చింది. జల మరణాలు పేర రాజ్ న్యూస్ ప్రసారం చేసిన కథనాలకు డీ అండ్ హెచ్ఓ, జల వనరుల శాఖ, గిరిజన శాఖ, వైద్య శాఖ హుటాహుటిన స్పందించి కన్నెపల్లిలో తాగునీటి సమస్యను తీర్చేలా ప్రయత్నించింది. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి మరింత మంది అనారోగ్యం భారీన పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. కలిషిత నీటిని తాగి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న 30 మందిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాణాల కాపాడటంలో క్రియాశీలక పాత్ర వహించింది. తమ ప్రాణాలు కాపాడిన రాజ్ న్యూస్‌కు కన్నెపల్లి వాసులు రుణపడి ఉంటాం అంటూ కృతజ్ఞతలు తెలిపారు. 
ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా..
అవినీతి, అక్రమాలు, అవకతవకలు, మానవత్వపు విలువలు, గిరిజనుల కష్టాలు... ఇలా కేవలం ఏడాది కాలంలోనే వందల కొద్ది ప్రజా సమస్యలపై పోరాటం సాగించి విజయం సాదించింది రాజ్ న్యూస్. ప్రజల ఆకాంక్షలే ధ్యేయంగా మీ అందరి ఆశీసులతో ప్రజాగొంతుకను వినిపిస్తోంది రాజ్ న్యూస్.

మరింత +
Telangana Cabinet gives nod to new zonal system for govt jobs

జోనల్ రగడ: లోకలా! నాన్ లోకలా!!

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఎల్.ఐ.సి. ద్వారా రైతులకు జీవిత బీమా కల్పించే పథకానికి కూడా మంత్రివర్గం అంగీకారం తెలిపింది. జోన్ల వ్యవస్థకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరించాలని ప్రధానమంత్రిని కేసీఆర్ కొరనున్నారు. 
ఆఘమేఘాల మీద.. 
రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్ల వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రస్థాయి క్యాడర్ పోస్టులన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీచేయాలని నిర్ణయించింది. తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో జోన్ల వ్యవస్థ, రైతులకు జీవితబీమా పథకంపై విస్తృతంగా చర్చించి అనంతరం మంత్రివర్గం ఏకగ్రీవంగా వీటిని ఆమోదించింది. టి.ఎన్.జి.ఓ.ల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస గౌడ్, టి.ఎన్.జి.ఓ.ల సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డిలను ఈ కేబినెట్ సమావేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. దీంతో తెలంగాణలో ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటవుతాయి. తెలంగాణలో ఇకపై ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళజోన్‌, రాష్ట్ర స్థాయి కేడర్లుగా పరిగణిస్తారు. మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయి పోస్టులకు ప్రత్యక్ష నియామకాలుండవు. పదోన్నతులే ఉంటాయి. 
ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు.. 
తెలంగాణలో ప్రస్తుతం 4 నుంచి పది తరగతుల్లో నాలుగేళ్లపాటు చదివినవారిని స్థానికులుగా గుర్తిస్తూ వస్తున్నారు.. అయితే ఇకపై ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు విద్యాబ్యాసంలో కనీసం నాలుగు సంవత్సరాల ఎక్కడ విద్యాబ్యాసం చేస్తారో, ఆ ప్రాంతాన్నే సదరు అభ్యర్థి స్థానిక ప్రాంతంగా గుర్తిస్తారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జిల్లా, జోన్లు, మల్టీజోన్ల పరిధిలో ఎక్కడ వరుసగా నాలుగేళ్లు చదివితే అక్కడే వారు స్థానికులవుతారు. అన్ని పోస్టులకు 95 శాతం లోకల్, 5 శాతం ఓపెన్ కేటగిరిగా ఉంటుంది. రాష్ట్ర కేడర్‌ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అవుతున్నందున వాటికి రిజర్వేషన్లతో సంబంధం ఉండదు. 
వికారాబాద్ జిల్లా జోగుళాంబ జోన్‌లోనే.. 
మరో వైపు చర్చ సందర్భంగా వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపాలని వస్తున్న డిమాండ్‌పై క్యాబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. వికారాబాద్ గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతమని, దీనిని అర్బన్ ప్రాంతమైన చార్మినార్ జోన్‌లో కలిపితే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అందువల్ల పాలమూరు పరిధిలోని జిల్లాలతో ఉండటమే మేలని సిఎం భావించారు. అర్బన్ ప్రాంత విద్యార్థులతో గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్లు పోటీపడటం కష్టమని, ఉద్యోగాలు ఎక్కువశాతం అర్బన్ ప్రాంతాలవారికే వచ్చే అవకాశం ఉంటుందని భావించారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వికారాబాద్ జిల్లాను జోగుళాంబ జోన్‌లోనే కొనసాగించడం సరైందని మంత్రివర్గం తీర్మానించింది. 
కొత్త జోనల్ వ్యవస్థపై విమర్శలు .. 
మరో వైపు కొత్తగా తెచ్చిన జోనల్ వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్నాయి... జిల్లాల విభజనతో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారిందని విమర్శిస్తున్నాయి.. . ఇప్పుడు మళ్లీ జోనల్‌ వ్యవస్థను తెరమీదకు తెచ్చి వికారాబాద్‌ జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు.జోగుళాంబ గద్వాల జోన్‌లో వికారాబాద్‌ను కలిపి మళ్లీ అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.. . ప్రగతి భవన్‌ పైరవీ భవన్‌గా మారిందని ఆరోపిస్తున్నారు.. . కేసీఆర్‌ వద్ద పనిచేసే కొంతమంది తమ స్వార్థానికి రాష్ట్రాన్ని వాడుకుంటున్నారని . బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ మార్చి సమాజానికి తీరని అన్యాయం చేస్తున్నారని ధ్వజమొత్తుతున్నారు.... వికారాబాద్‌ను చార్మినార్‌ జోన్‌లో కలపి స్థానికులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశస్తున్నారు. 
ప్రజా సంఘాల నుంచి నిరసనలు .. 
అయితే ... వికారాబాద్‌ జిల్లాలను ఛార్మినార్ జోన్ లో కలపాలనేది కొంతమంది డిమాండ్‌ మాత్రమేనంటూ వస్తున్న డిమాండ్‌ను కేసీఆర్‌ పక్కన పెట్టారని విపక్ష నేతలు దుయ్యబడుతున్నారు.. .. దీంతో వికారాబాద్ జిల్లా నుంచి విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నుంచి నిరసనలు వెల్లవెత్తున్నాయి... జోనల్ విషయంలో కేసీఆర్ అనాలోచిన నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శలు కుప్పిస్తున్నాయి. కీలకమైన జోనల్ వ్యవస్థపై నిర్ణయం తీసుకునే ముందు కనీసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయలేదని దుయ్యబడుతున్నారు.. ఎక పక్షంగా వ్యవహారిస్తూ ప్రజలను ఇబ్బందులను గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు.. జోనల్ ఏర్పాటులో ఉద్యోగులు, విద్యార్ధుల, ప్రజాసంఘాలు, ఆయా జిల్లాల ప్రతినిధుల నుంచి జోన్లలో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేసినా కేసీఆర్ పట్టించుకుపోవడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలపాలడంతో పాటు జనగామ జిల్లాను యాదాద్రి జోన్ లో కాకుండా భద్రాద్రి జోన్ లో కలపాలని డిమాండ్ వచ్చాయి.. కాని వాటన్నింటిని పక్కన పెట్టి అంతా తనకు తెలుసు అన్న ధోరణిలో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారని విమర్శిస్తున్నారు. 
రోడ్డెక్కిన జనం.. 
ఇప్పటికే వికారాబాద్ జిల్లా సహా తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల అసంతృప్తులు రోడ్డెక్కారు. మాకు ఈ జోన్లు వద్దంటూ నిరసనలు తెలిపారు..అవగాహన రాహిత్యంతో ప్రకటించిన జోన్లతో పలు ప్రాంతాలకు తీరని అన్యాయం జరుగుతోందని నిరసలు వెల్లవెత్తుతున్నాయి.. వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపాలని జిల్లా వ్యాప్తంగా విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజాలసంఘాలు, ప్రజా ప్రతినిధులు నిరసనలకు దిగుతున్నారు.. పరిగి ఎమ్మెల్యే చేపట్టారు.. . . వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపాలన్న డిమాండ్‌ను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆదివారం ప్రగతి భవన్‌ వద్ద మూడు గంటలు పడిగాపులు కాసినా అపాయింట్‌మెంట్‌ లభించలేదని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 
బంద్ కు పిలుపు.. 
తెలంగాణలో కొత్తగా తీసుకువచ్చిన జోన్లపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్‌ను చార్మినార్ జోన్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బస్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. దీంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఈ బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు. సంబంధం లేని జోగులాంబ జోన్లో వికారాబాద్‌ను చేర్చడం వల్ల జిల్లా వాసులు చాలా నష్టపోతారని రంగారెడ్డి జిల్లాతో కూడిన చార్మినార్ జోన్లోనే తమ జిల్లాను ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.. లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. 
భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తప్పవా..? 
అటు జోనల్‌ వ్యవస్థపై లోతుగా అధ్యయనం చేయడానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి... ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లను ఆగమేఘాలమీద ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంతృత్వ పోకడకు నిదర్శనమన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో ప్రజలు నలిగి పోతున్నారని ఆరోపించారు... ప్రస్తుత జోనల్‌ వ్యవస్థపై భవిష్యత్తులో న్యాయపరమైన సమస్యలు తలెత్తడానికి వీలుందన్నారు .

మరింత +
Karnataka Voting Day 2018: The state votes today while the counting is on May 15

కర్ణాటక ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి

దేశరాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలపైన కర్ణాటక ఎన్నికలు తీవ్ర ప్రభావాన్ని చూపించనున్నాయి.. ఈనేపథ్యంలో అందరి దృష్టి ఈ రాష్ట్రంపై పడ్డాయి. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల భవిష్యత్‌కు మాత్రమే కాకుండా ప్రధాని మోడీ, రాహుల్ గాంధీల వ్యక్తిగత ప్రతిష్ట్రకు ఒక పరీక్షగా మారాయి. ఈఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ నాయకత్వానికి మంచి ఊపు వచ్చే అవకాశం ఉంది. అధ్యక్ష పదవి చేపట్టాక తొలి గెలుపు ఇదే అవుతుంది. రాబోయే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి కూడా ఈ ఎన్నికలకు కీలకంగా మారాయి.. ఈ ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ పార్టీల నేతలే కాదు దేశ ప్రజలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. 
జాతీయ పార్టీల టగ్ ఆఫ్ వార్.. 
దేశ వ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్‌కు దక్షిణాదిలో మిగిలిన పెద్ద రాష్ట్రం కర్ణాటకలో తిరగి అధికారాన్ని నిలబెట్టుకోవడం జీవన్మరణ సమస్యగా మారింది.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కర్ణాటకలో గెలిచి తీరాల్చిందేనన్న పట్టుదలతో కాంగ్రెస్ సర్వశక్తులొడ్డుతోంది. పార్టీ అద్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీకి వచ్చే సార్వత్రిక ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొవాలంటే ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యం .. ఓడిపోతే మాత్రం త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ , రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కొనే నైతిక స్థైర్యాన్ని కాంగ్రెస్ కోల్పోతుంది. ఈనేపథ్యంలో రాహుల్ గాంధీ నాయకత్వ సమర్ధత మరోమారు చర్చనీయాంశమవుతుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీకి గట్టి పోటీనిచ్చిన రాహుల్ నాయకత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన కర్ణాటకలో విపక్షానికి మరింత పోటీనిచ్చి గెలుపు బాటకు మళ్లిస్తుందని హస్తవాసులు ఆశలు పెట్టుకున్నారు..  
తామే కింగ్ మేకర్ అంటున్న జేడీఎస్ కుమార స్వామీ.. 
అటు జనతాదళ్ పార్టీ ఉనికికి ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి.. దీని ప్రభావం పాత మైసూరుకే పరిమితమవుతుందో.. ఇతరత్రా ప్రాంతాలకు విస్తరిస్తుందో ఈఎన్నికలు నిగ్గు తేల్చనున్నాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు పూర్తి మెజార్టీ రాని పక్షంలో జేడీఎస్ పాత్ర కీలకం కానుంది. ఈనేపథ్యంలో ఆ పార్టీ దళపతులు దేవెగౌడ, కుమారస్వామిలు ఏకపక్షం వహిస్తారు.. లేదా.. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడతారా.. అనేది కీలకంగా మారింది. ఈ ఎన్నికల్లో తామే కింగ్ మేకర్ అంటూ పలు సార్లు ఆపార్టీ నేతలు చెబుతున్నారు... అయితే అలాంటి పరిస్థితి రాదని కాంగ్రెస్ , బీజేపీలు నేతలు చెప్పుకోస్తున్నారు.. 1985లో రామక‌ృష్ణ హెగ్డే నేతృత్వంలోని జనతాదళ్ రెండో సారి అధికారం చేపట్టింది. ఆతర్వాత నుంచి ఇప్పటి వరకు ఏపార్టీ కూడా రెండు సార్లు గెలవలేదు.. ఆ సంప్రదాయాన్ని ఈ సారి ఛేదించి మళ్లీ గద్దెనెక్కి చరిత్ర సృష్టిస్తామని సిద్ధారామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నారు...  
తెలుగు ఓటర్ల నాడీ ఎటో..! 
కర్ణాటకలో దాదాపు 50 స్థానాల్లో ముక్కోణపు పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. . పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్‌, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ సాగుతోంది. ముంబయి-కర్ణాటక, హైదరాబాద్‌-కర్ణాటక, మధ్య కర్ణాటకల్లో కాంగ్రెస్‌-బీజేపీల మధ్య పోటాపోటీ నెలకొంది. ఐదారు చోట్ల జేడీఎస్‌-బీజేపీల మధ్య కూడా రణం సాగుతోంది. కాంగ్రెస్‌ గెలిస్తే సిద్ధరామయ్య, బీజేపీ నెగ్గితే బి.ఎస్‌.యడ్యూరప్ప, అన్నీ అనుకూలిస్తే జనతాదళ్‌ నేత హెచ్‌.డి.కుమారస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశాలు ఉన్నాయి. . ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి, బాదామి రెండు చోట్ల పోటీ చేస్తుండగా. . మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శికారిపుర నుంచి, మరో మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెన్నపట్న, రామనగర రెండుచోట్ల నుంచి, మరో మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌ హుబ్బళ్లి-ధారవాడ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. సిద్ధరామయ్యకు పోటీగా బాదిమి నుంచి బీజేపీ తరుపున శ్రీరాములు బరిలో ఉన్నారు... మరోవైపు కర్ణాటక ఎన్నికల్లో తెలుగుఓటర్లు కీలకంగా మారనున్నారు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వనందున ఆగ్రహంగా ఉన్న తెలుగుఓటర్లు ఈ ఎన్నికల్లో ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.  
నకిలీ ఓటర్ కార్డుల కలకలం.. 
కర్ణాటకలో భిన్నమతాల ప్రజలతో పాటు కన్నడేతర భాషలు మాట్లాడే భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల జనాభా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంది. ఉత్తర కర్ణాటకలో మరాఠీలు, తూర్పు బెంగళూరు , దాని చుట్టు పక్కల జిల్లాల్లోని తెలుగు , తమిళం మాట్లాడేవారు ఎక్కువ . ఈ వర్గాల నుంచి దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు ఎన్నకవుతున్నారు... అటు కర్ణాటక ఎన్నికలలో ఆర్ఆర్ నగర్, జయనగర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.. రెండు ఇనుప పెట్టెల్లో భద్రపరిచిన 9,756 నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు బయట పడటంతో ఎన్నికల సంగ్రామంలో కలకలం రేపింది. తొలుత అక్కడ ఎన్నిక నిర్వహిస్తామని చెప్పిన ఎన్నికల సంఘం‌ ఉన్నట్టుండి దాన్ని కొద్ది రోజులు పాటు వాయిదా వేసింది. ఆర్‌.ఆర్‌ నగర్‌లో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ నియోజకవర్గంలో మే28 ఎన్నిక నిర్వహిస్తామని, మే 31న ఫలితాలు వెల్లడిస్తామని పేర్కొంది. నకిలీ ఓటర్ ఐడీలు పట్టుబడిన అపార్ట్‌మెంట్‌తో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతకు సంబంధం ఉందని బీజేపీ ఆరోపణలు చేసింది. దీనిపై కాంగ్రెస్ కూడా ఘూడంగా స్పందించింది.. అపార్ట్ మెంట్ భాజపా నేతకు చెందినదని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ కావాలనే ఇలాంటి వివాదాలు సృష్టింస్తోందని విమర్శించింది. ఓటర్ కార్డులతో పాటు ఓటర్ గుర్తింపు కార్డులు తయారు చేయడానికి సిద్ధంగా ఉంచిన మరో లక్ష పత్రాలను పట్టుకున్నారు.. అటు బీజేపీ అభ్యర్థి విజయకుమార్ మృతితో జయనగర స్థానానికి ఎన్నికలు వాయిదా ఈసీ వాయిదా వేసింది.  
ఆశతో సిద్ధరామయ్య.. 
కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత అంతగా కనించకపోవడం, లింగాయతులకు మతపరమైన మైనార్టీ హోదా వంటి అంశాలపై నమ్మకం పెట్టుకుంది. అటు బీజేపీ బెంగలూరు నగర సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, సాగు, తాగు నీటి సమస్యలు వంటి అస్త్రాలను బీజేపీ సంధించింది.. వాటిపైనే ప్రధానంగా నమ్మకం పెట్టుకుంది... బీసీ, ఎస్సీ , ఎస్టీ, అల్ప సంఖ్యాక వర్గాల కోసం చేపట్టిన భాగ్య వంటి సంక్షేమ పథకాలు మరోసారి గెలిపిస్తాయని సిద్ధరామయ్య ఆశతో ఉన్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ సర్కారుపై జనంలో అసంతృప్తిపై బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని మోడీ జనాకర్షణ, ప్రత్యర్ధుల వ్యూహలను చిత్తు చేస్తాడన్న పేరున్న అమిత్‌షాలపై కర్ణాటక బీజేపీ గంపెడాశలు పెట్టుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు 2శాతం ఓట్లు రావచ్చని సర్వేలు చెబుతున్నాయి..  
ఈ ఎన్నికల్లో  రాష్ట్ర బడ్జెట్ లో 25 శాతం ఖర్చు.. 
దక్షిణభారతదేశంలో జరుగుతున్న కర్ణాటక ఎన్నికల రణరంగంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ , జేడీఎస్ పార్టీల అభ్యర్ధులు ఈఎన్నికలలో అనధికారికంగా ఖర్చు సుమారు 25 వేల కోట్లపై మాటే అని జోరుగా ప్రచారం జరుగుతోంది. కర్ణటక ఎన్నికల కోసం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా దేశంలోని ప్రధాన నగరాల నుంచి కూడా పెద్ద ఎత్తున కరెన్సీ కట్టలు వరదలా అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులు పంచారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల దేశంలో జరిగిన ఏ ఎన్నికలలోనూ ఇంత భారీ స్థాయిలో ఖర్చు జరగలేదు.. అన్న వార్తలు వస్తున్నాయి.. కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ లక్షకోట్లు ఉంటే అందులో 25శాతం వరకు వివిధ పార్టీల అభ్యర్థులు ఇలా ఎన్నికలలో ధనాన్ని పంచినట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు తమ విజయం గురించి మాత్రమే కాకుండా ఎదుటి పార్టీలోని కీలక నేతలను ఈఎన్నికలలో తటస్థంగా ఉండమని కోట్లలో డబ్బు ఇస్తున్నారు అన్న వార్తలు వస్తున్నాయి..  
తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్స్..  
ఇది ఇలా ఉండగా నువ్వా నేనా అనే స్థాయిలో జరగుతున్న ఈఎన్నికలలో గెలుపు ఏపార్టీకి వస్తుంది అన్న దానిపై సుమారు 4వేల కోట్ల వరకు బెట్టింగ్స్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆశ్చర్యకరంగా కర్ణాటక ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేని తెలుగు రాష్ట్రాల్లోనూ జోరుగా అక్కడి గెలుపోటములపై బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటు 65లక్షల మంది ఉన్న తెలుగువారు ఏపార్టి వైపు మొగ్గుచూపుతారు అన్న దానిపై కోట్లలో బెట్టింగ్స్ జరుతున్నట్లు సమాచారం. దీనికి తోడు కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అన్ని రాజకీయ పార్టీలలోనూ పెను మార్పులు ఉంటాయి అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మినీ సెమీ ఫెనల్‌లా జరుగుతున్న ఈ కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు...  
వరదలా ధనం, మద్యం సరఫరా.. 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కర్ణాటక ఎన్నికలలో పెద్ద ఎత్తున ధన ప్రవాహం , మద్యం ఎరులై పారింది. ఎన్నికల, ఐటీ, ఇతర శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో గత ఎన్నికలతో పోలిస్తే ఐదు రెట్లు అధికంగా సొమ్ము , బంంగారాన్ని గుర్తించారు. ఎన్నికల నియమావలి అమలులోకి వచ్చిన మార్చి 27 నుంచి నిన్నటి వరకు సుమారు 113 కోట్ల రూపాయల నగదు, 176 కోట్ల రూపాయల విలువైన బంగారంతో పాటు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోనే ఎక్సైజ్ అధికారులు సుమారు 25 కోట్ల విలువైన ఐదు లక్షల 23వేల లీటర్ల దేశీయ మద్యం, 30 కోట్ల రూపాయల విలువైన విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు...  
ఈనెల 15నే కర్ణాటక ఫలితాలు.. 
ఏది ఏమైనప్పటికీ ఈఎన్నికలతో తమ భవితవ్యం తేలనుండటంతో వివిధ పార్టీల ముఖ్యనేతల్లో ఆందోళన తీవ్రస్ధాయికి చేరింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులను ఈఎన్నికల్లో నెగ్గుతామా లేదా అన్న మీమాంస పట్టిపీడిస్తోంది.... కర్ణాటక ప్రజలు ఏపార్టీకి పట్టం కట్టనున్నారో ఈనెల 15న తేలనుంది..

మరింత +
Hectic campaign ends on a bitter note in Karnataka 2018 Elections, poll tomorrow

కర్ణాటక కాంగ్రెస్ దేనా?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 2019కి సెమీ ఫైనల్స్ ను తలపించిన ఈ కర్ణాటక ఎన్నికలు ఈనెల 12 న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఆఖరి రోజు ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తించాయి. ఇక కర్నాటక కిరీటం ప్రజలు ఎవరికి కట్టబెడుతారనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 
2019కి సెమీ ఫైనల్స్ ను తలపించిన కర్ణాటక రాజకీయాలు
కన్నడనాట మైకులు మూగబోయాయి. నెలనర్ర రోజులుగా నేతల ప్రసంగాలతో హోరెత్తిపోయిన కర్నాటక రాష్ట్రం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ఇక పోలింగ్‌కు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ఇక 2019 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ప్రధాన పార్టీ నేతలంతా కర్నాటకలో పాతుకుపోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చివరి రోజు కూడా తన ప్రచారాన్ని కొనసాగించారు. బీజేపీ అధినేత అమిత్ షా, మాజీ సీఎం యడ్యూరప్ప పలు చోట్ల ఏర్పాటు చేసిన రోడ్ షోల్లో పాల్గొన్నారు. మరో వైపు... నమో యాప్ ద్వారా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ...గత నాలుగేళ్ళలో బీజేపీ సాధించిన అభివృద్ధిని వివరించారు. దళితుల అభ్యున్నతి కోసం కేంద్రం అనేక పథకాలను తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 12న జరిగే పోలింగ్‌కు సంబంధించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. 
ఎవరికి పట్టం కడతారో..?
ఇక...రసవత్తరంగా జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. చివరి ప్రయత్నంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారు. అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాగా వేసిన కమల నాథులు.. కర్ణాటకను సైతం తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నారు. మరో వైపు...కర్ణాటకలో తిరిగి అధికారంలోకి రావటం ద్వారా బీజేపీ జోరుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ రెండు పార్టీల మధ్య బరిలో ఉన్న జేడీఎస్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది. 
ఈ ఎన్నికల్లో 13 వేల కోట్లు చేతులు మారాయి..!
గురువారంతో ప్రచారం ముగియడంతో ఓటర్లపై ప్రలోభాల పర్వానికి రాజకీయ పార్టీలు తెరలేపాయి. భారీ ఎత్తున నగదు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఓ అంచనా ప్రకారం ఈ ఎన్నికల్లో సుమారు 13 వేల కోట్ల రూపాయల వరకు చేతులు మారవచ్చని తెలుస్తోంది. ఈసీ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ... ఓట్ల పంపిణీకి రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. దీంతో చివరి రెండు రోజులు కర్ణాటకలో కరెన్సీ వరద పారనుంది.  
జయనగర్ లో పోలింగ్ వాయిదా..
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉండగా... 223 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జయనగర్ ఎమ్మెల్యే ఈ సారి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్న విజయ్‌కుమార్ హఠాన్మరణంలో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. ఈనెల 12న జరిగే పోలింగ్‌కు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 58వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. వీటిలో మహిళల కోసం ప్రత్యేకంగా 600 కేంద్రాలను కేటాయించారు. ఇక... ఈ ఎన్నికల్లో 80 వేల ఈవీఎంల తో పాటు... మరో 80 వేల వీవీపాట్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు. శనివారం నాడు పోలింగ్ జరగనుండగా... 15వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

మరింత +
Government land in hands of Land Mafia in Hyderabad

భూ మాఫియా: ఖాళీగా కనిపిస్తే కబ్జానే

ప్రపంచస్థాయి నగరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్‌లో ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జారాయుళ్లు కన్నేస్తున్నారు.. ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా ఆభూములు తమదేనంటూ యదేచ్ఛగా దౌర్జన్యానికి దిగుతున్నారు.. అధికార పార్టీ నేతల అండడండలతో గద్దల్లా వాలిపోతున్నారు..రాజ్ న్యూస్ వరుస కథనాలతో కబ్జారాయుళ్లు బాగోతాలను బయట పెడుతోంది. 
హైదరాబాద్ లో కబ్జా రాయుళ్ల ఆగడాలు..
హైదరాబాద్‌లో కబ్జా రాయుళ్ల ఆగడాలకు అంతు పోంతు లేకుండా పోతోంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కన్నేస్తున్నారు. తాజాగా హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఖానామెట్‌లో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిపై కబ్జారాయుళ్లు కన్నేశారు... తాజాగా అధికార పార్టీ అండదండలతో 72 ఎకరాల అసైడ్ ల్యాండ్ కు రెక్కలు వచ్చాయి. 520 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు వారసులం అంటూ రంగంలోకి దిగారు. భూమి చదును చేసి.. బిల్డింగ్ లు నిర్మిస్తూ.. యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. అయితే భూ కబ్జా విషయాలను బయటపెట్టిన రాజ్ న్యూస్ ఆ భూమి భూ బకాసురుల పాలు కానివ్వకుండా పోరాడుతోంది. 
అధికార పార్టీ అండదండలతో..
ఖానా మెట్, హైదరాబాద్ కు గుండెకాయలాంటిది. అంతర్జాతీయ సదస్సు ఏది నిర్వహించాలన్నా అక్కడే .. వి.వి.ఐ.పీ.ల పెళ్లిళ్లు అక్కడే జరుపుకుంటారు. అలాంటి ఏరియాలో 72 ఎకరాల భూమి అంటే ఎవరు ఊరుకుంటారు. అందుకే అధికార పార్టీ అండదండలతో.. చిన్న పాటి లోసగులను అడ్డం పెట్టుకోని భూమిని కబ్జా చేస్తున్నారు. మెటల్‌ చార్మినార్‌కు దగ్గర నుంచి అరకిలో మీటర్ వరకు అంతా ప్రభుత్వ భూమియే. ఈ భూమి పక్కనే తుమ్మడి కుంట ఉంటుంది. కుంటలో నీళ్ల కంటే.. ఆ భూమి పైనే బడాబాబుల కన్ను ఉంటుంది.  
ఎన్.కన్వెన్షన్ పేరుతో ఎకరాల భూమి కబ్జా..
ఇప్పటికే హీరో నాగార్జున ఎన్.కన్వెన్షన్ పేరుతో 3 ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఆ తర్వాత ప్రభుత్వం కూల్చివేస్తామని నోటీసులు ఇచ్చింది. ఎంతో అర్బాటం చేసింది. కాని టీఆర్ఎస్ నేతలతో లాలుచీ పడి ఆ కబ్జాపై చర్యలు తీసుకోకుండా చేశారు. తాజాగా తమ్మడి కుంటకు అనుకొని ఉన్న 520 కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసేందుకు భూ బకాసురులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మార్వో ఎన్నిసార్లు నోటీసులిచ్చిన పట్టించుకోవడం లేదు.  
ఖానామెట్ లో అసైడ్ భూమిని కబ్జా..
ఖానామెట్ గ్రామంలోని సర్వే నెంబర్ 37 లో మూడు ఎకరాల 24 గుంటల భూమి తమ తాతలదని ఇంతియాజ్ అనే వ్యక్తి వచ్చి కబ్జా పెట్టాడు. ఎకరం స్థలంలో మట్టిపోసుకోని చదును చేశాడు. ఎవ్వరైనా వెళ్లి అడుగుతే.. భూమి తమ తాతది.. కొర్టులో కేసు ఉంది.. మేము ఆ భూమిని వాడుకోవడం లేదు. నర్సరీ పెట్టుకుంటామని అంటున్నారు. అటు అసైడ్ భూమిలో ఎలా చేసుకుంటారని అడిగే వారు లేరు. టీఆర్ఎస్.పార్టీ నేతలు అండగా ఉండటంతో దర్జాగా భూకబ్జా కొనసాగుతోంది. భూదందాను చిత్రికరిస్తున్న.. రాజ్ న్యూస్ సిబ్బందిని భూ కబ్జాదారులు అడ్డుకున్నారు.. దౌర్జన్యానికి దిగారు.. సర్వే నెం 37 తమదేనంటూ కబ్జారాయుళ్లు బుకాయించారు..  
కోట్లు పెట్టినా.. దొరకని భూమిని లక్షల్లో కొట్టేస్తున్నారు..
మరో స్వర్వే నెంబర్ 41/6. ఇందులో ఉన్న 5 ఎకరాల భూమి చుట్టు పహారా నిర్మించి యధేచ్చగా రెస్టారెంట్ కట్టెస్తున్నారు. గంగల ముత్యాలు అనే వ్యక్తికి 1962లో పట్టా ఉందని ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా.. ఆ పట్టా కాలంలో తమ తాతలే ఉన్నారు కాబట్టి ఆ భూమి మాదేనని నేతల అండదండలతో రెచ్చిపోతున్నారు. ఎవ్వరిని ఆ స్థలంలోకి రానివ్వకుండా కాపలదారులను పెట్టి రాత్రికి రాత్రియే నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత LRS, BRS ల స్కాంల కింద ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి వారి పేరు మీద చేయించుకుంటున్నారు. కోట్లు పెట్టిన దొరకని భూమిని లక్షల్లో కొట్టేస్తున్నారు.  
కబ్జా కోరల్లో చిక్కకుండా రాజ్ న్యూస్ అలుపెరగని పోరాటం..
ప్రభుత్వం ఈ కబ్జాలపై దృష్టి సారించకుంటే కోట్ల ప్రజల సోమ్ము భూ బకాసురుల చేతిలో చిక్కుకు పోవాల్సిందే. ఖానామెట్ అసైన్డ్ ల్యాండ్ కబ్జా కోరల్లో చిక్కకుండా రాజ్ న్యూస్ పోరాడుతోంది. ప్రజలకు చెందాల్సిన 520 కోట్ల భూమిని కాపాడేందుకు నడుం బిగించింది. మనం కూడా చేయి చేయి కలుపుదాం. ప్రభుత్వ భూమిని కాపాడుదాం. ఇదే నినాదంతో వరుస కధనాలను రాజ్ న్యూస్ ప్రసారం చేసింది. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. వెంటనే నిర్మాణాలు ఆపేయాలని ఆర్డర్లు ఇచ్చారు. కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.. స్టే గడువు ముగియండంతో రెవెన్యూ అధికారుల మరోసారి నోటీసులు ఇచ్చారు... అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటూ డౌన్ టౌన్ , బార్ అండ్ రెస్టారెంట్, స్సోర్ట్ విల్లా.. మరో నాలుగు ఇళ్లకు నోటీసులు అందజేశారు..  
రాజ్ న్యూస్ కథనానికి అధికారుల స్పందన..
ఖానామేట్ భూ భాగోతంపై రాజ్ న్యూస్ ఎఫెక్ట్ పడింది. స్పోర్ట్స్ విల్లా పేరుతో ఎకరం స్థలం కబ్జాకు ప్రయత్నించిన తీరుపై అధికారుల దృష్టికి రాజ్ న్యూస్ తీసుకెళ్లింది. దీంతో కబ్జా రాయుళ్లకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో స్వచ్ఛందంగా నిర్మాణాలు తొలగించకుంటే.. తామే కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇటు కొందరు అధికారులకు కబ్జా రాయుళ్లు లంచాల ఆశ చూపి 50 ఎకరాలు కాజేసే ప్రయత్నం చేశారు. ఇదే అంశంపై ఉన్నతాధికారులకు రాజ్ న్యూస్ ఫిర్యాదు చేసింది. అయినా అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.

మరింత +
Dust and rain storms in north and west India leave 91 dead, 160 injured

ఉత్తర భారతంలో ప్రకృతి విళయం

అకాల వర్షాలు, ఈదురు గాలులు ఉత్తర భారతదేశంలో బీభత్సం సృష్టించాయి. ఐదు రాష్ట్రాలను చిగురు టాకులా వణికించాయి. గాలి వాన బీభత్సానికి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రళాయాన్ని చూడలేదని ప్రజలు అంటున్నారు. కాలం కాని కాలంలో ప్రకృతి బీభత్సాన్ని తలచుకుని వణికి పోతున్నారు. 
ఐదు రాష్ట్రాల్లో గాలి వాన బీభత్సం
ఉత్తర భారతదేశంలో ఐదు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం కొనసాగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం వేకువ ఝాము వరకు భారీ వర్షం, ఈదురు గాలుల ధాటికి ప్రజలు వణికి పోయారు. ఉక్కసారిగా విరుచుకు పడిన విలయం ధాటికి ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించాయి. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలపై ఈ గాలివాన ప్రభావం తీవ్రంగా పడింది. ఉత్తర భారతంలో దాదాపు 100మందికి పైగా ప్రాణాలు కోల్పోగా... 140 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. 
ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు..
పలు ఉత్తరాది రాష్ట్రాల్లో బలమైన గాలులు, వర్షం ధాటికి పెద్ద పెద్ద వృక్షాలు సైతం కూలిపోయాయి. ఇళ్లు, రోడ్లు ధ్వంసమ్యాయి. విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో మరో రెండ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
రాజస్థాన్‌లో బలమైన గాలులు, దుమ్ము..
ఇక..రాజస్థాన్‌లో బలమైన గాలులు, దుమ్ముతో కూడిన తుపాను ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. పెను గాలులు, దుమ్ముతో కూడిన తుపాను మొదలై రెండు గంటల పాటు బీభత్సం సృష్టించింది. రాజస్థాన్‌లో గాలివాన ధాటికి ఇళ్లు కూలిపోవడం వల్ల చాలా మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. 
బద్రీనాథ్‌ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి..
ఇటు... ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల ధాటికి అక్కడ కొనసాగుతున్న ఛార్‌ ధామ్‌ యాత్రకు అంతరాయం కలిగింది. రహదారులపై కొండచరియలు విరిగిపడడంతో వాటిని తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. బద్రీనాథ్‌ హైవేపై కొండచరియల కూలడం వల్ల వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. పంజాబ్‌, హరియాణాల్లోనూ ఈదురుగాలులు, దుమ్ముతో కూడిన తుపాను సంభవించింది. పలు చోట్ల వర్షాలు కురిశాయి. రాజధాని నగరం ఢిల్లీలో కూడా భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. మొత్తం మీద.. ఉత్తరాది రాష్ట్రాల్లో అకాల వర్షాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించాయి. 
తెలుగు రాష్ట్రాల్లో 15 మంది మృతి...
తెలుగు రాష్ట్రాల్లో కూడా అకాల వర్షాలకు ప్రాణనష్టం జరిగింది.తెలంగాణలో గురువారం సాయంత్రం గాలివాన.. బీభత్సం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది మృత్యువాతపడ్డారు. పలు జిల్లాల్లో ఇళ్లు, భారీ వృక్షాలు కూలిపోయాయి. హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాలు విలవిల్లాడాయి. చెట్లు, హోర్డింగ్‌లు కూలి నష్టం సంభవించింది.ప్రకృతి ప్రకోపానికి ఆంధ్రప్రదేశ్‌ అల్లకల్లోలమైంది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో గాలిదుమారం పెను బీభత్సాన్నే సృష్టించింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి, చెట్లు విరిగి పడి ఏడుగురు మృతి చెందారు. విశాఖపట్నంలో కురిసిన వర్షంతో ఇళ్లలోకి నీరు చేరింది. కింగ్‌జార్జ్‌ ఆసుపత్రిలోని పిల్లలవార్డులో, అలాగే అత్యవసర సేవల విభాగంలోకి నీరు వచ్చింది. మరో రెండు రోజుల పాటు ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

మరింత +
Sand mafia ruling the roost with the backing of government’, says Telangana CPM secretary

పెట్రేగిపోతున్న ఇసుక మాఫియా!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫిగా రెచ్చిపోతుంది. వాల్టా చట్టాల ఊసే మరిచి.. భుగర్భజలాల్ని మొత్తం మటుమాయం చేస్తోంది. భవిష్యత్ తరాలకేమోగానీ.. వర్తమానంలోనే మనుషులకు నీటికటకట ఏర్పడుతున్న పరిస్థితుల్లో.. ఇసుక మాఫియాపై రాజ్ న్యూస్ నిఘాలో న‌మ్మ‌లేని విషయాలు  ప్రజల నాలుకల్లో నానుతోంది.
రాష్ట్రంలో పెరుగుతున్న ఇసుక మాఫియా ఆగడాలు    ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. అదేస్థాయిలో అనుకుంటున్నారా..? ఏకంగా ప్రభుత్వాన్ని శాసించేంత.. సమాంతర సర్కారునే నడిపేంత. అవునూ.. అసలు కథలోకి వెళ్తే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జీవనదైన గోదావరి, మానేరులతో పాటు.. మూలవాగు, ఇతరత్రా కొన్ని వాగులవద్ద నాణ్యమైన ఇసుక లభిస్తుంది. దీంతో కరీంనగర్ మానేరు తీరం నుంచి మొదలుకుంటే.. ఇతర.రాష్ట్రాల గోదావరి తీర అటవీప్రాంతమైన మహదేవపూర్ వరకూ.. మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్, కొత్తపల్లి నుంచి.. ఇల్లంకుంట మీదుగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లో మానేరు తీరాల వరకూ.. మరోవైపు.. ధర్మపురి నుంచి కాళేశ్వరం వరకూ.. ఇసుకమాఫియా పెట్రేగిపోతోంది.  
ఇసుక మాఫియా వెనకాల ఎవరున్నారంటే..?    గత రెండు నెలల కాలంలో.. కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ కెమెరా లతో నిఘా పెట్టి.. దాదాపు 500 ఇసుక నిల్వలు గుర్తించి పట్టుకున్నట్టు స్వయానా పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డే తెలిపారు. ఎండుగడ్డి, పచ్చిగడ్డి కింద ఇంతకాలం ఇసుక డంపులను దాచిపెట్టిన.. మాఫియా ఇప్పుడు ఎర్రమట్టి కింద దాచిపెడుతున్న పరిస్థితి. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా.. అవి నామమాత్రమేనని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇసుకమాఫియాలో అధికార పార్టీ నాయకుల హస్తం ప్రధానంగా కనిపిస్తుంది. కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలతో పాటు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రీచులెక్కడ ఉంటే అక్కడికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఆయన అనుచరగణం విస్తరిస్తున్న పరిస్థితి. పైగా వ్యవసాయం కోసం సాయంగా.. సబ్సిడీ కింద ఇచ్చే ట్రాక్టర్లన్నీ అధికార పార్టీ నేతలకే దక్కడం ఓవైపు విమర్శలకు తావిస్తున్న క్రమంలో.. ఆయా ట్రాక్టర్లన్నీ ఇప్పుడు ఇసుక అక్రమ రవాణా వాహనాలుగా పనిచేయడం.. ఇసుక తిమింగలాలు సమాంతర మాఫియాగా మారి.. ఏమేం చేస్తున్నారో కళ్లకు కడుతుంది.  
మంత్రి ఈటెల రాజేందర్ ఇలాఖాలోనూ..!   కరీంనగర్ పక్కనే ఉన్న ఖాజీపూర్ లోనైతే.. ఇంటికో ట్రాక్టర్.. ఇదే పనిలో నిమగ్నమవుతున్న పరిస్థితి. మానేరులో ఇసుకతోడేళ్లతో.. భుగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోతుండగా.. తిమ్మాపూర్, కొత్తపల్లి వద్ద కూడా అధికారపార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. ఇక మంత్రి ఈటెల రాజేందర్ ఇలాఖాలోనూ చల్లూరు, జమ్మికుంట పరిసర ప్రాంతాల్లో మానేరు తీరం వెంబడి ఇసుక అక్రమవ్యాపారం యధేచ్ఛగా సాగుతోంది.  
ఇసుక అక్రమరవాణాకు కేరాఫ్ అడ్రస్ గా..సిరిసిల్ల    ఇక కరీంనగర్ పరిస్థితి ఆవిధంగా ఉంటే.. మైనింగ్ శాఖా మాత్యులు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా.. ఇసుక అక్రమరవాణాకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. తంగళ్లపల్లి నుంచి రోజుకు నాల్గువందల వరకూ ఇసుకలారీలు, ట్రాక్టర్లు యధేచ్ఛగా తిరుగుతుంటాయి. ఓసారి కరీంనగర్ చుట్టుపక్కల రీచుల్లో హడావిడి చేసిన మైనింగ్ మంత్రి కేటీఆర్, ఆయన అనుచరులే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇసుకమాఫియాకు కొమ్ముకాస్తూ.. యధేచ్ఛగా సంపాదించుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. కొదురుపాకకు చెందిన ప్రస్తుత రాజ్యసభ సభ్యులు.. జోగినపల్లి సంతోష్ కుమార్, ఆయన అనుచరులూ.. మూలవాగు, మానేరు తీరాల నుంచి ఇసుకను తోడేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇక అక్రమ ఇసుక రవాణాపై ప్రశ్నించిన వారిని మంత్రుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు..  
అక్రమంగా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న ఇసుక మాఫియా!     ఇక ప్రస్తుతం పెద్దపెల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోకెళ్తే.. మంథని నియోజకవర్గంలోనైతే.. పరిస్థితి మరింత దారుణం. ఇక్కడ వందల కోట్ల రూపాయల ఇసుక అక్రమదందా సాగుతోంది. ప్రభుత్వం ఇసుక తరలింపు కోసం మంథని నియోజకవర్గంలో ఇసుక రీచులను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మస్తున్న అన్నారం,మేడిగడ్డ, సుందిళ్ళ బ్యారేజీల నిర్మాణంతో.. కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుక మునిగిపోతుందని.. ప్రభుత్వం సుమారు 25 క్వారీలకు ఇక్కడ అనుమతినిచ్చింది. TSMDS ద్వారా ఇసుక తరలింపు, ఆన్ లైన్ చెల్లింపులను చేపట్టింది. అయితే క్వారీలో నిర్వాహ‌కులు ఇసుక దందాను యథేచ్చగా నడిపిస్తున్నారు.ఇక్కడి ఎమ్మెల్యే పుట్టమధు, ఆయన అనుచరుల కనుసన్నల్లోనే ఇసుకదందా సాగుతుండగా.. ఇక్కడ కూడా మల్లారం రీచు అధికారికంగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేరుమీదే నడుస్తోంది. గంగులకూ, పుట్టమధుకు ఉన్న బంధుత్వం, ఇద్దరూ అధికార పార్టీ నాయకులే కావడం వల్ల.. అటు కరీంనగర్, మంథని.. ఇలా ఎక్కడ చూసినా ఈ ఇసుక తిమింగలా లాడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ప్రభుత్వనికి ఇసుకతో వచ్చే ఆదాయం వాటా దేవుడెరుగుగాని.. ఇసుక మాఫియా మాత్రం అక్రమంగా కోట్లది రూపాయలు దండుకుంటున్నారు.  
యధా రాజా.. తధా మంత్రులు!    ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇసుకమాఫియాకు.ఓ కల్పతరువుగా మారాక.. ఎందుకింకా చర్యలుంటాయి..? మంత్రులు, ఎమ్మెల్యేలు, అనుచరులు, స్థానిక నేతలు, కొంతమంది ప్రతిపక్ష నేతలు, రెవెన్యూ, మైనింగ్, పోలీస్ ఇలా అన్ని శాఖల అధికారులు కలిసి.. ఎవరి వాటాలు వాళ్లు పుచ్చుకుంటూ వాళ్లాడిందాట అన్నచందంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఇక్కడ సర్వసాధారణమైపోయాయి.

మరింత +